SSC: తెలుగులోనూ ఎస్‌ఎస్‌సీ పరీక్ష
భాష అవరోధం కారణంగా ఎవరూ అవకాశాలు కోల్పోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. త్వరలోనే రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో పేర్కొన్న అన్ని భాషలను చేర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నామని జితేంద్ర సింగ్ తెలిపారు.
చదవండి: ఎస్‌ఎస్‌సీ పరీక్షలు - గైడెన్స్ | న్యూస్ | ప్రివియస్ పేపర్స్ | వీడియోస్
IT department: నిరుద్యోగ అభ్యర్థులను హెచ్చరించిన ఐటీ శాఖ..
నిరుద్యోగుల ఆశను తమకు అనుకూలంగా మార్చుకొని ఎంతో మంది మోసాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల పేరిట నిత్యం ఏదో ఒక చోట మోసం బయటపడుతూనే ఉంది. ఈ విషయమై ఆదాయపన్ను శాఖ నిరుద్యోగ అభ్యర్థులను అలర్ట్ చేసింది. మోసపూరిత ఉద్యోగ ప్రకటనలను నమ్మవద్దంటూ ప్రకటన జారీ చేసింది. నిరుద్యోగుల అభ్యర్థుల్లో అవగాహన కలిగించేందుకు ఐటీ శాఖ ఓ ట్వీట్ చేసింది.
ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారు ఎస్‌ఎస్‌సీ లేదా ఐటీ శాఖకు చెందిన అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే నమ్మాలని తెలిపారు. ఈ వెబ్‌సైట్స్‌లో వచ్చిన నోటిఫికేషన్స్‌కు మాత్రమే నమ్మాలంటూ పేర్కొన్నారు. కొంత మంది మోసగాళ్లు ఉద్యోగాల పేరుతో ఆశ చూపి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. నకిలీ అపాయింట్‌మెంట్ లేఖల పేరుతో మోసాలకు పాల్పడుతోన్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గ్రూప్ బి, గ్రూప్ సి వంటి ఉద్యోగాలన్నింటినీ నేరుగా ఎస్‌ఎస్‌సీ ద్వారానే భర్తీ చేస్తామని ఐటీ శాఖ స్పష్టం చేసింది.
Also Read: SSC EXAMS - STUDY MATERIAL | SYLLABUS | PREVIOUS PAPERS | GRAND TESTS