రాంపురం: గ్రామ ఆర్ధిక వ్యవస్థ
ముఖ్యాంశాలు:
- పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని సారవంతమైన గంగా మైదానపు ఒండ్రు నేలల్లో రాంపురం ఉంది. వ్యవసాయ పరంగా సంపన్నమైన ప్రాంతం. చక్కటి రవాణా సదుపాయాలు ఇక్కడ
- రాంపురం ప్రధాన ఉత్పత్తి కార్యకలాపం వ్యవసాయం. ఖరీఫ్‌లో రైతులు జొన్న , సజ్జలు సాగు చేస్తారు. రబీలో గోధుమ పంట వేస్తారు. రాయిగంజ్ ఒక వ్యవసాయ మార్కెటు యార్డు. మూడో పంటగా బంగాళాదుంప సాగు చేస్తున్నారు.
- రాంపురంలో బాగా అభివృద్ధి చెందిన నీటి పారుదల వ్యవస్ధ ఉన్నందు వల్ల రైతులు సంవత్సరంలో మూడు పంటలదాకా సాగు చేస్తున్నారు.
- రాంపురం రైతులు బావుల నుంచి నీళ్లు పైకి తోడడానికి పర్షియన్ వీల్ అనే పరికరాన్ని ఉపయోగించారు. విద్యుత్తుతో బోరుబావుల ద్వారా ఎక్కువ విస్తీర్ణాన్ని సాగు చేస్తున్నారు.
- భూమి, నీరు వంటి సహజ వనరులను అధికంగా ఉపయోగించడం వల్ల దిగుబడులు, ఉత్పత్తి పెరిగాయి.
- భారతదేశం అంతటా సాగు నీటిని ప్రధానంగా భూగర్భ జలాలపై ఆధారపడడం వల్ల భూగర్భ జలాల మట్టం గణనీయంగా పడిపోయింది.
- రాంపురంలో మూడింట ఒక వంతు అంటే 150 కుటుంబాలకు భూమి లేదు. భూమి లేని వాళ్లలో అధిక శాతం దళితులు.
- ప్రజలకు అవసరమైన వస్తువులు,సేవలు అందించడమే ఉత్పత్తి ఉద్దేశం. వస్తువుల ఉత్పత్తికి భూమి, నీళ్లు, అడవులు, ఖనిజలవణాలు వంటి సహజ వనరులు కావాలి.
- ఉత్పత్తి ప్రక్రియకు అవసరమైన పనులు చేయడానికి బాగా చదువు, నైపుణ్యం, శారీరక శ్రమ చేసే కార్మికులు కావాలి. పనిముట్లు, యంత్రాలు, భవనాల నిర్మాణం, ముడిసరుకుల కోసం పెట్టుబడి కావాలి. జ్ఞానం, వ్యాపార దక్షత తప్పని సరిగా వుండాలి.
- మంచి రోడ్లు, రవాణా, టెలిఫోను సౌకర్యం వంటివి మెరుగుపరచడం వల్ల గ్రామాలకు పట్టణాలు, నగరాలతో మంచి అనుసంధానం ఏర్పడి రానున్న సంవత్సరాలలో గ్రామాలలో వ్యవసాయేతర ఉత్పత్తి కార్యకలాపాలు పెరుగుతాయి.
కీలక పదాలు:
- ఉత్పత్తి కారకాలు: భూమి, శ్రమ, భౌతిక పెట్టుబడులతో వ్యక్తులు, వ్యాపార దక్ష తతో కూడిన వ్యాపారవేత్తలు వస్తువులను ఉత్పత్తి చేస్తారు. వీటిని ఉత్పత్తి కారకాలు అంటారు.
- భూమి: వస్తువులను ఉత్పత్తి చేయుటకు ప్రధాన ఉత్పత్తి కారకం భూమి. వ్యవసాయం చేయడానికి భూమి ఎంతో ముఖ్యమైనది. భూమి, నీళ్లు, అడవులు, ఖనిజలవణాలు వంటి సహజవనరులు వస్తువులు తయారు చేయడానికి కావాలి.
