Union Budget: రైల్వేలకు భారీగా కేటాయింపులు... గతంలో కంటే నాలుగురెట్లు ఎక్కువగా....
Sakshi Education
కేంద్ర బడ్జెట్‌లో రైల్వేలకు గణనీయంగా ప్రాధాన్యత దక్కింది. గతంతో పోలిస్తే కేటాయింపులు నాలుగు రెట్లు పెంచింది. ఈ నిధులతో రైల్వే లైన్ల ఆధునీకరణ, రైల్వే స్టేషన్ల సుందరీకరణ భారీగా చేపట్టనున్నారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023–24లో భారీ కేటాయింపులు చేశారు. రైల్వేల అభివృద్ధి కోసం రూ. 2.4 లక్షల కోట్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. పదేళ్ల కేటాయింపులతో పోల్చుకుంటే ఇవి చాలా ఎక్కువని, గతేడాది బడ్జెట్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ అని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.
యూపీఏతో పోలిస్తే 9 రెట్లు ఎక్కువ
యూపీఏ హయాంతో పోల్చితే తొమ్మిది రెట్లు అధికంగా ఈ ఏడాది కేటాయింపులు చేసినట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. గత యూపీఏ ప్రభుత్వం రైల్వేలకు అత్వల్ప ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆమె పరోక్షంగా తెలిపారు. 2013–14లో చేసిన కేటాయింపుల కంటే దాదాపు తొమ్మిది రెట్లు ఎక్కువ అంటూ ఆమె నొక్కి మరీ చెప్పారు. క్రిటికల్ ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌ల కోసం రూ. 75,000 కోట్లను ప్రకటించారు.
Published date : 01 Feb 2023 01:03PM