మూడు విధానాల్లో అకడమిక్ కొలాబరేషన్స్.. వివరాలు తెలుసుకోండిలా..
ట్విన్నింగ్ ప్రోగ్రామ్స్..
అకడమిక్ కొలాబరేషన్స్, ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్‌లో అత్యంత ప్రధానమైందిగా గుర్తింపు పొందిన విధానం..ట్విన్నింగ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ప్రకారం-మన దేశంలోని ఇన్‌స్టి ట్యూట్, మరో దేశంలోని యూనివర్సిటీతో కోర్సు పరంగా ఒప్పందం చేసుకుంటాయి. దాని ఆధారంగా సదరు కోర్సును నిర్దిష్ట వ్యవధిలో మన దేశంలో, మరికొద్దికాలం ఒప్పందం కుదుర్చుకున్న విదేశీ ఇన్‌స్టిట్యూట్ క్యాంపస్‌లోనూ ప్రత్యక్షంగా అభ్యసించే అవకాశం కల్పిస్తారు. దీనివల్ల విద్యార్థులకు విదేశీ ఇన్‌స్టిట్యూట్‌ల ఫీజుల భారం తగ్గుతుంది. రెండు దేశాల ఇన్‌స్టిట్యూట్‌లకు సంబంధించిన సర్టిఫికెట్లు లభిస్తాయి. ఒప్పందం కుదుర్చుకున్న దేశంలోని జాబ్ మార్కెట్, అక్కడి నైపుణ్యాలపైనా అవగాహన వస్తుంది. ఫలితంగా విద్యార్థులకు సదరు విదేశంలో ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు అన్వేషించే అవకాశం కూడా లభిస్తుంది.
ప్రాంఛైజింగ్ లేదా ఇంటర్నేషనల్ క్యాంపస్..
అకడమిక్ కొలాబరేషన్‌లో మరో విధానం.. విదేశీ యూనివర్సి టీలు మన దేశంలోనే తమ సెంటర్లను నెలకొల్పడం. ఇందు కోసం నిర్దిష్టంగా ఒక ఇన్‌స్టిట్యూట్‌తో ఒప్పందం చేసుకోవచ్చు లేదా సొంతంగా నిర్వహించుకోవచ్చు. దీనివల్ల విద్యార్థులు దేశం వీడకుండానే.. విదేశీ యూనివర్సిటీలో చదివే అవకాశం లభిస్తుంది. విదేశీ యూనివర్సిటీ సర్టిఫికెట్ కూడా చేతికందు తుంది. ఇప్పటికే పలు విదేశీ యూనివర్సిటీలు మన దేశంలో ఆఫ్‌షోర్ సెంటర్లు ఏర్పాటుచేసి.. బోధన సాగిస్తున్నాయి.
డబుల్ డిగ్రీ/ఆర్టిక్యులేషన్..
అకడమిక్ కొలాబరేషన్ విధానంలో మరో ముఖ్యమైన విధానం.. డబుల్ డిగ్రీ లేదా ప్రోగ్రామ్ ఆర్టిక్యులేషన్. దీని ప్రకారం బ్యాచిలర్ లేదా మాస్టర్ కోర్సులో చేరిన విద్యార్థి.. ప్రథమార్థం స్వదేశంలో చదవాల్సి ఉంటుంది. ద్వితీయార్థం సదరు ఇన్‌స్టిట్యూట్ ఒప్పందం చేసుకున్న విదేశీ ఇన్‌స్టి ట్యూట్‌లో విద్యను అభ్యసిస్తారు. ఈ విధానంలో విద్యార్థులకు రెండురకాల సర్టిఫికెట్లు అందుతాయి. ప్రథమార్థం స్వదేశంలో పూర్తిచేసిన సమయంలో.. స్వదేశీ ఇన్‌స్టిట్యూట్ సర్టిఫికెట్ లభిస్తుంది. అలాగే ద్వితీయార్థం విదేశీ యూనివర్సిటీలో కోర్సు పూర్తిచేసిన సమయంలో బ్యాచిలర్ లేదా మాస్టర్ సర్టిఫి కెట్ అందుతుంది. దీంతో విద్యార్థులకు విదేశీ యూనివర్సిటీ అందించిన సర్టిఫికెట్ ఆధారంగా.. సదరు విదేశీ యూనివ ర్సిటీకి అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపు ప్రాతిపదికగా.. పలు దేశాల్లో ఉద్యోగాలకు, ఉన్నత విద్యకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లోని జేఎన్‌టీయూ-కాకినాడ,హైదరాబాద్.. స్వీడన్‌లోని బెల్కింగ్ ఇన్‌స్టిట్యూట్‌తో ఒప్పందం చేసుకొని.. బీటెక్+ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ డబుల్ డిగ్రీ ప్రోగ్రామ్‌ను అందిస్తున్నాయి.
ఇంకా చదవండి: part 4: దేశ వ్యాప్తంగా స్టూడెంట్ ఎక్ఛేంజ్ ప్రోగ్రామ్స్‌పై ఆసక్తి చూపుతున్న విద్యార్థులు..!