- శ్రమ: ఉత్పత్తి నిర్వహణకు సహాయపడు కారకం శ్రమ. ప్రతి శ్రామికుడు ఉత్పత్తికి అవసరమైన శ్రమను అందిస్తున్నాడు. కొన్ని ఉత్పత్తి ప్రక్రియలకు అవసరమైన పనులు చేయడానికి బాగా చదువుకున్న, నైపుణ్యాలు గల కార్మికులతో పాటు శారీరిక శ్రమ చేసే కార్మికులు కావాలి.
- నిర్వహణ పెట్టుబడి: ముడిసరుకులు కొనడానికి, ఉత్పత్తి పూర్తి చేయడానికి కావలసిన డబ్బులను నిర్వహణ పెట్టుబడిగా పిలుస్తారు.
- స్థిర పెట్టుబడి: పనిముట్లు, యంత్రాలు, భవనాలు మొదలైనవి అనేక సంవత్సరాల పాటు వస్తువుల ఉత్పత్తిలో ఉపయోగపడుతాయి. ఇలా సంవత్సరాల పాటు వస్తు ఉత్పత్తికి దోహ దపడు వాటిపై చేయు వ్యయం స్థిర పెట్టుబడి.
- మిగులు: మిగులు = ఉత్పత్తి- వినియోగం వ్యవసాయదారుడు వస్తూత్పత్తికి చేసిన ఖర్చులు, స్వంత వినియోగం పోగా మిగులు వ్యవసాయ ఉత్పత్తినే మిగులుగా పేర్కొనవచ్చు. కొంత మంది రైతులు తమ మిగులు డబ్బుతో పశువులు, ట్రక్కులు కొంటారు లేదా దుకాణాలు పెడతారు.
- వ్యవసాయ, వ్యవసాయేతర కార్యకలాపాలు: పంటలు పండించడం, నీటి పారుదల, సేద్యపు పనులు, పంటలను మార్చడం వ్యవసాయ కార్యకలాపాలు. పాల ఉత్పత్తి, చేపల పెంపకం మొదలైనవి వ్యవసాయేతర కార్యకలాపాలు.
1) ఒకే విస్తీర్ణం ఉన్న భూమి నుంచి ఉత్పత్తి పెంచడానికి ఉన్న వివిధ పద్ధతులు ఏమిటి? కొన్ని ఉదాహరణలతో వివరించండి.
జ:
- ఒకే విస్తీర్ణంలో సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను సాగు చేయడాన్ని బహుళ పంటల సాగు అంటారు.
- భూమి నుంచి ఉత్పత్తిని పెంచడానికి ఇది అత్యంత సాధారణ పద్ధతి.
- రాంపురంలో రైతులందరు కనీసం రెండు పంటల సాగు చేస్తారు.
- రాంపురంలో మూడో పంటగా బంగాళాదుంప సాగు చేస్తున్నారు.
- రాంపురంలో బాగా అభివృద్ధి చెందిన నీటి పారుదల వ్యవస్థ ఉన్నందు వల్ల రైతులు సంవత్సరంలో ఒకే విస్తీర్ణం ఉన్న భూమిపై మూడు పంటలు సాగు చేస్తున్నారు.
- విద్యుత్తుతో నడిచే బోరుబావుల ద్వారా తేలికగా ఎక్కువ విస్తీర్ణానికి సాగు నీరు అందివ్వవచ్చని రైతులు గుర్తించారు.
- భూమి, నీరు వంటి సహజ వనరులను సక్రమంగా, అధికంగా వినియోగించడం వల్ల వ్యవసాయ ఉత్పత్తి పెరిగింది.
2) మధ్య తరగతి, పెద్ద రైతులకు వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడిని ఎలా సమకూరుతుంది. చిన్నరైతులకు వీళ్లకు మధ్య ఉన్న తేడా ఏమిటి?
జ:
- చిన్న రైతుల వలె కాకుండా మధ్యతరగతి, పెద్ద రైతులకు సాధారణంగా వ్యవసాయ ఆదాయంలోని మిగుళ్లు అందుబాటులో ఉంటాయి.
