Skip to main content

AP Inter Results 2023 Released : ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్ ఇయ‌ర్‌ ఫ‌లితాలు విడుద‌ల‌.. రిజ‌ల్డ్స్ కోసం క్లిక్ చేయండి.. (Click Here)

సాక్షి ఎడ్యుకేష‌న్ : రికార్డు స్థాయిలో.. అత్యంత త‌క్కువ స‌మ‌యంలోనే ఒకే సారి ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్ ఇయ‌ర్‌ ఫలితాలను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్ విడుద‌ల చేశారు. ఈ ఫ‌లితాల‌ను ఏప్రిల్ 26వ తేదీ(బుధ‌వారం) సాయంత్రం 7:00ల‌కు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుద‌ల చేశారు.
AP Inter Results 2023
AP Inter Results 2023 Released

నేడు సాయంత్రం 5:00 ల‌కు ఏపీ విద్యాశాఖ మంత్రి విడుద‌ల చేయాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల ఈ ఫ‌లితాల‌ను సాయంత్రం 7:00 విడుద‌ల చేశారు. రికార్డు స్థాయిలో.. కేవలం 22 రోజుల వ్యవధిలో ఈ ఫలితాలను ప్ర‌క‌టించారు. ఏపీ ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవ‌త్స‌రం ఫలితాలను వెంట‌నే చూడాలంటే https://results.sakshieducation.com  ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

ఏపీ ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్ ఇయర్‌ ఫలితాలను చెక్ చేసుకోండిలా.. 
1) https://results.sakshieducation.com/ దీనిపై క్లిక్ చేయండి 
2) హోం పేజీపై కనపడుతున్న ఏపీ ఇంటర్ రిజల్ట్స్‌పై క్లిక్ చేయండి 
3) మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి 
4) మీ మార్క్ షీట్ ఓపెన్ అవుతుంది 
5) మీ జాబితాను అక్కడే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

మొత్తం 9,20,552 మంది విద్యార్థులు..

ap inter results news telugu

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వ తేదీ వరకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు పరీక్షలు జరిగిన విష‌యం తెల్సిందే. ఇంటర్ ఫస్టియర్‌లో 4,84,197 మంది విద్యార్ధులు, ఇంట‌ర్ సెకండియర్‌కి 5,19,793 మంది హాజరైన హాజరయ్యారు. మొత్తం ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన పరీక్షలకు 9,20,552 మంది, వృత్తి విద్య కోర్సు పరీక్షలకు 83,749 మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఇంటర్‌ ఫస్టియర్ ఫ‌లితాలు ఇలా..
☛ ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల్లో 61 శాతం ఉత్తీర్ణత
☛ ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షల్లో 72 శాతం ఉత్తీర్ణత
☛ ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల్లో 77 శాతం ఉత్తీర్ణతో కృష్ణా జిల్లా ఫస్ట్‌
☛ ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల్లో 70 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి జిల్లా సెకండ్‌
☛ ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల్లో 68 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లా థర్డ్‌

☛ ఇంటర్ ఫస్టియర్ లో బాలురు 58%, బాలికలు 65 % ఉత్తీర్ణత

ఇంటర్‌ సెకండియర్‌ ఫ‌లితాలు ఇలా..
☛ ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షల్లో 83 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ఫస్ట్‌
☛ ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షల్లో 78 శాతం ఉత్తీర్ణతతోగుంటూరు జిల్లా సెకండ్‌
☛ ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షల్లో 77 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి జిల్లా థర్డ్‌
☛ ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ పరీక్షల్లో బాలుర కంటే బాలికలదే పైచేయి

☛ ఇంటర్ సెకండియర్ లో బాలురు 68% , బాలికలు 75%   ఉత్తీర్ణత 

ఏపీ ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్ ఇయ‌ర్ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే..?
☛ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయి.
☛ ప్రాక్టికల్స్ మాత్రం మే 6 నుంచి జూన్ 9 వరకు జరుగుతాయి
☛ మే 3 లోపు సప్లిమెంటరీ పరీక్షలకి ఫీజు చెల్లించుకోవాలి

గత కొన్నేళ్లుగా సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు ఇలా ఉన్నాయి..
➤ 2015 - 55.87 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు
➤ 2016లో 60.59 శాతం 
➤ 2017లో 60.01 శాతం
➤ 2018లో 57 శాతం 
➤ 2019లో 55 శాతం 
➤ 2020లో 59 శాతం 
➤ 2022లో 61 శాతం 
➤ 2023లో 72 శాతం

ఏపీ ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్ ఇయర్‌ ఫలితాలు-2023 ఫ‌లితాల లింక్స్‌ ఇవే..

ap inter results links 2023

➤☛ AP Inter 1st Year Results 2023 (General) (Click Here)

➤☛ AP Inter 1st Year Results 2023 (Vocational) (Click Here)

➤☛ AP Inter 2nd Year Results 2023 (General) (Click Here)

➤☛ AP Inter 2nd Year Results 2023 (Vocational) (Click Here)

Published date : 26 Apr 2023 07:59PM

Photo Stories