Inter Exams 2024: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
రెగ్యులర్, ప్రైవేటు కలుపుకుని పరీక్షలు రాయనున్న విద్యార్థులు సంఖ్య 62,787కు చేరింది. గతేడాది కంటే మూడు వేల విద్యార్థులు పెరగడంతో అదనంగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతేడాది 73 పరీక్ష కేంద్రాలతో పరీక్షలు నిర్వహించగా, ప్రస్తుతం అదనంగా మరో 19 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రంలో 400 నుంచి 450 మందికి మించకుండా విద్యార్థులను కేటాయించడంతోపాటు ఒక్కో రూములో 36 మంది చొప్పున కేటాయించింది. విద్యార్థులు సౌకర్యవంతంగా కూర్చుని ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా మౌళిక వసతులు ఉండాలనే ఇంటర్మీడియెట్ బోర్డు మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన అధికార యంత్రాంగం ఫర్నీచర్‌తోపాటు గాలి, వెలుతురు ప్రసరించే ఏర్పాట్లు ఉన్న కళాశాలలనే పరీక్ష కేంద్రాలుగా గుర్తించింది. రవాణా సదుపాయం ఉన్న కళాశాలలను పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేశారు.
చదవండి: Latest Central Govt Jobs 2024: టెన్త్, ఇంటర్‌తోనే కేంద్ర కొలువు.. రాత పరీక్ష ఇలా..
పరీక్షలకు హాజరు కానున్న 62,787 మంది విద్యార్థులు
మార్చి ఒకటి నుంచి జరగనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు జిల్లాలో 62,787 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో ప్రథమ సంవత్సర ఆర్ట్స్, సైన్స్ 30,819, ఒకేషనల్ 1,010 కలుపుకుని 31,829 మంది విద్యార్థులు ఉన్నారు. ద్వితీయ సంవత్సరం ఆర్ట్స్, సైన్స్ 26,561 మంది విద్యార్థులతోపాటు ఒకేషనల్ 1,032, ప్రైవేటుగా 3,365 కలుపుకుని 30,958 మంది హాజరు కానున్నారు.
సీసీ కెమెరాలతో లైవ్ స్ట్రీమింగ్
పరీక్షల నిర్వహణకు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్న ఇంటర్మీడియెట్ బోర్డు ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాల ద్వారా లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాట్లు చేస్తోంది. పరీక్ష కేంద్రం ప్రధాన ద్వారంతోపాటు చీఫ్ సూపరింటెండెంట్ కూర్చునే గది, విద్యార్థులు పరీక్షలు రాసే ప్రతి తరగతి గదిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, బోర్డు కార్యాలయం నుంచి ప్రత్యక్షంగా తిలకించే ఏర్పాట్లు చేస్తున్నారు.
చదవండి: AP Inter 1st Year Study Material
మార్చి ఒకటి నుంచి ప్రారంభం
గతేడాది కంటే పెరిగిన మూడు వేల మంది విద్యార్థులు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పరీక్షా కేంద్రాల పెంపు పరీక్ష కేంద్రాల్లోని ప్రతి రూములో సీసీ కెమెరాలు ఏర్పాటు లైవ్ స్ట్రీమింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్న ఇంటర్మీడియెట్ బోర్డు ఉన్నతాధికారులు
పూర్తిస్థాయి వసతులు ఉన్న కళాశాలల్లోనే కేంద్రాలు
ఇంటర్ పరీక్షలకు పూర్తిస్థాయిలో వసతులు ఉన్న కళాశాలలనే పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేశాం. కనీస వసతులు లేని కళాశాలలను పరీక్ష కేంద్రాల పరిశీలనకు తీసుకోలేదు. ఫర్నీచర్, మౌలిక వసతులు, రవాణా వ్యవస్థతోపాటు విద్యార్థుల భద్రతకు పూర్తిస్థాయిలో అనకూలమైన పరిస్థితులు ఉన్న కళాశాలలనే కేంద్రాలుగా గుర్తించాం.
– జీకే జుబేర్, ఇంటర్మీడియెట్ విద్య ప్రాంతీయ పర్యవేక్షణాధికారి, గుంటూరు జిల్లా
Tags
- Inter Exams
- AP Inter Exams 2024
- Intermediate
- Intermediate Public Examinations
- Inter Exams 2024 Andhra Pradesh
- examination centers
- Government Junior Colleges
- Private Junior Colleges
- Education News
- andhra pradesh news
- IntermediateExams
- DistrictEducation
- GunturEducation
- EducationAuthorities
- ExamPreparations
- PrivateExams
- RegularStudents
- Sakshi Education Latest News