No Tax On Income Up To Rs 12 Lakh : గుడ్‌న్యూస్.. ఇక రూ. 12 లక్షల వరకు ఆదాయ పన్ను సున్నా. ఇంకా..!

ఇకపై ఇన్‌కమ్ ట్యాక్స్ ఇలా..
➤☛ రూ. 12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు
➤☛ కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు పన్ను సున్నా
➤☛ కొత్త పన్ను విధానంలో వర్తింపు
➤☛ స్మాల్ ట్యాక్స్ పేయర్స్ టీడీఎస్ రిలీఫ్
➤☛ స్టాండర్డ్ డిడక్షన్‌తో కలుపుకొంటే రూ.12.75 లక్షల వరకు పన్ను సున్నా
➤☛ వృద్ధులకు వడ్డీపై టీసీఎస్ ఊరట
➤☛ 36 ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగింపు
➤☛ బీమా రంగంలో ఎఫ్‌డీఐ 100 శాతానికి పెంపు
➤☛ వచ్చే వారం ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు
➤☛ కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు
ఇకపై కొత్త పన్ను ఇలా..
☛ రూ.0-4 లక్షలు - సున్నా
☛ రూ.4-8 లక్షలు - 5%
☛ రూ.8-12 లక్షలు - 10%
☛ రూ.12-16 లక్షలు - 15%
☛ రూ.16-20 లక్షలు - 20%
☛ రూ.20-24 లక్షలు - 25%
☛ రూ.24 లక్షల పైన 30 శాతం
మరింత సమాచారం ఇదే...!
కొత్త పన్ను విధానం కింద రూ.12 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వ్యక్తులు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 బడ్జెట్ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. పన్ను వ్యవస్థను సరళతరం చేయడానికి, పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు చెప్పారు. కొత్త పన్ను విధానం ఆకర్షణీయమైన పన్ను రేట్లను అందిస్తుంది. వివిధ మినహాయింపులు, మినహాయింపుల అవసరాన్ని తొలగిస్తుందని చెప్పారు. ఇందులోని కీలక ఫీచర్లు ఇవే..
వార్షికంగా రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పాత విధానంతో పోలిస్తే కొత్త విధానంలో తక్కువ పన్ను రేట్లు విధిస్తారు. ఉదాహరణకు, రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్య ఆదాయంపై 15 శాతం, రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య ఆదాయంపై 20 శాతం పన్ను ఉంది. వేతన ఉద్యోగులు రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్ పొందవచ్చు. ఇది వారి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గిస్తుంది. రూ.12 లక్షల ఆదాయం ఉన్నవారికి పన్ను రూపంలో రూ.80 వేలు ఆదా అవుతుంది. ఇతర శ్లాబుల్లో కూడా మార్పులు ఉంటాయని నిర్మలమ్మ ప్రకటించారు. రూ.25 లక్షల ఆదాయం ఉన్నవారికి రూ.1.10 లక్షలు ఆదా అవుతుంది.
ఇది దేశవ్యాప్తంగా లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు...
ఈ కొత్త విధానం పన్ను సౌలభ్యాన్ని సులభతరం చేయడం, వాటిని మరింత క్రమబద్దీకరించడానికి తోడ్పడుతుందని కేంద్రమంత్రి సీతారామన్ చెప్పారు. ఇది దేశవ్యాప్తంగా లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. పన్ను భారాన్ని తగ్గించడం, పన్ను ఫైలింగ్ ప్రక్రియను సరళతరం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. డిస్పోజబుల్ ఆదాయాన్ని పెంచుతుందని, ఆర్థిక వృద్ధిని ప్రేరేపిస్తుందని భావిస్తున్నారు.
Tags
- No Tax On Income Up To Rs 12 Lakh
- No Income Tax Payable For Income Upto Rs 12 Lakhs
- Finance Minister Announces New Tax Rates In Union Budget 2025
- Union Finance Minister Nirmala Sitaraman
- FM announced the new slab
- To taxpayers up to 12 lakhs of normal income
- No Tax On Income Up To Rs 12 Lakh news in telugu
- Budgets & Surveys
- Union Budget
- central budget
- Budget session
- union budget bits
- Union Budget 2025
- Agriculture Budget 2025
- Budget 2025
- Budget 2025 Expectations
- Union budget 2025-26
- Budget 2025 Highlights in Telugu
- railway budget 2025
- Defense budget 2025
- Budget 2025 Live Updates
- Union Budget 2025 Live