Union Budget: సాయంత్రం 5 తర్వాతే బడ్జెట్ ప్రవేశపెట్టేవారు.. ఎందుకో తెలుసా...కేవలం 800 పదాలతో బడ్జెట్‌ను ముగించిన మంత్రి ఎవరంటే...
ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలు అలాగే.. 2024లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. బీజేపీకి ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కానుంది. ఈ క్రమంలో బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో చోటు చేసుకున్న కొన్ని ఆసక్తికర విషయాలు ఏంటో తెలుసుకుందాం.
– 1977లో అప్పటి ఆర్థికమంత్రి హీరాభాయ్ ములిజిభాయ్ పటేల్ కేవలం 800 పదాలతో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
– బడ్జెట్లో వినియోగించే పదాలను ప్రామాణికంగా తీసుకుంటే.. సుదీర్ఘమైన పద్దును మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రసంగించారు. పీవీ నరసింహా రావు హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన.. 18,650 పదాలతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
చదవండి: షార్ట్‌కట్స్ వద్దు... చీటింగ్ చేసేందుకు తెలివితేటల్ని వినియోగించకండి
– అత్యధిక బడ్జెట్ ప్రసంగాలు చేసిన వారిలో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ మొదటి స్థానంలో ఉన్నారు. 1962–69లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన మొత్తం 10సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పటికీ ఈ రికార్డ్ చెక్క చెదరకుండా అలానే ఉంది.
– బ్రిటీష్ కాలం నుంచి ఫిబ్రవరి చివరి రోజున బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఆనవాయతీ. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఫిబ్రవరి 1కి మారింది. కొత్త తేదీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి ఆర్థికమంత్రిగా అరుణ్ జైట్లీ నిలిచారు.
– జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ మాత్రమే బడ్జెట్‌ను సమర్పించిన ప్రధానులు.
– 1999 వరకు కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి చివరి పనిదినం సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టడం ఆనవాయితీ. మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఆ సమయాన్ని ఉదయం 11 గంటలకు మార్చారు.
చదవండి: 2024లో రోదసిలోకి మానవుడు.... చరిత్ర సృష్టించనున్న ఇస్రో
– ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగాన్ని చేశారు. 2020 కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తూ ఆమె 2.42 గంటలపాటు ప్రసంగించారు. ఇదే ఇంతవరకు ఎక్కువ సమయం ప్రసంగించిన బడ్జెట్‌గా రికార్డ్ నమోదు చేసింది.
– కేంద్ర బడ్జెట్ 1950లో లీక్ అయింది. అప్పటి వరకు రాష్ట్రపతి భవన్‌లో బడ్జెట్ ముద్రణ జరుగుతుండగా ఈ లీక్ తర్వాత దానిని న్యూఢిల్లీలోని మింటో రోడ్‌లోని ప్రెస్‌కి మార్చారు.
– ఫిబ్రవరి 1, 2021న, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొదటి పేపర్‌లెస్ బడ్జెట్‌ను సమర్పించారు.