AP Inter Supplementary Fees and Date: ఇంటర్ సప్లిమెంటరీ, రీ వెరిఫికేషన్‌లకు ఫీజు చెల్లింపు.. తేదీ..?
అమరావతి: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు ఈనెల 18 నుంచి 24 వరకు ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ ఓ ప్రకటనలో తెలిపారు. మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఇదే తేదీల్లో ఫీజు చెల్లించాలని సూచించారు. జవాబు పత్రాల (ఒక్కో పేపర్) రీ వెరిఫికేషన్‌కు రూ.1300, రీకౌంటింగ్‌కు రూ.260 చెల్లించాలన్నారు.
SLAS Exam: రేపు ఉపాధ్యాయులకు శ్లాస్ పరీక్ష..
సప్లిమెంటరీ పరీక్షల కోసం ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు పేపర్లతో సంబంధం లేకుండా రూ.550, ప్రాక్టికల్స్‌కు రూ.250, బ్రిడ్జి కోర్సులకు రూ.150 చొప్పున చెల్లించాలని పేర్కొన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో అన్ని పేపర్లు ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంప్రూవ్‌మెంట్ కోసం రూ.550 పరీక్ష ఫీజుతో పాటు పేపర్‌కు రూ.160 చొప్పున చెల్లించాలి.
KGBV Inter Student: కేజీబీవీ ఇంటర్ విద్యార్థినికి ఎంఈఓ అభినందనలు..
మొదటి, రెండో సంవత్సరం ఇంప్రూవ్‌మెంట్ రాయాలనుకుంటే.. సైన్స్ విద్యార్థులు రూ.1440, ఆర్ట్స్ విద్యార్థులు రూ.1240 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు తమతమ కళాశాలల్లో సంప్రదించాలని సూచించారు. కాగా, మే 25 నుంచి జూన్ 1 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నామని, ఫీజు చెల్లింపునకు మరో అవకాశం ఉండదని, ఈ విషయం అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ గుర్తించాలని సౌరభ్ గౌర్ విజ్ఞప్తి చేశారు.
Gurukul Degree Admissions: గురుకుల కళాశాలల్లో ప్రవేశానికి పరీక్ష తేదీ..!
Tags
- ap inter supplementary
- fees dates
- inter board
- re verification
- inter marks re counting
- inter 1st year
- supplementary exam fees payment date
- inter 2nd year
- AP inter results
- Intermediate Board Secretary Saurabh Gaur
- last date for supplementary fees
- junior colleges principals
- students education
- inter students
- Education News
- Sakshi Education News
- amaravathi news
- IntermediateBoard
- Amaravati
- SaurabhGaur
- SupplementaryExams
- FailedExams
- FeePayment
- Reverification
- recounting
- AnswerSheets
- sakshieducation updates