AP TET Result 2022 : ఏపీ టెట్-2022 ఫలితాలు ఎప్పుడంటే..?
అయితే ఇదే తేదీన ఫైనల్ 'కీ' ని ప్రకటించారు కానీ.. రిజల్ట్స్ మాత్రం ప్రకటించలేదు. ఫలితాలపై సందిగ్ధత నెలకొంది. కొన్ని అనివార్య కారణాల వల్ల రిజల్ట్స్ ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వీలులైతే ఈ వారంలో ఎప్పుడైన విడుదల చేసే అవకాశం ఉంది. ఆగస్టు 6వ తేదీ నుంచి 21వ తేదీ వరకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏపీ టెట్-2022 ఫలితాలను www.sakshieducation.comలో చూడొచ్చు.
AP TET 2022 Final Key : ఏపీ టెట్-2022 ఫైనల్ 'కీ' విడుదల.. ఈ సారి కీ లో..
TET Cum TRT Notification 2022 : టెట్ కమ్ టీఆర్‌టీ నోటిఫికేషన్.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
AP Teacher Recruitment 2022: టీచర్ కొలువు.. పరీక్ష విధానం, విజయానికి ప్రిపరేషన్ గైడెన్స్
How to Check AP TET 2022 Results ?
☛ Visit direct link available on sakshieducation.com
☛ Enter your hall ticket number and submit
☛ The results will be displayed on the screen
☛ Download a copy of the score card for further reference
2018 తర్వాత మళ్లీ ఈ ఏడాదే టెట్ నిర్వహించడంతో ఈసారి భారీగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 5,25,789 మంది టెట్‌కు దరఖాస్తు చేసుకోగా.. మొత్తం 150 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు.
కనీస అర్హత మార్కులు ఇలా.. డీఎస్సీలో వెయిటేజీ మాత్రం
టెట్ మార్కులకు ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)లో వెయిటేజీ కల్పించడంతోపాటు బీఈడీ, ఎంఈడీ అభ్యర్థులను ఎస్‌ఏ పోస్టులకు కూడా అర్హులుగా ప్రకటించడంతో గతంలో క్వాలిఫై అయిన వారు సైతం మరోసారి ఈ పరీక్ష రాశారు. జనరల్ అభ్యర్థులకు 60 శాతం, బీసీ అభ్యర్థులకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40 శాతం మార్కులు రావాలి. టెట్ మార్కులకు డీఎస్సీలో 20 శాతం మేర వెయిటేజీ ఉన్నందున వీటికి ప్రాధాన్యత ఏర్పడింది. టెట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ చెల్లుబాటు గతంలో ఏడేళ్లు మాత్రమే ఉండగా గతేడాది ఎన్‌సీటీఈ దీన్ని సవరించి జీవితకాలం చెల్లుతుందని ప్రకటించింది.
TET/DSC 2022: కచ్చితంగా ఉద్యోగం సాధించాలనుకునే వారికి మాత్రమే..