AP EAPCET 2024: రేపటి నుంచి ఏపీ ఎంసెట్ పరీక్షలు, ముఖ్యమైన సూచనలు ఇవే..
రేపటి నుంచి ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు జరగనున్నాయి. ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే (ఎంసెట్) ఏపీఈఏపీ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే హాల్‌టికెట్స్ విడుదలయ్యాయి.
అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు మే 16, 17 తేదీల్లో పరీక్షలు జరగగా, ఇంజినీరింగ్ విభాగానికి మే 18 నుంచి 23 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.ఈఏపీసెట్ పరీక్షల నిర్వహణను ఈ ఏడాది జేఎన్‌టియూ కాకినాడ నిర్వహిస్తోంది.
TS EAMCET Results 2024 Release Date : TS EAPCET ఫలితాల విడుదల మే 25 లేదా 27 తేదీల్లో.. కానీ.. !
మొత్తం 142 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు తొలి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలను నిర్వహిస్తారు.
’’ రాష్ట్ర వ్యాప్తంగా 3,61,640 మంది ఈ ఎప్‌సెట్‌కు హాజరవుతున్నారు. ఇందులో మహిళలు 1,81,536 మంది, పురుషులు 1,80,104 మంది విద్యార్ధులు ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఎంపీసీ విభాగంలో 34,828 మంది అదనంగా దరఖాస్తు చేసుకున్నారు. బైపీసీ విభాగంలో మాత్రం 13,138 మంది విద్యార్ధులు గత ఏడాదితో పోలిస్తే తక్కువగా దరఖాస్తు చేసుకున్నారు’’ అని ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె. హేమచంద్రరెడ్డి తెలిపారు.
ముఖ్యమైన సూచనలు..
‘‘ఒక నిమిషం నిబంధన పక్కాగా అమలు చేస్తాం. ఏ రకమైన ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకు రాకూడదు. పరీక్షా కేంద్రంలో పలికి విద్యార్ధులను అరగంట ముందుగా అనుమతి ఇస్తాం. పరీక్షా కేంద్రాలకి బస్సులు నడపాలని ఆర్టిసిని విజ్ణప్తి చేశాం. పరీక్షా కేంద్రాలకి నిరంతరాయ విద్యుత్ సరఫరా ఏర్పాటు చేశాం. 160 ప్రశ్నలు ఉంటాయి. నెగటివ్ మార్కులు విధానం లేదు. బయోమెట్రిక్ విధానంతో హాజరు తీసుకుంటాం కాబట్టి చేతులకి మెహందీ పెట్టుకోవద్దు. చెవులకి చెవి దిద్దులు తీసేసి పరీక్షలకి హాజరు కావాలి. ప్రతీ హాల్ టికెట్ వెనుక పరీక్షా కేంద్రం రూట్ మ్యాప్ కూడా ఉంటుంది’’ అని హేమచంద్రారెడ్డి తెలిపారు.
ఒక నిమిషం నిబంధన పక్కాగా అమలు చేస్తాం..
ఏపీ ఈఏపీసెట్ రీక్షలకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏపీ ఎప్‌సెట్ చైర్మన్, కాకినాడ జేఎన్‌టీయూ వీసీ ప్రొఫెసర్ ప్రసాదరాజు తెలిపారు. ‘‘ఒక నిమిషం నిబంధన పక్కాగా అమలు చేస్తాం. విద్యార్ధులు పరీక్షా కేంద్రాలకి ముందుగానే చేరుకోవాలి. ఇప్పటికే విద్యార్ధులకి హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేయడానికి అందుబాటులో ఉంచాం. విద్యార్థులెవరూ ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రానికి తీసుకురావద్దు. విద్యార్ధులు ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలి’’ అని తెలిపారు.