- వారు విత్తనాలు, రసాయనిక ఎరువులు, పురుగు మందులు, కూలీలకు చెల్లింపులకై అవసరమగు వాటిని స్వంతంగానే సమకూర్చుకోగలుగుతారు.
- నిర్వహణ పెట్టుబడుల కోసం చాలా మంది చిన్న రైతులు అప్పు చేయాల్సి ఉంటుంది. అధిక వడ్డీలతో వీరు వడ్డీ వ్యాపారుల నుంచి పెట్టుబడులను సమకూర్చుకుంటారు.
- పెద్ద రైతులకు ట్రాక్టర్లు, మార్పిడి యంత్రాలుంటాయి. సాగు నీటికై బోరు బావులు వుంటాయి.
3) మీ ప్రాంతంలోని ప్రధాన వ్యవసాయేతర పనులు ఏమిటి? ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఎంచుకొని ఒక చిన్న నివేదిక తయారు చేయండి.
జ:
- ప్రధాన ఉత్పత్తి కార్యకలాపమైన వ్యవసాయంతో పాటు కొన్ని వ్యవసాయేతర ఉత్పత్తి కార్యకలాపాలు మా ప్రాంతంలో ఉన్నాయి.
- పాల సేకరణ, శీతలీకరణ కేంద్రాలు, సొంత షెడ్డులలో వాణిజ్యం, గేదెల, గొర్రెల పోషణ, పశువుల సంతలు, బెల్లం తయారీ మొదలైనవి ప్రధానమైన వ్యవసాయేతర పనులు.
- మొక్కజొన్న పంటలు పండడం వల్ల, జొన్న విత్తనాలు పశుగ్రాసంగా, కోళ్ల మేతగా మల చి కోళ్ల ఫారాలకు విక్రయిస్తున్నారు.
- ‘కుసుమలు’ పంట ద్వారా వంటనూనెను ఉత్పత్తి చేసి సమీపంలో గల పట్టణ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు.
- ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి మొదలైనవి ప్రధాన ఆహార పదార్ధాలు పుష్కలంగా పండడం వల్ల స్ధానికి మార్కెట్లలో వాటిని విక్రయిస్తుంటారు.
- స్ధానికంగా వున్న ‘స్టోన్‌కట్టింగ్’ పనులకు వ్యవసాయంతో పాటు వ్యవసాయ కార్మికులు వెళ్తుంటారు.
4) ఉత్పత్తికి భూమి కాకుండా శ్రమ కొరతగా ఉండే పరిస్థితిని ఊహించుకోండి. అప్పుడు రాంపురం కథ ఇందుకు భిన్నంగా ఉండేదా? ఎలా? చర్చించండి.
జ:
- ఉత్పత్తి కారకాలలో శ్రమ ప్రధానమైనది. అయితే, కొత్త వ్యవసాయ పద్ధతుల వల్ల శ్రామికులను తక్కువగా వినియోగించుకుంటున్నారు.
- వ్యవసాయంలో శ్రమను మితంగా ఉపయోగించుకోవడం వల్ల వారికి తగిన పని గ్రామీణ ప్రాంతాలలో లభ్యం కావడం లేదు.
- దీంతో శ్రామికులు అవకాశాల కోసం వెదుక్కుంటూ పక్క గ్రామాలకు, పట్టణాలకు, నగరాలకు వలస వెళ్తున్నారు.
- కొంత మంది వ్యవసాయ కార్మికులు గ్రామంలో వ్యవసాయేతర పనులు చేపడుతున్నారు.
- రాంపురంలో పని కోసం వ్యవసాయ కూలీల మధ్య తీవ్ర పోటీ ఉంది. కాబట్టి తక్కువ కూలీకైనా పనిచేయడానికి వారు సిద్ధపడతారు.
- పెద్ద రైతులు ట్రాక్టర్లు, మార్పిడి యంత్రాలు, పంటకోత యంత్రాలపై ఆధారపడడం వల్ల గ్రామీణ ప్రాంతంలో కూలీలకు లభించే పనిదినాలు తగ్గిపోతున్నాయి.
