Intermediate: ఫెయిలైనవారికి ప్రత్యేక తరగతులు.. ఆన్‌లైన్.. ఆఫ్‌లైన్..
మహాత్మ జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ బీసీ గురుకులాలకు చెందిన 195 మంది 2023 ఇంటర్ మొదటి సంవత్సరంలో ఫెయిలయ్యారు. వారి కోసం 14 కేంద్రాల్లో మే 3 నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభమయ్యాయి. వీటిలో ఎనిమిది కేంద్రాలు బాలికలకు, ఆరు బాలురకు ఏర్పాటు చేశారు. పది మందిలోపు విద్యార్థులు ఉన్న ఆరు కేంద్రాల్లో ఆన్‌లైన్ క్లాసులు, అంతకంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న ఎనిమిది కేంద్రాల్లో ఆఫ్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు.
చదవండి: ఏపీ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ప్రివియస్ పేపర్స్ | న్యూస్
కాగా, ఎస్టీ గురుకుల సంస్థ పరిధిలో ఉన్న 40 జూనియర్ కాలేజీలకు చెందిన 1,667 మంది ఇంటర్ మొదటి సంవత్సరంలో, 1,865 మంది రెండో సంవత్సరం పరీక్షల్లో ఫెయిలయ్యారు. వీరికోసం ఎస్టీ గురుకులాల పరిధిలో కూడా 12 కేంద్రాల్లో ప్రత్యేక తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒక్కో సెంటర్‌కు 12 మంది లెక్చరర్లను నియమించారు. నెల రోజులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి కృష్ణమోహన్, ఎస్టీ గురుకుల సంస్థ జాయింట్ సెక్రటరీ విజయకుమార్ తెలిపారు.