ఉద్యాన పంటలకు.. హార్టికల్చరిస్ట్
Sakshi Education
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా కార్యాలయంలో కూర్చొని చేసే డెస్క్ జాబ్ మీకిష్టం లేదా? నిత్యం ప్రకృతి ఒడిలో ఉంటూ, పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ పనిచేసుకోవాలనుకుంటున్నారా? అయితే, మీలాంటి వారికి సరిగ్గా సరిపోయే కెరీర్.. హార్టికల్చరిస్ట్. ప్రస్తుతం హార్టికల్చరిస్ట్‌లకు లెక్కలేనన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. దీన్ని కెరీర్‌గా ఎంచుకుంటే ప్రకృతిని కాపాడుతూ, ప్రజల ఆహార అవసరాలను తీరుస్తూ సమాజానికి సేవ చేస్తున్నామన్న వృత్తిపరమైన సంతృప్తి దక్కుతుంది.
ఉద్యోగాలు, పరిశోధనలు : హార్టికల్చరిస్ట్‌లు ప్రధానంగా సుందరమైన ఉద్యాన వనాల పెంపకంతోపాటు పండ్లు, కూరగాయలు, పూల ఉత్పత్తిని చేపట్టాల్సి ఉంటుంది. క్రాప్ ప్రొడక్షన్, ప్లాంట్ బ్రీడింగ్, క్రాస్-బ్రీడింగ్, ప్లాంట్ బయోకెమిస్ట్రీ, ప్లాంట్ ఫిజియాలజీ తదితర రంగాల్లో పరిశోధనలు చేయాలి. నాణ్యమైన, అధిక పోషకాలతో కూడిన ఫలసాయమిచ్చే మొక్కలను సృష్టించాలి. ఉద్యాన పంటలన్నీ హార్టికల్చరిస్ట్ పరిధిలో ఉంటాయి. హార్టికల్చర్‌లో వెజిటెబుల్ సైన్స్, ఫ్రూట్ టెక్నాలజీ, ఫ్లోరికల్చర్ అనే స్పెషలైజేషన్లు ఉన్నాయి. హార్టికల్చరిస్ట్‌లకు ప్రస్తుతం ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాల్లో ఎన్నో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలు, ఫామ్‌హౌస్‌లు వీరికి స్వాగతం పలుకుతున్నాయి. రహదారుల పక్కన పచ్చదనాన్ని అభివృద్ధి చేసేందుకు హైవే అథారిటీలు వీరిని నియమించుకుంటున్నాయి. ఇక సొంతంగా నర్సరీని ఏర్పాటు చేసుకొని అగ్రిప్రెన్యూర్‌గా ఉపాధి పొందొచ్చు. పరిశోధనా రంగంలో చేరితే అధిక వేతనాలు అందుకోవచ్చు. ఆసక్తి ఉంటే కన్సల్టెంట్‌గా కూడా ప్రజలకు సేవలందించొచ్చు.
కావాల్సిన స్కిల్స్: ఈ రంగంలో శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. హార్టికల్చరిస్ట్‌కు ప్రకృతిపై ఇష్టం, క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే తత్వం ఉండాలి. కొత్త వంగడాల అభివృద్ధికి, నాణ్యమైన పండ్లు, కూరగాయలను ఉత్పత్తి చేసేందుకు శాస్త్రీయ దృక్పథం అవసరం. ఈ రంగంపై ఎప్పటికప్పుడు పరిజ్ఞానం పెంచుకోవాలి. అందమైన వనాలను పెంచేందుకు సృజనాత్మకత ఉండాలి.
అర్హతలు: భారత్‌లో అగ్రికల్చర్ సైన్స్‌లో వివిధ కోర్సులున్నాయి. గ్రాడ్యుయేషన్ తర్వాత రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ హార్టికల్చర్ కోర్సుల్లో చేరొచ్చు. పరిశోధనా రంగంలో అడుగుపెట్టాలంటే డాక్టరేట్ పూర్తిచేయాలి. హార్టికల్చరిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించాలంటే పీజీ చేస్తే సరిపోతుంది.
వేతనాలు: హార్టికల్చరిస్ట్/సూపర్‌వైజర్‌కు ప్రారంభంలో నెలకు రూ.12 వేల వేతనం అందుతుంది. తర్వాత సీనియారిటీని బట్టి మేనేజర్/సీనియర్ మేనేజర్‌కు నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు లభిస్తుంది. ఇక డెరైక్టర్ స్థాయికి చేరుకుంటే నెలకు రూ.లక్షకు పైగానే అందుకోవచ్చు.
కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం-హైదరాబాద్
వెబ్‌సైట్: www.angrau.ac.in
డాక్టర్ వైఎస్‌ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.drysrhu.edu.in
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ టెక్నాలజీ
వెబ్‌సైట్: www.iht.edu.in
ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-ఢిల్లీ
వెబ్‌సైట్: www.iari.res.in

ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో స్థిరపడొచ్చు
‘‘దైనందిన కార్యకలాపాలకు అవసరమైన కోర్సులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. వ్యవసాయ ప్రధానమైన భారతదేశంలో అగ్రికల్చర్, అనుబంధ విద్యకు గిరాకీ తగ్గదు. హార్టికల్చర్‌లో గ్రాడ్యుయేషన్, పీజీ, డిప్లొమా కోర్సులను పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో అవకాశాలున్నాయి. ఉద్యానవన, విత్తనాభివృద్ధి సంస్థల్లో పనిచేయవచ్చు. స్వయం ఉపాధి పొందుతూ మరికొందరికి మార్గం చూపాలంటే నర్సరీలు, సీడ్ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు. విద్యా సంస్థల్లో ఫ్యాకల్టీగానూ పనిచేయొచ్చు’’
- డాక్టర్ బి.ఎం.సి.రెడ్డి, వైస్‌ఛాన్సలర్,
డాక్టర్ వై.ఎస్.ఆర్.హార్టికల్చరల్ యూనివర్సిటీ

Published date : 17 Sep 2014 10:08AM