Skip to main content

AP TET Result 2022 Link : నేడే ఏపీ టెట్‌-2022 ఫలితాలు విడుద‌ల‌.. ఫ‌లితాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో (టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌) టెట్ 2022 ఫలితాలను నేడు విడుద‌ల చేయ‌నున్నారు.

ఈ మేర‌కు పాఠ‌శాల విద్యాశాఖ క‌మిష‌న‌ర్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. కావున అభ్య‌ర్థులు తాము సాధించిన మార్కుల వివ‌రాల‌ను తెలుసుకోవాలంటే.. సెప్టెంబ‌ర్ 30వ తేదీ నుంచి https://aptet.apcfss.in/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చును.

AP TET 2022 Final Key : ఏపీ టెట్-2022 ఫైనల్ 'కీ' విడుద‌ల‌.. ఈ సారి కీ లో..

షెడ్యూల్ ప్రకార‌మైతే సెప్టెంబ‌ర్ 14వ తేదీన‌ విడుదల చేయాల్సి ఉంది. అయితే ఇదే తేదీన‌ ఫైనల్ 'కీ' ని ప్ర‌క‌టించారు కానీ.. రిజల్ట్స్ మాత్రం ప్ర‌క‌టించ‌లేదు. కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల‌ రిజల్ట్స్ ఆలస్యం అయ్యాయి. ఆగస్టు 6వ తేదీ నుంచి 21వ తేదీ వరకు టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(టెట్‌) ను నిర్వహించిన సంగతి తెలిసిందే.

How to Check  AP TET 2022 Results ?
☛ Visit direct link available on https://aptet.apcfss.in/
☛ Enter your hall ticket number and submit
☛ The results will be displayed on the screen
☛ Download a copy of the score card for further reference

AP Teacher Recruitment 2022: టీచర్‌ కొలువు.. పరీక్ష విధానం, విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌

ఈసారి భారీగానే..
2018 తర్వాత మళ్లీ ఈ ఏడాదే టెట్‌ నిర్వహించడంతో ఈసారి భారీగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 5,25,789 మంది టెట్‌కు దరఖాస్తు చేసుకోగా.. 4,07,329 మంది అభ్య‌ర్థులు ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు. మొత్తం 150 పరీక్షా కేంద్రాల్లో ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు.

కనీస అర్హత మార్కులు ఇలా..?
టెట్‌ మార్కులకు ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)లో వెయిటేజీ కల్పించడంతోపాటు బీఈడీ, ఎంఈడీ అభ్యర్థులను ఎస్‌ఏ పోస్టులకు కూడా అర్హులుగా ప్రకటించడంతో గతంలో క్వాలిఫై అయిన వారు సైతం మరోసారి ఈ ప‌రీక్ష రాశారు.

TET Cum TRT Notification 2022 : టెట్ క‌మ్ టీఆర్‌టీ నోటిఫికేష‌న్‌.. పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి

జనరల్ అభ్యర్థులకు 60 శాతం, బీసీ అభ్యర్థులకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40 శాతం మార్కులు రావాలి. టెట్‌ మార్కులకు డీఎస్సీలో 20 శాతం మేర వెయిటేజీ ఉన్నందున వీటికి ప్రాధాన్యత ఏర్పడింది. టెట్‌ ఉత్తీర్ణత సర్టిఫికెట్‌ చెల్లుబాటు గతంలో ఏడేళ్లు మాత్రమే ఉండగా గతేడాది ఎన్‌సీటీఈ దీన్ని సవరించి జీవితకాలం చెల్లుతుందని ప్రకటించింది.

డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

 

 Teacher Recruitmenit Test(TRT) : టీఆర్‌టీ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. పోస్టుల భ‌ర్తీ ఇలా..

 TET/DSC 2022: కచ్చితంగా ఉద్యోగం సాధించాలనుకునే వారికి మాత్రమే..

 ఇవి పాటిస్తే.. టీచ‌ర్ జాబ్ మీదే..||DSC Best Preparation Tips||DSC Best Books|| DSC Syllabus|| TET Tips

➤ TS TET 2022 Paper-1 Question Paper & Key (Click Here)

➤ TS TET 2022 Paper-2 Question Paper & Key (Click Here)

Published date : 30 Sep 2022 12:10PM
PDF

Photo Stories