Skip to main content

Gurukul Entrance Exam : రేపే బీసీ గురుకుల ప్ర‌వేశ ప‌రీక్ష‌..109 కేంద్రాల ఏర్పాటు..

TG BC gurukul entrance exam tomorrow   Telangana BC Gurukul School Admissions 2025-26

సాక్షి ఎడ్యుకేష‌న్‌: తెలంగాణ‌ బీసీ గురుకుల స్కూళ్లలో అడ్మిష‌న్లు ప్రారంభ‌మైయ్యాయి. 2025-26 నూత‌న విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 7, 8, 9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న‌ సీట్లను భర్తీ కోసం ప్ర‌వేశ ప‌రీక్ష నిర్వ‌హిస్తున్నారు. ఇక‌, ఈ ప‌రీక్ష‌లు రేపే ప్రారంభం కానున్నాయి. ఈ అర్హత పరీక్షలో ఉత్తీర్ణ‌త సాధించిన‌వారు ప్ర‌వేశం పొందుతారు. రేపు.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ప‌రీక్ష జరుగుతుందని ప్ర‌క‌టించారు.

JEE Main 2025 Session 2 Telugu Toppers: జేఈఈ మెయిన్ 2025 సెషన్‌ 2 ఫలితాలలో తెలుగు తేజాలు

ఈ ప‌రీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 109 ప‌రీక్ష కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. ఇక‌, ఈ కేంద్రాల్లో విద్యార్థుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు అధికారులు. అయితే, ఇప్ప‌టికే ఆ 109 పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. ఇక‌, ప‌రీక్ష కోసం మొత్తం 6,832 బ్యాక్‌లాగ్ సీట్లకు 26,884 అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 19 Apr 2025 11:04AM

Photo Stories