Skip to main content

AP Inter Results 2021: నేడే ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు... ఎడ్యుకేష‌న్‌.సాక్షి.కామ్‌లో ఫ‌లితాలు

సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్‌ అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు అక్టోబ‌ర్ 23వ తేదీన విడుదల కానున్నాయి.
AP Inter 2021 Results
ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు

ఈ మేరకు ఇంటర్మీడియెట్‌ బోర్డు ఇన్‌చార్జ్జ్‌ కార్యదర్శి వి.రామకృష్ణ ఒక‌ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్మీడియెట్‌ ఫస్టియర్, సెకండియర్‌ విద్యార్థులకు సెప్టెంబర్‌ 15 నుంచి 23వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలను బోర్డు నిర్వహించింది.ఈ ఫలితాలు అక్టోబ‌ర్ 23వ తేదీన‌ సాయంత్రం 5 గంటల నుంచి అందుబాటులో ఉంటాయని రామకృష్ణ పేర్కొన్నారు. అక్టోబ‌ర్‌ 25వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి విద్యార్థులు ‘https:bie.ap.gov.in’ ద్వారా తమ షార్ట్‌ మార్కుల మెమోలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వివరించారు. ఫలితాలకు సంబంధించిన గ్రీవెన్స్‌ను ‘ourbieap@gmail.com'’ ద్వారా లేదా 9391282578 వాట్సాప్‌ నంబర్ల‌కు సంప్రదించవచ్చని తెలిపారు. ఈ ఫ‌లితాల‌ను education.sakshi.com వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

Published date : 23 Oct 2021 11:27AM

Photo Stories