Skip to main content

AP EAPCET 2024: ప్రారంభమైన ఏపీ ఎంసెట్‌ పరీక్షలు

AP EAPCET 2024

విజయవాడ: ఏపీ ఈఏపీ సెట్(ఎంసెట్‌) పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్ పరీక్ష ప్రారంభం అయింది. అనంతరం మద్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు రెండో సెషన్‌గా పరీక్షలు జరగనుంది. 

రేపు( శుక్రవార) బైపీసీ గ్రూపుకి ఎప్‌సెట్ పరీక్షలు జరుగనున్నాయి. 18వ తేదీ నుంచి 23 వరకు ఇంజనీరింగ్ విభాగానికి ఈఏపీ సెట్‌ పరీక్షలు జరుగుతాయి. రోజుకి రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఆన్‌లైన్ విధానంలో ఎప్‌సెట్ పరీక్షలు జరుగుతాయి.

ఒక్క నిమిషం నిబంధన..
రాష్ట్ర వ్యాప్తంగా 140 సెంటర్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో రెండు సెంటర్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపి ఎప్‌సెట్‌కి హాజరవుతున్న విద్యార్ధుల సంఖ్య 3,61,640. ఇందులో మహిళలు1,81,536 మంది. పురుషులు 1,80,104 మంది విద్యార్ధులు ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే 22 వేలకి పైగా విద్యార్థులు అదనంగా దరఖాస్తు చేసుకున్నారు. 

CBSE Results 2024: సీబీఎస్ఈ 10, 12 తరగతుల రీవెరిఫికేషన్, రీవాల్యూయేషన్ తేదీలు ఇవే..

ఇక.. ఒక నిమిషం నిబందన పక్కాగా అమలు చేయనున్న ఉన్నత విద్యా మండలి పేర్కొంది. విద్యార్ధులను పరీక్షా కేంద్రం లోపలికి గంటన్నర ముందుగానే అనుమతి ఉంటుంది. ఏ రకమైన ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకు రాకూడదు. విద్యార్ధులు చేతులకి మెహందీ పెట్డుకోకూడదు. ఇయర్ రింగ్స్ పెట్టుకోవడంపైనా నిషేదం ఉన్నట్లు ఉన్నతి విద్యామండలి తెలిపింది.

Published date : 16 May 2024 11:43AM

Photo Stories