Degree Results: ఓయూ డిగ్రీ ఫలితాల్లో అమ్మాయిల హవా
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ డిగ్రీ ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఉస్మానియా పరిధిలో ఈ ఏడాది జూన్, జులై నెలల్లో జరిగిన బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ రెగ్యులర్ కోర్సుల చివరి సంవత్సరం సెమిస్టర్ పరీక్షలకు 72 వేల మంది హాజరు కాగా.. 46 వేలకు పైగా (65 శాతం) ఉత్తీర్ణులయ్యారు.
అందులో బాలికల శాతం 75 కాగా.. బాలురు 53 శాతం ఉన్నట్లు ఓయూ ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొ.రాములు వివరించారు. బీఏ కోర్సులో 66 శాతం, బీకాంలో 65, బీఎస్సీలో 58, బీబీఏ 82 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు.
చదవండి: Universities: విశ్వవిద్యాలయాల్లో పడిపోతున్న విద్యా ప్రమాణాలు.. వీరు వస్తేగానీ మారని పరిస్థితి
మార్కుల జాబితాలను ఉస్మానియా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తక్కువ మార్కులతో పాటు పరీక్షలో తప్పిన విద్యార్థులు రీవాల్యుయేషన్, రీకౌంటింగ్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు ఉస్మానియా వెబ్‌సైట్ చూడవచ్చు.
Published date : 12 Aug 2024 12:46PM