Skip to main content

AP EAPCET Counselling 2023: ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఏపీ ఈఏపీసెట్‌ –2023కు సంబంధించిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఖరారైంది. జులై 24 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నిర్వహిస్తారు.
AP EAPCET Counselling 2023 Registration Begins
AP EAPCET Counselling 2023 Registration Begins

హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో జులై 25 నుంచి ఆగస్టు 4వ వరకూ అప్‌లోడ్‌ చేసిన సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో పరిశీలిస్తారు. ఆగస్టు 3 నుంచి 8 వరకూ వెబ్‌ ఆప్షన్ల ఎంపిక, 9వ తేదీ వెబ్‌ ఆప్షన్ల మార్పు, ఆగస్టు 12న సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఆగస్టు 13 నుంచి 14 వరకూ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌, లేదా నేరుగా కళాశాలకు వెళ్లి రిపోర్ట్‌ చేయడం, ఆగస్టు 16 నుంచి ఇంజినీరింగ్‌, ఫార్మసీ తరగతులు నిర్వహిస్తారు.

Engineering Seats Cutoff: 1,300 ఇంజినీరింగ్‌ సీట్లు కోత

ఏపీ ఈఏపీసెట్‌ –2023 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ప్రకటించిన నేపథ్యంలో జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో ఎన్ని సీట్లు ఖరారు చేశారనే అంశంపై స్పష్టత వచ్చింది. ఏపీ ఉన్నత విద్యామండలికి జేఎన్‌టీయూ అనంతపురం ఉన్నతాధికారులు అనుమతించిన ఇంజినీరింగ్‌, ఫార్మసీ సీట్లను నివేదించారు. తద్వారా ఉన్నత విద్యామండలి అనుమతించిన సీట్లకే వెబ్‌ ఆప్షన్లు ఇవ్వడానికి వీలు కలుగుతుంది.

Published date : 24 Jul 2023 02:00PM

Photo Stories