Skip to main content

Union Budget 2025 Highlights : కేంద్ర బడ్జెట్‌ 2025 -2026లోని కీల‌క అంశాలు ఇవే... ఎక్కువ‌గా వీటికే...

సాక్షి ఎడ్యుకేష‌న్‌: దేశమంటే మట్టి కాదోయ్‌ దేశమంటే మనుషులోయ్‌ అన్న గురజాడ సూక్తిని ప్రస్తావించి... కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ 2025 - 2026ను ప్రవేశపెడుతున్నారు.
Union Budget 2025 Highlights

సమ్మిళిత అభివృద్ధి పెట్టుబడుల సాధన లక్ష్యంగా బడ్జెట్ ఉటుంద‌ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్ల‌డించారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగించినా భారత్‌ మెరుగైన పనితీరు సాధించింద‌న్నారు.

కేంద్ర బడ్జెట్‌ 2025 - 2026లోని ముఖ్యాంశాలు...
➤☛ పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం
➤☛ బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు
➤☛ కంది, మినుములు, మసూర్‌లను కొనుగోలు చేయనున్న కేంద్రం
పండ్లు, కూరగాయల ఉత్పత్తికి నూతన పథకం
➤☛ కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల పరిమితి పెంపు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు. ఇది 7.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం.
11:14(IST)
సభ నుంచి వాకౌట్‌ చేసిన విపక్షాలు
➤☛ ప్రధాన మంత్రి ధన్‌ ధాన్య యోజన కార్యక్రమాన్ని ప్రకటించిన కేంద్రమంత్రి
➤☛ దేశంలో వెనుకబడిన జిల్లాలో వ్యవసాయానికి ప్రోత్సాహం
గోదాములు, నీటిపారుదల, రుణ సౌకర్యాల కల్పన. ఇది 1.7 కోట్ల గ్రామీణ రైతులకు లబ్ధి.
➤☛ ఎంఎస్‌ఎంఈలకిచ్చే రుణాలు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంపు
➤☛ స్టార్టప్‌లకు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంపు
➤☛ బొమ్మల తయారీకి ప్రత్యేక పథకం

➤☛ అధికోత్పత్తి వంగడాల కోసం ప్రత్యేక జాతీయ మిషన్‌
➤☛ 2024 జులై నుంచి వందకుపైగా అధికోత్పత్తి వంగడాలు విడుదల
➤☛ పత్తి ఉత్పాదకత పెంచేందుకు జాతీయ స్థాయిలో ప్రత్యేక మిషన్‌
➤☛ పత్తి రైతులకు మేలు చేసేలా దీర్ఘకాలిక లక్ష్యాలతో జాతీయ పత్తి మిషన్‌

➤☛ రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్లు కోట్ల రుణాలు
➤☛ 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు
➤☛ సంస్కరణల అమలు చేస్తే ప్రోత్సాహకాలు
➤☛ గిగ్‌ వర్కర్లకు గుర్తింపు కార్డులు
➤☛ ఈ-శ్రమ్‌ పోర్టల్‌ కింద నమోదు
➤☛ పీఎం జన్‌ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పన
➤☛ కోటి మంది గిగ్‌ వర్కర్లకు ప్రయోజనం

➤☛ ఎగుమతుల్లో 45 శాతం వరకు ఎంఎస్‌ఎంఈల భాగస్వామ్యం
➤☛ ఎంఎస్‌ఎంఈలకు వచ్చే ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్లు
➤☛ 27 రంగాల్లో స్టార్టప్‌లకు రుణాల కోసం ప్రత్యేక కార్యాచరణ
➤☛ నమోదు చేసుకున్న సూక్ష్మ సంస్థలకు రూ.5 లక్షలతో క్రెడిట్ కార్డు
➤☛ సూక్ష్మ సంస్థలకు తొలి ఏడాది 10 లక్షల వరకు క్రెడిట్ కార్డులు
➤☛ ఎంఎస్‌ఎంఈలకు రూ.10 వేల కోట్లతో ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ ఏర్పాటు

