Telugu Language: తెలుగు భాషాభివృద్ధికి పెద్దపీట
విజయవాడలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో సెప్టెంబర్ 28న తెలుగు, సంస్కృత అకాడమీ ఆధ్వర్యంలో ముద్రించిన ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ప్రతిష్టాత్మక తెలుగు అకాడమీ ఏర్పాటులో గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. తెలుగు భాషపై ప్రత్యేక శ్రద్ధతో తిరుపతి కేంద్రంగా తెలుగు అకాడమీని స్థాపించినట్టు గుర్తు చేశారు. సంస్కృత భాషను కూడా పరిరక్షించాలనే మహత్తర ఆలోచనతో తెలుగు అకాడమీని తెలుగు, సంస్కృత అకాడమీగా నామకరణం చేశారన్నారు. ముఖ్యమంత్రి లక్ష్యానికి అనుగుణంగా అకాడమీ ఏర్పడిన తర్వాత తొలిసారి విజయవంతంగా ఇంటర్ పాఠ్యపుస్తకాలను ముద్రించిందని కొనియాడారు. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో అన్ని సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలను అందుబాటులోకి తీసుకొచి్చనట్టు తెలిపారు. సంస్కృత పుస్తకాల ముద్రణ జరుగుతోందన్నారు. త్వరలో డీఎస్సీ, డిగ్రీ, పీజీ పాఠ్యపుస్తకాలు, అనువాద, ప్రాచీన, ఆధునిక సాహిత్య పుస్తకాల ముద్రణలకు కృషి చేయాలని కోరారు.
సీఎం ప్రోత్సహిస్తున్నారు: లక్ష్మీపార్వతి
తెలుగు, సంస్కృత అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో అకాడమీని ముందుకు తీసుకెళ్లడానికి సీఎం ఎంతో ప్రోత్సహించారన్నారు. ఈ క్రమంలోనే విభజన చట్టం ప్రకారం అకాడమీకి తెలంగాణ నుంచి రావాల్సిన నిధులు, సిబ్బంది విషయంలో సుప్రీం కోర్టు సానుకూల తీర్పు అకాడమీ విజయంగా అభివరి్ణంచారు. ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కారం అవుతాయన్నారు. త్వరలోనే విమర్శకుల నోళ్లు మూయించేలా ఆరి్థక బలం పుంజుకుని అకాడమీ పని చేస్తుందరి ధీమా వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రామకృష్ణ, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి పాల్గొన్నారు.
చదవండి:
Andhra Pradesh Public Service Commission Notification 2021 for Telugu Reporters Posts
Digital: డిజిటల్ తెరపై తెలుగు వెలుగులు