- శ్రామికుల సంఖ్య తగ్గితే పై పరిస్ధితులలో మార్పులు వచ్చి వారికి తగిన పని కూలీ లభ్యమవుతుంది.
5) పట్టణ ప్రాంతాలలో వస్తువుల ఉత్పత్తికి కూడా భూమి అవసరం. గ్రామీణ ప్రాంతంలో భూవినియోగానికి, దీనికి తేడా ఏమిటి?
జ:
- వ్యవసాయ ఉత్పత్తికి భూమి చాలా కీలకమైనది. దీని కోసం అడవులు, ఊళ్లోని ‘బంజర’ భూములను వ్యవసాయ భూములుగా మార్చేశారు.
- మరింత భూమిని కొత్తగా సాగు కిందకు తీసుకుని రావడం వల్ల వ్యవసాయ ఉత్పత్తి పెంపొందుతుంది.
- ఒకే విస్తీర్ణంలో సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను సాగుచేయడం, విద్యుత్తుతో నడిచే బోరుబావుల ద్వారా ఎక్కువ విస్తీర్ణంనకు సాగు నీరు అందించడం మొదలైన చర్యల ద్వారా వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంది.
- పట్టణ ప్రాంతాల్లో వస్తువుల ఉత్పత్తికి కూడా భూమి అవసరం కానీ ఇది గ్రామీణ ప్రాంత అవసరాలకు భిన్నంగా వుంది. పరిశ్రమ స్థాపనకు, రవాణా కోసం భూమి అవసరమవుతుంది.
- పరిశ్రమలకు కావలసిన ముడిసరుకులు తీసుకుని రావటానికి, తయారైన వస్తువులను మార్కెట్లకు తరలించడానికి రవాణా తప్పని సరి.
- భారీ పరిశ్రమలకు వేలాది ఎకరాలలో భూమి అవసరమవుతుంది. పారిశ్రామిక ‘సెజ్’లపేర ప్రభుత్వాలు కొన్ని ప్రాంతాలను పరిశ్రమల అభివృద్ధికి కేటాయించి వాటి అభివృద్ధికి కృషి చేస్తుంది.
1) భారతదేశంలోని ప్రతి గ్రామాన్ని ప్రతి పదేళ్లకు ఒక సారి జనాభా గణనలో సర్వే చేసి కింద ఇచ్చిన విధంగా వివరాలను పొందుపరుస్తారు. రాంపురానికి సంబంధించిన సమాచారం ఆధారంగా కింది వివరాలు నింపండి.
అ. ఎక్కడ ఉం ది( ఉనికి): రాంపురం ( ఉత్తరప్రదేశ్)
ఆ. గ్రామ మొత్తం విస్తీర్ణం: 270 హెక్టార్లు
ఇ. భూవినియోగం హెక్టార్లల్లో: 264 హెక్టార్లు
సాగులో ఉన్న భూమి
|
సాగుకు అందుబాటులో లేని భూమి | |
సాగు కింద నీటి సదుపాయం గల | సాగు నీరు లేకుండా | ఇళ్లు, రోడ్లు, చెరువులు, పశువుల బీడు ఉన్న ప్రాంతాలు |
200 | 38 | 26హెక్టార్లు |
ఈ. సౌకర్యాలు: | ||
విద్య | 23హైస్కూళ్లు, రెండు ప్రాథమిక పాఠశాలలు | |
వైద్యం | ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఒక ప్రైవేటు ఆసుపత్రి | |
మార్కెట్టు | చిన్న కూరగాయల మార్కెట్ పెద్ద మార్కెటు రాయిగండ్‌లో ఉంది | |
విద్యుత్ సరఫరా | పూర్తిగా విద్యుతీకరణ ఉంది | |
{పసార సాధనాలు | తంతి, తపాలా కార్యాలయం టెలిఫోన్ కార్యాలయం రవాణా సదుపాయాలు కలవు | |
సమీప పట్టణం | జహాంఘీరాబాద్ కలదు |
2) రాంపురంలోని వ్యవసాయ కూలీలకు కనీస కూలీ కంటే తక్కువ కూలీ ఎందుకు లభిస్తోంది?
