Syllabus: 30 శాతం సిలబస్ కుదింపు: ఇంటర్ బోర్డ్
సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత ప్రణాళిక సిద్ధం చేసే వీలుందని బోర్డ్ వర్గాలు తెలిపాయి. ‘తికమక పెడుతున్న త్రికోణమితి’ శీర్షికతో ‘సాక్షి’ దినపత్రిక సెప్టెంబర్ 10న ఓ కథనాన్ని ప్రచురించింది. కరోనా నేపథ్యంలో బోధన సరిగ్గా జరగకపోవడంతో ఫస్టియర్లో 30 శాతం సిలబస్ను కుదిరించారు. కానీ సెకండ్ ఇయర్లో మొదటి ఏడాది కుదించిన పాఠాలనే కొనసాగించడం వల్ల విద్యార్థులకు అర్థంకాక గందరగోళపడుతున్న అంశాన్ని కథనంలో విశ్లేషించారు. ఇవే పాఠాల నుంచి జాతీయస్థాయి పోటీ పరీక్షల్లోనూ ప్రశ్నలిస్తే విద్యార్థులకు నష్టం కలుగుతుందన్న విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచి్చంది. ఈ కథనంపై సర్వత్రా చర్చ జరిగింది. విద్యావేత్తలు ఈ అంశాన్ని కేంద్ర సంస్థల దృష్టికీ తీసుకెళ్లారు. దీనిపై అన్ని వర్గాల్లో పునరాలోచన జరిగినట్టు తెలిసింది. ఫలితంగా రెండో ఏడాది కూడా 70 శాతం సిలబస్నే పరీక్షల్లో ఇవ్వాలనే దిశగా అడుగులు పడుతున్నాయి.
సీబీఎస్ఈదీ ఇదే బాట
ఫస్టియర్లో తొలగించిన సిలబస్ను రెండో ఏడాదిలోనూ కొనసాగింపు లేకుండా జాగ్రత్త పడాలని కేంద్ర విద్యాశాఖ భావిస్తోంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) దీనిపై ఇప్పటికే ఓ నిర్ణయానికొచ్చింది. జాతీయస్థాయిలో ఈ విధానం అమలు చేసేందుకు వీలుగా అన్ని రాష్ట్రాల ఇంటర్ బోర్డ్ల అభిప్రాయాలను కోరింది. కోత పెట్టే సిలబస్లోని పాఠ్యాంశాలు పోటీ పరీక్షల్లో లేకుండా ఏకీకృత విధానం అమలు చేయాలనే యోచనలో ఉన్నట్టు తెలిసింది. దీంతో ఈ అంశంపై ఇటీవల రాష్ట్ర ఇంటర్ బోర్డ్ ఉన్నతాధికారులు చర్చించినట్టు సమాచారం. కేంద్ర స్థాయిలో 70 శాతం సిలబస్నే అమలు చేయాలని భావించినప్పుడు, రాష్ట్రంలోనూ దీన్నే అమలు చేయడం సరైన చర్యగా భావిస్తున్నారు. ‘సాక్షి’ లేవనెత్తిన అంశాలనే క్రోడీకరించి బోర్డ్ అధికారులు ఓ నివేదిక రూపొందించినట్టు తెలిసింది. ఇందులో 30 శాతం సిలబస్ తొలగించకపోతే ఎదురయ్యే ఇబ్బందులను వివరించినట్టు సమాచారం. అంతిమంగా 70 శాతం సిలబస్కే పరిమితమవ్వడం సరైన నిర్ణయంగా బోర్డు సీఎంకు పంపిన నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది.
ఫస్టియర్ పరీక్షల్లో
అక్టోబర్ 25 నుంచి జరిగే మొదటి సంవత్సరం పరీక్షల్లో ఎక్కువ శాతం ఐచి్ఛక ప్రశ్నలు (మలి్టపుల్ చాయిస్) ఇవ్వాలని ఇంటర్ బోర్డ్ నిర్ణయించింది. పరీక్షలు ఆలస్యంగా జరగడం, ఇప్పటికే రెండో ఏడాది బోధనలో విద్యార్థులు నిమగ్నమవ్వడం, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఫస్టియర్ పరీక్షలు విద్యార్థులను కంగారు పెట్టేలా ఉండకూడదని బోర్డ్ భావించినట్టు తెలిసింది. హుజూరాబాద్లో ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని ఇంటర్ పరీక్ష నిర్వహణపై అధికారులు చర్చిస్తున్నారు. కొన్ని పరీక్ష కేంద్రాలను మార్చడమా? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉన్నాయా? అనే దిశగా త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి.
చదవండి: