అన్ని రంగాల్లో ఎంతో డిమాండ్ ఉన్న ఈ జాబ్ ప్రొఫైల్ గురించి తెలుసుకోండిలా..!
Sakshi Education
యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్న రంగాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో కంపెనీలు ఉన్నాయి.. వాటంన్నింటా ఎంతో డిమాండ్ నెలకొన్న జాబ్ ప్రొఫైల్స్ సమాచారం, అర్హతలు, అవసరమైన నైపుణ్యాలు తెలుసుకోండిలా..
కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్..
అన్ని రంగాల్లో డిమాండ్ నెలకొంటున్న జాబ్ ప్రొఫైల్.. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్! ఐటీ నుంచి బీఎఫ్‌ఎస్‌ఐ వరకూ... సంస్థలు తమ క్లయింట్స్‌కు, వినియోగదారులకు మెరుగైన సేవలందించాలనే భావనలో ఉన్నాయి. ముఖ్యంగా కోవిడ్ నేపథ్యంలో.. మళ్లీ పుంజుకోవాలంటే.. మెరుగైన సేవలు అందించడం ఒక్కటే మార్గమని భావిస్తున్నాయి. అందుకే కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ప్రాధాన్యం పెరిగింది. బ్యాచిలర్ డిగ్రీతోపాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఈ ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. ఐటీ విభాగానికి సంబంధించి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్‌గా రాణించాలంటే.. కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఉండటం లాభిస్తుంది. ఎంట్రీ లెవల్‌లో రూ.2 లక్షల వార్షిక వేతనం లభిస్తుంది. పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో రూ.4లక్షల వరకు వార్షిక వేతనం లభించే అవకాశముందని సర్వే పేర్కొంది.
గ్రాఫిక్ డిజైనర్..
ఇప్పుడు దాదాపు ప్రతి సంస్థకు సొంత వెబ్‌సైట్ ఉంది. సదరు వెబ్‌సైట్స్‌లో తాము అందించే సేవలు, ప్రొడక్ట్ వివరాలను ఆకట్టుకునేలా పొందుపరిచేందుకు గ్రాఫిక్ డిజైనర్స్ నైపుణ్యాలు అవసరమవుతాయి. విజువల్ కమ్యూనికేటర్స్‌గా భావించే గ్రాఫిక్ డిజైనర్ ఉద్యోగం సొంతం చేసుకోవాలంటే.. గ్రాఫిక్ డిజైన్, వెబ్ డిజైనింగ్‌కు సంబంధించిన కోర్సులు పూర్తిచేయాలి. దాంతోపాటు క్రియేటివ్ థింకింగ్ చాలా అవసరం. ప్రస్తుతం గ్రాఫిక్ డిజైన్‌కు సంబంధించి పలు కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. గ్రాఫిక్ డిజైనర్లకు వార్షిక వేతనం సంస్థను బట్టి రూ. 3.5 లక్షల వరకూ ఉంటుంది.
ఇంకాచదవండి: part 5: మార్కెటింగ్‌లో పెరుగుతున్న అవకాశాలు.. ఆదాయమూ!

Published date : 22 Sep 2020 05:15PM