జ:
- రాంపురంలో రోజు వారీ కూలీలకు భూమి లేదు. పనికోసం వ్యవసాయ కూలీలు ప్రతి రోజూ పని కోసం వెతుక్కోవాలి.
- వ్యవసాయ కూలీలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం కంటే తక్కువ కూలీ దొరుకుతోంది.
- రాంపురంలో పనికోసం వ్యవసాయ కూలీల మధ్య తీవ్ర పోటీ ఉంది. కాబట్టి తక్కువ కూలీకైనా పని చేయడానికి ప్రజలు సిద్ధపడతారు.
- పెద్ద రైతులు ట్రాక్టర్లు, మార్పిడి యంత్రాలు, పంటకోత యంత్రాలపై ఆధారపడడం పెరగడంతో గ్రామీణ ప్రాంతాలలో కూలీలకు లభించే పనిదినాలు తగ్గిపోతున్నాయి.
- గత సంవత్సరం మొత్తంలో వ్యవసాయ కూలీలకు పని ఐదు నెలలు మాత్రమే దొరికింది.
జ:
- రామయ్య, వ్యవసాయ కూలీతో మాట్లాడినప్పుడు తనకు రూ. 200 రోజు కూలీ లభిస్తుందని, దానిని నగదు రూపంలో చెల్లిస్తున్నారని సంవత్సరంలో కేవలం ఆరు నెలల పాటు మాత్రమే వ్యవసాయ పనులు వుండడం వల్ల పూర్తి కాలం పని లభించదని, కుటుంబ ఖర్చుల నిమిత్తం తాను అప్పులు చేయాల్సి వస్తోందని తెలిపాడు.
- నర్సింహులు, భవన నిర్మాణంలో పని చేయు కార్మికుడు. ఇతనితో మాట్లాడినప్పుడు తనకు రూ.250 రోజు వారి కూలీగా వస్తుందని, సంవత్సరంలో 10 నెలల పాటు పని లభ్యత వుందని, కుటుంబ ఖర్చుల కోసం తరచుగా అప్పు చేయాల్సి వస్తోందని తెలిపాడు.
జ:
- సవిత ఒక చిన్న రైతు. ఆమె దగ్గర డబ్బులేకపోవడం వల్ల తేజ్‌పాల్ అనే పెద్ద రైతు దగ్గర నాలుగు నెలల్లో తిరిగి ఇవ్వాలన్న షరతు మీద ఎక్కువ వడ్డీకి(36%) రూ.6000 అప్పుగా పొందింది.
- సవిత కోత సమయంలో రోజుకు వంద రూపాయల కూలీకి తేజ్‌పాల్ పొలంలో పని చేయడానికి అంగీకరించాల్సి వచ్చింది.
- అదే వ్యవసాయ రుణం బ్యాంకుల నుంచి లభిస్తే సవితకు వడ్డీ చాలా స్వల్పంగా (10%) నకు రూ.6000 అప్పుగా అభించేది. తక్కువ కూలీ రేటుకు కోతల సమయంలో పని ఒత్తిడితో తేజ్‌పాల్ పొలంలో పని చేయాల్సిన అవసరం వుండేది కాదు.
జ:
- భారతదేశంలోని అన్ని గ్రామాలకు తగిన సాగునీటి సదుపాయం లేదు. వివిధ ప్రాంతాలలో వ్యవసాయం ప్రధానంగా వర్షాధారంగా ఉంది.
- దేశంలోని నది మైదానాలు, కోస్తా ప్రాంతాలలో మాత్రమే సాగునీటి సదుపాయాలు బాగున్నాయి. దక్కన్ పీఠ భూమి వంటి ప్రాంతాల్లో సాగునీటి సదుపాయాలు తక్కువ.
- భూమి, నీరు వంటి సహజ వనరులను అధికంగా ఉపయోగించడం వల్ల దిగుబడులు, ఉత్పత్తి పెరిగాయి.
