మార్కెటింగ్‌లో పెరుగుతున్న అవకాశాలు.. ఆదాయమూ!
Sakshi Education
ఆదాయం సరిగ్గా లేక ఉద్యోగాలు ఊడుతున్నా ఈ తరుణంలో.. కొన్ని కంపెనీలు ఉద్యోగులకు లే ఆఫ్‌లతో సగం జీతాలు మాత్రమే ఇస్తున్న కష్టకాలంలోనూ మార్కెటింగ్ జాబ్స్‌కి డిమాండ్ పెరుగుతోంది.. ఆ జాబ్ ప్రొఫైల్స్ సంబంధించిన వివరాల సమాచారం ఇదిగో..
డిజిటల్ మార్కెటర్..
{పస్తుత పరిస్థితుల్లో డిమాండ్ ఉన్న మరో జాబ్ ప్రొఫైల్.. డిజిటల్ మార్కెటర్. సంస్థ అందిస్తున్న ప్రొడక్ట్స్, సేవలను డిజిటల్ మాధ్యమాలు ముఖ్యంగా వెబ్‌సైట్స్, బ్లాగ్స్, సోషల్ మీడియా వంటి వాటిద్వారా మార్కెటింగ్ చేయడమే డిజిటల్ మార్కెటర్స్ ప్రధాన విధులు. అంటే.. ఆన్‌లైన్ ద్వారా సంస్థ ప్రొడక్ట్స్‌ను వినియోగదారులు కొనుగోలు చేసేలా చూడాల్సి ఉంటుంది. ఈ విభాగంలో రాణించాలంటే.. టెక్నికల్ స్కిల్స్‌తోపాటు రైటింగ్ స్కిల్స్, క్రియేటివిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్ వంటి నైపుణ్యాలు ఉండాలి.
సేల్స్ అండ్ మార్కెటింగ్ రిప్రజెంటేటివ్స్..
ఐటీ నుంచి సర్వీస్ సెక్టార్ వరకూ.. ఎవర్ గ్రీన్‌గా నిలుస్తోంది.. సేల్స్ అండ్ మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ ప్రొఫైల్!! ఏ సంస్థ అయినా అది అందించే ప్రొడక్ట్‌లను విక్రయించగలిగితేనే వృద్ధి సాధించగలదు. అందుకే ఆర్థిక మందగమన పరిస్థితుల్లోనూ సేల్స్ అండ్ మార్కెటింగ్ రిప్రజెంటేటివ్స్‌కు డిమాండ్ నెలకొంది. బ్యాచిలర్ డిగ్రీ అర్హత, కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్ నైపుణ్యాలు, కస్టమర్ బిహేవియర్ స్కిల్స్, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్కెటింగ్ విధానాలపై అవగాహన ఉంటే.. ఈ కొలువు సొంతం చేసుకోవచ్చు. పనితీరు, ప్రతిభ ఆధారంగా భవిష్యత్తులో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, మార్కెటింగ్ డెరైక్టర్ స్థాయి వరకు ఎదగొచ్చు.
ఇంకా చదవండి: part 6: కష్టాల నుంచి పునరుద్ధరణ బాటలో సాగుతున్న సంస్థలు.. పెరుగుతున్న నియమకాలు

Published date : 22 Sep 2020 05:16PM