Skip to main content

AP Inter Pass Percentage : ఇంటర్ ఫ‌లితాల్లో ఎంత మంది పాస్ అయ్యారంటే..? రీకౌంటింగ్‌ దరఖాస్తుకు చివ‌రి తేదీ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంటర్మీడియట్‌ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌ర ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు.
AP Inter Results Details
ap inter results pass percentage 2022

జూన్ 22వ తేదీన విద్యాశాఖ మంత్రి బొత్స‌ స‌త్య‌నారాయ‌ణ విడుద‌ల చేశారు. ఇంట‌ర్ ఫస్ట్‌ ఇయర్‌లో  4,45,604 రాస్తే 2,41,591 మంది అంటే 54 శాతం ఉత్తీర్ణులయ్యారు. అలాగే ఇంట‌ర్‌ సెకండియర్‌లో 4,23,455 మంది రాస్తే.. 2,58,449 మంది పాస్‌ అయ్యారు.. అంటే 61 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ సారి ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయి. రాష్ట్ర‌వాప్తంగా ఇంట‌ర్ ఫ‌లితాల్లో కృష్ణా జిల్లా 75 శాతం ఉత్తీర్ణ‌త‌తో టాప్‌గా నిల‌వ‌గా.. వైఎస్సార్ జిల్లా 55శాతం ఉత్తీర్ణ‌త‌తో చివ‌రి స్థానంలో నిలిచింది. ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రం బాలురు 49శాతం మంది పాస్ అవ్వ‌గా.., బాలిక‌లు 60 శాతం మంది ఉత్తీర్ణ‌త సాధించారు. అలాగే రెండో సంవ‌త్స‌రంలో  బాలురు 54 ఉత్తీర్ణ‌త‌ సాధించ‌గా.. బాలిక‌లు 68 శాతం మంది పాస్ అయ్యారు.

After Inter: ఇంటర్మీడియెట్‌ తర్వాత.. ఏకకాలంలో డిగ్రీతోపాటు పీజీ పూర్తి..

AP Intermediate First Year Results 2022 (General) (Click Here)

☛ AP Intermediate Second Year Results 2022 (General) (Click Here)

రీకౌంటింగ్‌కు దరఖాస్తుకు..
ఇంట‌ర్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రం విద్యార్థుల‌కు జూన్‌ 25 నుంచి జులై 5 వరకు రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం.

Inter Special: ఎంపీసీ.. అకడమిక్‌ సిలబస్‌తోపాటే పోటీ పరీక్షలకూ ప్రిపరేషన్‌!!

ఈ సారి రికార్డ్ స్థాయిలో..
రికార్డు స్థాయిలో 28 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం గమనార్హం. జవాబు పత్రాల మూల్యాంకనాన్ని వేగంగా, జాగ్రత్తగా పూర్తి చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఇంట‌ర్ ఫ‌లితాల‌ను సాక్షిఎడ్యుకేషన్‌.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.

➤ AP Intermediate First Year Results 2022 (Vocational) (Click Here)

➤ AP Intermediate Second Year Results 2022 (Vocational) (Click Here)

After Inter: ఇంటర్‌తోనే.. ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు..

Published date : 22 Jun 2022 05:36PM

Photo Stories