AP Constable Jobs 2022 Notification : 6100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. పరీక్షావిధానం.. ముఖ్యమైన తేదీలు ఇవే..
పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొద్ది నెలల క్రితం పోలీసు శాఖను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈమేరకు పోలీసు శాఖ రూపొందించిన నియామక ప్రణాళికను ప్రభుత్వం ఆమోదించి.. నేడు నోఫికేషన్‌ను విడుదల చేశారు.
కానిస్టేబుల్ పోస్టుల వివరాలు ఇవే..
మొత్తం 6100 కానిస్టేబుల్ పోస్టుల్లో.. 3,580 కానిస్టేబుల్ (సివిల్), ఏపీఎస్పీలో 2,520 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా స్వీకరించనున్నారు.
కానిస్టేబుల్ ప్రిలిమనరీ రాత పరీక్షను..
కానిస్టేబుల్ పోస్టులకు జనవరి 22వ తేదీన ప్రిలిమనరీ రాత పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు స్వీకరణ నవంబర్ 30 నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు జనవరి 09, 2023 నుంచి హాల్ టికెట్స్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
GK & Current Affairs: పోలీసు ఉద్యోగాల రాతపరీక్షలో.. కరెంట్ అఫైర్స్, జీకే పాత్ర..
వీరికి 5 శాతం నుంచి 25% వరకు..
సివిల్, ఏఆర్, కమ్యూనికేషన్స్ విభాగాల్లో మహిళా, పురుష కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో రిజర్వేషన్లు వర్తింపజేశారు. ఏపీఎస్పీ, ఎస్‌ఏఆర్ సీపీఎల్, ఫిట్టర్ ఎల్రక్టీషియన్, మెకానిక్స్, డ్రైవర్ కేటగిరీల్లో పురుష కానిస్టేబుల్ పోస్టులే భర్తీ చేస్తారు. కాబట్టి ఆ విభాగాల పోస్టుల భర్తీలో పురుష హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించారు. కానిస్టేబుల్ నియామకాల్లో కేటగిరీలవారీగా 5 శాతం నుంచి 25% వరకు హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించడం విశేషం.ఈమేరకు ‘ఆంధ్రప్రదేశ్ పోలీస్ రూల్స్ 1999’కి సవరణ చేస్తూ హోంశాఖ ఉత్తర్వులిచ్చింది. ఇక నుంచి కానిస్టేబుల్ నియామకాల్లో ఈ రిజర్వేషన్లను అమలు చేస్తారు. దీనివల్ల రాష్ట్రంలో 15 వేల మంది హోంగార్డులకు ప్రయోజనం కలగనుంది. కానిస్టేబుల్ పోస్టుల్లో మహిళలకు 33.33 శాతం పోస్టులను కేవలం సివిల్ విభాగంలో కేటాయించారు.
Gandrathi Satish, SI: ఇంటర్, డిగ్రీలో ఫెయిల్..ఈ కసితోనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా..
పరీక్ష విధానం :
కానిస్టేబుల్ పరీక్షలో ప్రధానంగా నాలుగు దశల్లో ఎంపిక ఉంటాయి. వీటిలో ప్రిలిమినరీ ఎగ్జామ్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ , ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ , మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి స్థాయి పరీక్షకు అర్హులుగా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అలాగే ఈ ఫిజికల్ టెస్టుల్లో అర్హత సాధించిన అభ్యర్థులు పోలీస్ కానిస్టేబుల్ మెయిన్ పరీక్షకు హాజరు కావడానికి అనుమతిస్తారు. ఇది మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు కలిగి ఉన్న పరీక్ష. దీనిలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి.
శారీరక సామర్థ్య పరీక్షలు..
కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారు దేహదారుడ్య పరీక్షలకు హాజరవ్వాల్సి ఉంటుంది. కానిస్టేబుల్ పోస్టులకు 1600 మీటర్ల రన్నింగ్, 100 మీటర్ల రన్నింగ్ ఉంటుంది. ఇవి కేవలం అర్హత కోసం మాత్రమే. వీటిలో ఎలాంటి మెరిట్ ఉండదు. ఇక ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులకు 1600 మీ, 100 మీ, లాంగ్ జంప్ లో అర్హత సాధించాల్సి ఉంటుంది. అంతే కాకుండా.. వీటిలో మెరిట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష విధానం :
కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలో 200 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. పరీక్ష సమయం 3 గంటలు. ప్రధాన పరీక్షలో ఇంగ్లిస్, అరిథ్‌మెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ, జియోగ్రఫీ,పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, రీజనింగ్,మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
Competitive Exams: కోచింగ్ తీసుకోకుండా గ్రూప్స్, ఎస్‌ఐ తదితర పరీక్షల్లో విజయం సాధ్యమా..? కాదా..?
కానిస్టేబుల్ దరఖాస్తు ఫీజు..
జనరల్, బీసీ అభ్యర్థులు 300 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో ఏమైనా సమస్యలు ఏర్పడినా.. సందేహాలు ఉన్నా.. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల లోపు 9441450639 నంబర్ ను సంప్రదించవచ్చు.
➤ Inspiring Story: నేను ఎస్‌ఐ అయ్యానిలా.. అమ్మ కూలి పనులు చేస్తూ..
➤ Madhavi, CI : పొట్టకూటి కోసమే ఈ పోలీసు ఉద్యోగంలో చేరా.. కానీ