➤☛ రూ.30 వేల పరిమితితో పట్టణ పేదల కోసం యూపీఐ లింక్డ్‌ క్రెడిట్‌ కార్డులు
➤☛ ఆర్థిక రంగానికి మూడో ఇంజిన్‌గా పెట్టుబడులు
➤☛ క్లీన్‌టెక్‌ మిషన్‌ కింద సోలార్‌, ఈవీ, బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహం
పరిశ్రమలకు ప్రోత్సాహం కోసం నేషనల్‌ మానుఫ్యాక్చరింగ్‌ మిషన్‌
➤☛ కొత్త ఉడాన్‌ పథకం
➤☛ మరో 120 రూట్లలో అమలు
➤☛ 10 ఏళ్లలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణం కల్పించడమే లక్ష్యం

➤☛ రూ.25 వేల కోట్లతో నేషనల్ మారిటైమ్‌ ఫండ్‌ ఏర్పాటు
➤☛ ప్రభుత్వం, ప్రైవేటు పోర్టుల భాగస్వామ్యంతో మారిటైమ్‌ మిషన్‌
➤☛ వృద్ధి కేంద్రాలుగా పట్టణాల అభివృద్ధికి రూ.లక్ష కోట్లతో ప్రత్యేక మిషన్‌
➤☛ చిన్నస్థాయి అణు రియాక్టర్ల కోసం జాతీయ అణుశక్తి మిషన్‌
➤☛ కృత్రిమ మేధ అభివృద్ధికి రూ.500 కోట్లతో మూడు ప్రత్యేక కేంద్రాలు
➤☛ బీమా రంగంలో ఎఫ్‌డీఐ 100 శాతానికి పెంపు
➤☛ ప్రస్తుతం ఉన్న 74 శాతం నుంచి నూరు శాతానికి
➤☛ దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డే కేర్‌ క్యాన్సర్‌ సెంటర్లు
➤☛ పీఎం ఆరోగ్య యోజన కింద గిగ్‌ వర్కర్ల కోసం హెల్త్ కార్డులు
➤☛ వచ్చే వారం ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ బిల్లు.
➤☛ జల్ జీవన్‌ మిషన్‌కు మరిన్ని నిధులు. ఈ పథకం కింద 15 కోట్ల మందికి రక్షిత మంచినీరు అందించాం.
➤☛ రాష్ట్రాలు, యూటీలతో ఒప్పందం ద్వారా 100 శాతం మంచినీటి కుళాయిలు
➤☛ వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 75 వేల కొత్త మెడికల్ సీట్లు

➤☛ BNS స్పూర్తితో కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్ బిల్లు తీసుకొస్తాం
➤☛ లిటిగేషన్లను తగ్గించేలా ఇన్‌కమ్‌ ట్యాక్స్ విధానం
➤☛ మిడిల్ క్లాస్ ప్రజలను దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగత పన్ను విధానం
➤☛ సీనియర్ సిటిజన్లకు TDS మినహాయింపు రూ. 50వేల నుంచి రూ. 1లక్షకు పెంపు
➤☛ అప్‌డేటెడ్ ఇన్‌కమ్‌ ట్యాక్స్ నమోదుకు నాలుగేళ్లు పొడిగింపు
➤☛ ఇన్సూరెన్స్ రంగంలో వందశాతం FDIలకు అనుమతి
➤☛ ఇన్సూరెన్స్ రంగంలో వందశాతం FDIలకు అనుమతి
ప్రీమియం మొత్తాన్ని దేశంలోనే పెట్టుబడి పెట్టే విదేశీ సంస్థలకు అనుమతి
➤☛ లోన్లు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు
➤☛ KCC ద్వారా లోన్లు రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంపు
➤☛ రూ. 30వేలతో స్ట్రీట్ వెండర్స్‌కు క్రెడిట్ కార్డులు
➤☛ ఐఐటీ పాట్నా విస్తరణకు నిర్ణయం