- సాగునీటికై ప్రధానంగా భూగర్భ జలాల మీద ఆధారపడి వుండడం వల్ల దేశ వ్యాప్తంగా భూగర్భ జల మట్టాలు గణనీయంగా పడిపోతున్నాయి.
- సాగునీటికి డీజిల్, విద్యుత్తు వినియోగం కూడా పెరిగింది.
6) గోసాయిపూర్, మజాలి అనేవి ఉత్తర బీహార్‌లోని రెండు గ్రామాలు. రెండు గ్రామాలలోని 850 కుటుంబాల నుంచి 250 కంటే ఎక్కువ మగవాళ్లు పంజాబ్, హర్యానా గ్రామీణ ప్రాంతాలలో, ఢిల్లీ, ముంబై, సూరత్, హైదరాబాద్, నాగపూర్ వంటి నగరాలలో పనిచేస్తున్నారు. గోసాయిపూర్, మజాలి గ్రామాల నుంచి వలస వెళ్లిన వాళ్లు ఆయా ప్రాంతాలలో ఏ పని చేస్తారో రాయండి.
జ: సాధారణంగా గ్రామ ప్రాంతాల నుంచి ఎక్కువగా మగవాళ్లు నగరాలకు పనికోసం వలస పోతుంటారు. గ్రామీణ ప్రాంతంలో కేవలం పరిమిత కాలంలో మాత్రమే వ్యవసాయ పనులు లభ్యం అవుతాయి. ఉపాధి కోసం శ్రామికులు సమీప నగరాలకు ఎక్కువగా వలస పోతారు. వారు అక్కడ భవన నిర్మాణ కార్మికులుగా, చిన్న వర్తకులుగా పనిని పొందుతుంటారు.
7) ఉత్పత్తి ప్రక్రియలో ‘‘భూమి’’ అన్న దానిని అర్థం మరొకసారి చదవండి. వ్యవసాయం కాకుండా ఇతర ఉత్పత్తి ప్రక్రియలె భూమి ముఖ్యమైన అవసరంగా ఉన్న మరొక మూడు ఉదాహరణలు ఇవ్వండి.
జ:
- ప్రజలకు అవసరమైన వస్తువులు, సేవలను అందించడమే ఉత్పత్తి ఉద్దేశం.
- వస్తూత్పత్తికి మొదటిగా భూమి, నీళ్లు, అడవులు, ఖనిజాలు వంటి సహజ వనరులు కావాలి.
- ఉత్పత్తి పెంచడంతో భూమి మీద సహజ వనరులపై ఒత్తిడి పెరిగింది. ఉత్పత్తి పద్ధతులను సమీక్షించి వనరులను సుస్థిర విధానంలో ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- మార్కెట్ల నిర్మాణం కోసం, రోడ్లు, రవాణా మొదలైన మౌలిక సదుపాయాల కల్పనకు ఉత్పత్తి తప్పని సరి. వీటి కోసం పట్టణ ప్రాంతంలో అవసరం ఏర్పడుతుంది.
జ:
- విద్యుత్ శక్తితో నడిచే బోరు బావుల ద్వారా తేలికగా ఎక్కువ విస్తీర్ణానికి సాగునీటిని అందించవచ్చు.
- భారతదేశంలో అన్ని గ్రామాలకు సాగునీటి సదుపాయం లేదు. సాగు నీటి విస్తీర్ణంలో 40 శాతం కంటే తక్కువ విస్తీర్ణానికి సాగు నీటి సదుపాయం ఉంది.
- భారతదేశం అంతటా సాగునీటికి ముఖ్యంగా భూగర్భ జలాల మీదే ఆధారపడి ఉన్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా భూగర్భజలాలు గణనీయంగా పడిపోతున్నాయి.
- సాగునీటికై రైతులు డీజిలు, విద్యుత్తు కై ఎక్కువగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది.
Tags
- AP 10th
- AP 10th Study Material
- AP 10th Social
- UttarPradesh
- sakshi education study materials
- ap10th class social study materials
- ap10th study materials pdfs
- ap10th class study materials
- 10th class social study materials
- 10th class study materials
- 10th class stuy materials pdfs
- Rampur: Village Economy