Intermediate: ఇంటర్‌లో రెండో విడత అడ్మిషన్లు ప్రారంభం
Sakshi Education
రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ ప్రవేశాల రెండో విడత ప్రక్రియ సెప్టెంబర్ 29 నుంచి ప్రారంభమైంది.
ఈ ప్రవేశాలను అక్టోబర్ 8వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్, ప్రైవేటు అన్ ఎయిడెడ్, కో–ఆపరేటివ్, ఏపీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ఏపీ మోడల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు నిర్వహించనున్నారని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ పేర్కొన్నారు. 2021–22 విద్యాసంవత్సరానికి సంబంధించి రెండేళ్ల ఇంటర్మీడియెట్ కోర్సుల్లోకి విద్యార్థులను ఆఫ్‌లైన్ విధానంలో ఆయా కాలేజీలు చేర్చుకోవాలని సూచించారు. ఇవే చివరి ప్రవేశాలు అని, తదుపరి ప్రవేశాలకు ఎలాంటి అవకాశం ఉండదని పేర్కొన్నారు. కాలేజీలు ప్రభుత్వం నిర్దేశించిన రిజర్వేషన్ల ప్రకారం ఆయా సీట్లను భర్తీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
చదవండి:
Published date : 30 Sep 2021 02:43PM