Skip to main content

ఏఆర్‌ఎస్ (ప్రిలిమినరీ/నెట్)-2015

పరిశోధనల ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చటమే లక్ష్యంగా అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఏఎస్‌ఆర్‌బీ) ఏర్పడింది. ఇందులో భాగంగా ఏఎస్‌ఆర్‌బీ ఏటా అగ్రికల్చరల్ రీసెర్చ్ సర్వీస్ (ఏఆర్‌ఎస్) ఎగ్జామినేషన్ నిర్వహిస్తోంది. ఈ పరీక్షలో ప్రతిభ చూపితే భారత వ్యవసాయ పరిశోధన మండలి ఆధ్వర్యంలోని వివిధ సంస్థల్లో శాస్త్రవేత్తలుగా కెరీర్ ప్రారంభించొచ్చు. దీంతో పాటు నెట్ అర్హతతో వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో లెక్చరర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా స్థిరపడవచ్చు.
  • ఏఆర్‌ఎస్(ప్రిలిమినరీ/నెట్): ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, వైవా-వాయిస్‌ల ద్వారా అభ్యర్థులను అగ్రికల్చరల్ రీసెర్చ్ సర్వీస్‌కి (ఏఆర్‌ఎస్) ఎంపిక చేస్తారు.
    • ఏఆర్‌ఎస్ (ప్రిలిమినరీ): ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో వచ్చిన మార్కులను తుది ఎంపికలో పరిగణలోకి తీసుకోరు. ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు మాత్రమే మెయిన్ రాసేందుకు అర్హులు. గరిష్టంగా జనరల్ అభ్యర్థులు ఆరు సార్లు, ఓబీసీ, పీహెచ్‌డీ అభ్యర్థులు తొమ్మిది సార్లు ఏఆర్‌ఎస్ పరీక్షకు హాజరు కావొచ్చు. ఎస్సీ, ఎస్టీలకు మాత్రం ఎలాంటి పరిమితి లేదు.
    • నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్): ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఏఎస్‌ఆర్‌బీ నెట్ సర్టిఫికెట్ అందిస్తుంది. ఈ సర్టిఫికెట్ ద్వారా రాష్ర్ట ప్రభుత్వ ఆధీనంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలతో పాటు దేశంలోని ఇతర అగ్రికల్చరల్ యూనివర్సిటీలలో లెక్చరర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు (అన్ని కేటగిరీలు) నెట్ పరీక్షకు గరిష్టంగా ఐదుసార్లు హాజరు కావొచ్చు.
    • అర్హత(ఏఆర్‌ఎస్/నెట్): 2016, ఫిబ్రవరి 21 నాటికి యూజీసీ/ఐకార్ గుర్తింపున్న విశ్వవిద్యాలయాల నుంచి వ్యవసాయ అనుబంధ సబ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణత ఉండాలి.
    • వయసు: 2015, ఆగస్టు 1 నాటికి 21 ఏళ్లు నిండిన వారంతా నెట్ పరీక్ష రాయవచ్చు. నెట్‌కు సంబంధించి ఎలాంటి గరిష్ట వయోపరిమితి లేదు. ఏఆర్‌ఎస్ పరీక్షకు 32 ఏళ్లలోపు వారు అర్హులు. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలు అనుసరించి గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
    • ఫీజు: జనరల్/ఓబీసీ-కేటగిరీ అభ్యర్థులకు ఏఆర్‌ఎస్‌ఈ దరఖాస్తు ఫీజు రూ. 500, నెట్ దరఖాస్తు ఫీజు రూ. 1,000. రెండింటికీ దరఖాస్తు చేసుకుంటే రూ.1,500 చెల్లించాలి. ఏఆర్‌ఎస్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. నెట్‌కు మాత్రమే దరఖాస్తు చేసుకునే వారు రూ. 250 చెల్లించాలి. రెండింటికీ దరఖాస్తు చేసుకున్నా ఇదే మొత్తాన్ని ఫీజుగా చెల్లించాలి. ఏఆర్‌ఎస్, నెట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే మహిళలకు ఎలాంటి ఫీజు లేదు. ఫీజు మొత్తాన్ని క్రెడిట్/డెబిట్ (అన్ని బ్యాంకులు) కార్డుల ద్వారా చెల్లించవచ్చు లేదా ఏదైనా సిండికేట్ బ్యాంక్ బ్రాంచ్ ద్వారా ఈ మొత్తాన్ని చెల్లించవచ్చు.
    • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దర ఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఏ పరీక్షకు (నెట్/ఏఆర్‌ఎస్/నెట్+ఏఆర్‌ఎస్) దరఖాస్తు చేస్తున్నారో స్పష్టంగా పేర్కొనాలి.
    • వెబ్‌సైట్: https://www.asrb.org.in  

