Free Awareness Seminar: గ్రూప్–1, 2 ఉద్యోగ పరీక్షలపై ఉచిత అవగాహన సదస్సు
ఈ నేపథ్యంలో గ్రామీణ, పట్టణ విద్యార్థులను గ్రూప్–1,2 స్థాయి ఉద్యోగులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సాక్షి ఎడ్యుకేషన్.కామ్( www.sakshieducatio n.com) ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత అవగాహన సదస్సులు నిర్వహించనుంది.
గత కొన్ని సంవత్సరాలుగా వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు సాక్షి ఎడ్యుకేషన్.కామ్ తోడుగా ఉంటున్న విషయం మీ అందరికీ తెలిసిందే.
చదవండి: Telangana: ఉన్నత విద్యకు దూరం
గెస్ట్ స్పీకర్‌గా బాలలత....
ఎంతోమందిని పోటీ పరీక్షల్లో విజేతలుగా తీర్చిదిద్దుతున్న సివిల్స్ టాపర్ బాలలత గ్రూప్–1, 2 పరీక్షలపై అవగాహన సదస్సుకు గెస్ట్ స్పీకర్‌గా హాజరుకానున్నారు. ఆమె గ్రూప్ 1,2 పరీక్షలపై అవగాహన కల్పించడంతో పాటు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 8977625795 ఫోన్ నంబరుకు తమ పేరు, ఫోన్ నంబర్, జిల్లా వివరాలను వాట్సాప్‌లో పంపగలరు.