Engineering Seats Cutoff: 1,300 ఇంజినీరింగ్ సీట్లు కోత
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏఐసీటీఈ అనుమతించిన సీట్లలో మొత్తం 1,300 సీట్లను వర్సిటీ కోత విధించింది.
విద్యా ప్రమాణాలు లోపించడం, మౌలిక సదుపాయాల లేమి, అనర్హులైన, అనుభవం లేని ప్రొఫెసర్లతో బోధన, పరిశోధనలు లేకపోవడం, ఏఐసీటీఈ నిబంధనలు పాటించకపోవడం, గత మూడు సంవత్సరాల్లో అనుమతించిన సీట్ల కంటే 30 శాతంలోపు ఇంజినీరింగ్ సీట్లు భర్తీ చేయడం తదితర కారణాలతో ఈ దురవస్థ నెలకొంది.
13 ఇంజినీరింగ్ కళాశాలల్లో ఆ మేరకు సీట్ల కోత విధించారు. ఇందులో ఎక్కువ కంప్యూటర్ సైన్సెస్ సీట్లు కావడం గమనార్హం. మరో వైపు మూడు ఇంజినీరింగ్ కళాశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వచ్చే విద్యా సంవత్సరంలోపు సరైన సదుపాయాలు కల్పించకపోతే అడ్మిషన్లు నిరాకరిస్తామని పేర్కొన్నారు.
Published date : 24 Jul 2023 01:44PM