పరీక్ష విధానం:
  • ఏఆర్‌ఎస్ (ప్రిలిమినరీ/నెట్): ఏఆర్‌ఎస్ ప్రిలిమినరీ, నెట్ పరీక్షలను ఒకే పరీక్షగా ఏఎస్‌ఆర్‌బీ నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. రెండు గంటల్లో సమాధానాలను గుర్తించాలి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులు కోత విధిస్తారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారిలో నుంచి 1:15 నిష్పత్తిలో కేటగిరీల వారీగా అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు.
  • ఏఆర్‌ఎస్ (మెయిన్): ఈ పరీక్షను డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష మొత్తం 240 మార్కులకు ఉంటుంది. పరీక్ష కాలవ్యవధి మూడు గంటలు. మెయిన్ పేపర్ మూడు విభాగాలుగా ఉంటుంది.
  • పార్ట్-ఎ: మొత్తం 40 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు. సమాధానాలను క్లుప్తంగా రాయాల్సి ఉంటుంది.
  • పార్ట్-బి: 20 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఐదు మార్కులు.
  • పార్ట్-సి: ఈ విభాగంలో ఆరు ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు పది మార్కులు ఉంటాయి.
  • వైవా-వాయిస్: ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల్లో అర్హత సాధించిన వారిని వైవా-వాయిస్‌కు ఎంపిక చేస్తారు. దేశంలోని ప్రస్తుత వ్యవసాయ స్థితిగతులు, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, పంటల ఉత్పత్తులు-గణాంకాలు, వివిధ పంటల నూతన సాగు పద్ధతులు, గ్లోబలైజేషన్, పాలీహౌజ్ టెక్నాలజీ, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన కొత్త పరిశోధనలు వంటి అంశాలపై వైవాలో ప్రశ్నలు అడుగుతారు. వైవా-వాయిస్ పరీక్షకు 60 మార్కులు కేటాయించారు.
  • www.asrb.org.in  ద్వారా ఏఆర్‌ఎస్ ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల సిలబస్ తెలుసుకోవచ్చు.

నెట్ అర్హత మార్కులు (శాతాలు):

జనరల్

45

ఓబీసీ (నాన్ క్రీమిలేయర్)

40

ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ

35


ఖాళీల వివరాలు (ఏఆర్‌ఎస్ -2015):

కేటగిరీ

ఖాళీలు

జనరల్

49

ఎస్సీ

15

ఎస్టీ

7

ఓబీసీ

26

పీడబ్ల్యూడీ

3

మొత్తం

97


ముఖ్యసమాచారం
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: నవంబరు 19, 2015
  • ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: నవంబరు 19, 2015 (బ్యాంక్ ద్వారా నవంబరు 20 వరకు)
  • ఏఆర్‌ఎస్ (ప్రిలిమినరీ/నెట్) పరీక్ష తేదీలు: డిసెంబరు 4 నుంచి డిసెంబరు 10 వరకు (2015)
  • ఏఆర్‌ఎస్ (మెయిన్): ఫిబ్రవరి 21, 2016.
  • తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రం: హైదరాబాద్
Published date : 06 Nov 2015 11:49AM

Photo Stories