దేశ వ్యాప్తంగా స్టూడెంట్ ఎక్ఛేంజ్ ప్రోగ్రామ్స్‌పై ఆసక్తి చూపుతున్న విద్యార్థులు..!
Sakshi Education
స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్‌కు కూడా ప్రాధాన్యం పెరుగుతోంది. ఒప్పందం ప్రకారం-మన దేశంలోని ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్న విద్యార్థులు.. తమ కోర్సుకు సంబంధించి పరిమిత కాలంలో.. విదేశీ యూనివర్సిటీలో అభ్యసించే అవకాశం లభిస్తుంది.
ఈ విధానాన్ని ఒక సెమిస్టర్ వ్యవధికి సరిపడే విధంగా లేదా ఒక ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు వీలుగా ఇన్‌స్టిట్యూట్‌లు అమలు చేస్తున్నాయి.
అకడమిక్ కొలాబరేషన్స్..
మన దేశంలోని ఇన్‌స్టిట్యూట్స్‌కు విదేశీ అకడమిక్ కొలాబరేషన్స్ పరంగా అయిదు దేశాలు ప్రధాన గమ్యాలుగా నిలుస్తున్నాయి. అవి..అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ. ఒప్పందాల ఆధారంగా మన విద్యార్థులకు ప్రస్తుతం ఈ అయిదు దేశాల్లోని దాదాపు 200 యూనివర్సిటీల్లో చదువుకునే అవకాశం లభిస్తోంది.
ఇంకా చదవండి: part 5: ఇంటర్నేషనల్ కొలాబరేషన్ కోర్సుల్లో చేరే విద్యార్థులు దృష్టి సారించాల్సిన అంశాలు ఇవే..
Published date : 30 Jan 2021 03:05PM