ఇంటర్నేషనల్ కొలాబరేషన్ కోర్సుల్లో చేరే విద్యార్థులు దృష్టి సారించాల్సిన అంశాలు ఇవే..
Sakshi Education
ఇంటర్నేషనల్ కొలాబరేషన్ కోర్సుల్లో చేరే విద్యార్థులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఒప్పందం కుదుర్చుకున్న విదేశీ యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌కు ఆ దేశంలో ఉన్న గుర్తింపు, కరిక్యులం పరంగా బోధించే అంశాల గురించి తెలుసుకోవాలి.
అలాగే వాటికి లభించే క్రెడిట్స్, క్రెడిట్స్ బదిలీ సదుపాయం వంటి అంశాలపై దృష్టిసారించాలి. సదరు యూనివర్సిటీ ఇచ్చే జాయింట్ సర్టిఫికెట్‌కు అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపు గురించి కూడా తెలుసుకోవాలి. ఇలా.. పలు రకాలుగా అమలవుతున్న అకడమిక్ కొలాబరేషన్స్ ఫలితంగా మన విద్యార్థులకు గ్లోబల్ నైపుణ్యాలు సొంతమవుతాయి. అలాగే అంతర్జాతీయంగా ఉద్యోగం, ఉన్నత విద్య అవకాశాలు అందుకోవడంలోనూ తోడ్పడుతున్నాయి.
ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్.. ముఖ్యాంశాలు
- నూతన విద్యావిధానం ప్రకారం-టాప్-100 వర్సిటీస్‌తో కొలాబరేషన్‌కు అవకాశం.
- అకడమిక్ ఎక్స్ఛేంజ్ అండ్ రీసెర్చ్ విధానం ప్రకారం-టాప్-500 ఇన్‌స్టిట్యూట్స్‌లో చదివే వీలు.
- విదేశీ విద్య లక్ష్యంగా చేసుకున్న విద్యార్థులకు చక్కటి మార్గంగా ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్.
- ఒకే సమయంలో రెండు దేశాలకు చెందిన ఇన్‌స్టిట్యూట్స్ నుంచి వేర్వేరుగా సర్టిఫికెట్స్.
- అకడమిక్ కొలాబరేషన్ విధానంతో సులభంగా వీసా నిబంధనలు.
- ట్విన్నింగ్ ప్రోగ్రామ్స్‌లో భాగంగా అంతర్జాతీయ దృక్పథంతో రూపొందించే కరిక్యులంను అభ్యసించొచ్చు.
- డబుల్ డిగ్రీ విధానంలో విదేశాల్లో ఒక సెమిస్టర్ వ్యవధిలో చదివినప్పుడు.. అక్కడ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి.. వాటిలో పొందిన క్రెడిట్స్‌ను స్వదేశంలోని కోర్సులో కలిపే అవకాశం.
- ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ కోణంలో.. టాప్-5 డెస్టినేషన్స్‌గా అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ.
- ఇప్పటికే ఐఐఎంలు, ఐఐటీలు, ఇతర ప్రముఖ యూనివర్సిటీల్లో కొలాబరేటివ్ ప్రోగ్రామ్స్.
- ఏఐసీటీఈ, యూజీసీ నిబంధనల ప్రకారం-స్డూడెంట్ ఎక్స్ఛేంజ్, కొలాబరేటివ్ ప్రోగ్రామ్స్‌కు అవకాశం.
ఇంకా చదవండి: part 6: అబ్రాడ్‌లో చదవాలనుకుని మిస్సయిన వారికి బెస్ట్ ఆల్టర్నెటివ్ ఇదే..
Published date : 30 Jan 2021 03:07PM