AP TET 2022 Final Key : ఏపీ టెట్-2022 ఫైనల్ 'కీ' విడుదల.. ఈ సారి కీ లో..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : ఏపీ టెట్-2022 ఫైనల్ 'కీ' విడుదలైంది. ఇప్పటికే ప్రాథమిక 'కీ'ని విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఆగస్టు 6వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరిగాయి. ఈ సారి మొత్తం 5,25,789 మంది టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు.
ఏపీ టెట్-2022 ఫైనల్ 'కీ' కోసం క్లిక్ చేయండి
డీఎస్సీలో వెయిటేజీ మాత్రం
టెట్ మార్కులకు ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)లో వెయిటేజీ కల్పించడంతోపాటు బీఈడీ, ఎంఈడీ అభ్యర్థులను ఎస్‌ఏ పోస్టులకు కూడా అర్హులుగా ప్రకటించడంతో గతంలో క్వాలిఫై అయిన వారు సైతం మరోసారి ఈ పరీక్ష రాశారు. జనరల్ అభ్యర్థులకు 60 శాతం, బీసీ అభ్యర్థులకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40 శాతం మార్కులు రావాలి. టెట్ మార్కులకు డీఎస్సీలో 20 శాతం మేర వెయిటేజీ ఉన్నందున వీటికి ప్రాధాన్యత ఏర్పడింది. టెట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ చెల్లుబాటు గతంలో ఏడేళ్లు మాత్రమే ఉండగా గతేడాది ఎన్‌సీటీఈ దీన్ని సవరించి జీవితకాలం చెల్లుతుందని ప్రకటించింది.
Published date : 15 Sep 2022 01:27PM