➤☛ రూ. 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు : మధ్యతరగతి ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు, రూ. 80 వేలు ఆదా

కేంద్ర బడ్జెట్‌ 2025-2026 స్వ‌రూపం :

➤☛ రెవెన్యూ వసూళ్లు రూ.34,20,409 కోట్లు
➤☛ పన్ను వసూళ్లు రూ.28,37,409 కోట్లు
➤☛ పన్నేతర వసూళ్లు రూ.5,83,000 కోట్లు
➤☛ మూలధన వసూళ్లు రూ.16,44,936 కోట్లు
➤☛ రుణాల రికవరీ రూ.29,000 కోట్లు
➤☛ ఇతర వసూళ్లు రూ.47,000 కోట్లు
➤☛ అప్పులు, ఇతర వసూళ్లు రూ.15,68,936 కోట్లు
➤☛ మొత్తం ఆదాయం రూ.50,65,345 కోట్లు
➤☛ మొత్తం వ్యయం రూ.50,65,345 కోట్లు
➤☛ రెవెన్యూ ఖాతా రూ.39,44,255 కోట్లు
➤☛ వడ్డీ చెల్లింపులు రూ.12,76,338 కోట్లు
➤☛ మూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు రూ.4,27,192 కోట్లు
➤☛ మూలధన ఖాతా రూ.11,21,090 కోట్లు
➤☛ వాస్తవ మూలధన వ్యయం రూ.15,48,282 కోట్లు
➤☛ రెవెన్యూ లోటు రూ.5,23,846 కోట్లు
➤☛ నికర రెవెన్యూ లోటు రూ.96,654 కోట్లు
➤☛ ద్రవ్య లోటు రూ.15,68,936 కోట్లు
➤☛ ప్రాథమిక లోటు రూ.2,92,598 కోట్లు
➤☛ 2025-02-01 13:26:23
➤☛ రూ.50,65,345 కోట్ల కేంద్ర బడ్జెట్‌

రూపాయి రాక...
☛ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ 22 పైసలు
☛ ఎక్సైజ్‌ డ్యూటీ 5 పైసలు
☛ అప్పులు, ఆస్తులు 24 పైసలు
☛ పన్నేతర ఆదాయం 9 పైసలు
☛ మూలధన రశీదులు 1 పైసలు
☛ కస్టమ్స్‌ ఆదాయం 4 పైసలు
☛ కార్పొరేషన్‌ ట్యాక్స్‌ 17 పైసలు
☛ జీఎస్టీ, ఇతర పన్నులు 18 పైసలు

రూపాయి పోక..
☛ పెన్షన్లు 4 పైసలు
☛ వడ్డీ చెల్లింపులు 20 పైసలు
☛ కేంద్ర పథకాలు 16 పైసలు
☛ ప్రధాన సబ్సిడీలు 6 పైసలు
☛ డిఫెన్స్‌ 8 పైసలు
☛ రాష్ట్రాలకు తిరిగి చెల్లించే ట్యాక్స్‌లు 22 పైసలు
☛ ఫైనాన్స్‌ కమిషన్‌కు చెల్లింపులు 8 పైసలు
☛ కేంద్ర ప్రాయోజిక పథకాలు 8 పైసలు
☛ ఇతర కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఖర్చులు 8 పైసలు

ధరలు పెరిగేవి ఇవే.. :
☛ ఫ్లాట్ ప్యానెల్ డిస్‌ప్లే
☛ సిగరెట్లు

ధరలు తగ్గేవి ఇవే.. :
☛ ఎలక్ట్రిక్ వెహికల్స్
☛ ఎల్ఈడీ టీవీలు
☛సెల్‌ఫోన్స్
☛ క్యాన్సర్ మెడిసిన్స్
☛  లిథియం అయాన్ బ్యాటరీలు
☛ లెదర్ వస్తువులు

Published date : 01 Feb 2025 01:57PM

Photo Stories