670 Jobs: గ్రూప్4 సర్వీస్ పోస్టులకు దరఖాస్తు గడువు పెంపు.. చివరి తేదీ ఇదే..
Sakshi Education
రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ విభాగంలోని జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ (గ్రూప్4 సర్వీస్) పోస్టులకు, ఎండోమెంట్ విభాగంలోని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (గ్రేడ్–3) పోస్టులకు దరఖాస్తు గడువును ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) మరోసారి పొడిగించింది.
గ్రూప్4 సర్వీస్ పోస్టులకు దరఖాస్తు గడువు పెంపు..
నిరుద్యోగ యువత విన్నపాల మేరకు దరఖాస్తు గడువును జనవరి 29 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కమిషన్ కార్యదర్శి పీఎస్‌ఆర్ ఆంజనేయులు జనవరి 28న ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు రిజిస్ట్రేషన్ ఫీజును ఫిబ్రవరి 5వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు చెల్లించేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. అభ్యర్థులు చివరి గడువు తేదీ వరకు వేచి చూడకుండా ఫీజు చెల్లించి గడువులోగా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలన్నారు.