Skip to main content

ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం (1900-1950: భాగము-2)

10th class study materialముఖ్యాంశాలు:

  • రష్యాలో 1917లో సోషలిస్టు విప్లవం సంభవించింది.
  • జార్‌ల పరిపాలనలో రష్యా రెండు ఖండాలలో విస్తరించి యూరో ఆసియా శక్తిగా విశాల సామ్రాజ్యంగా ఉండేది. జనాభాలో మూడవ అతిపెద్ద దేశం.
  • మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ప్రపంచంలో కెల్లా అతిపెద్ద సైన్యం రష్యాకు ఉండేది. కాని యుద్ధం తర్వాత దాని శక్తి తగ్గిపోయుంది.
  • యుదా్ధల వల్ల రష్యా ఆర్థిక పరిస్థితి చిన్నా భిన్నమై ఆహార పదార్థాల కొరత ఏర్పడింది.
  • 1917 మార్చి 8న సెయుంట్ పీటర్స్ బర్గ్ నగరంలో మహిళలు నిరసన చేపట్టి 'రొట్టె, శాంతి' కావాలని కోరారు.
  • జార్ నికోసస్-2 దేశం వదిలిపెట్టి పారిపోయాడు. ఇది 1917 లో ఫిబ్రవరి (మార్చి) లో జరిగింది.
  • తర్వాత 1917 అక్టోబర్ (నవంబర్)లో మరొక విప్లవం జరిగింది.
  • ఈ విప్లవానికి నాయకత్వం వహించిన వ్యక్తి లెనిన్. ఈయన బోల్షవిక్కుల నాయకుడు.
  • 1924 లో లెనిన్ చని పోయున తర్వాత స్టాలిన్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు అయ్యాడు.
  • ఇతని కాలంలో 1928 నుండి పంచ వర్ష ప్రణాళికలు ప్రారంభమయ్యాయి.
  • గ్రామీణ ప్రాంతాలలో 'ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాలు' ఏర్పాటు చేయ రైతులందరు అందులో పనిచేసి ఉత్పత్తిని సభ్యులు పంచుకునేవారు.
  • ప్రరిశ్రమలు అన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉండేవి. స్వేచ్ఛా మార్కేట్‌కు అనుమతిలేదు.
  • కార్మికులు, రైతులు, మహిళల సంక్షేమం కోసం, వారి విద్యా వాప్తికి చర్యలు చేపట్టారు.
  • రష్యా తన పౌరులందరికి ఉపాధి కల్పించి వాళ్ళ జీవన ప్రమాణాలను గణనీయంగా పెంచగలగింది.
  • ప్రపంచమంతా 'తీవ్ర ఆర్థి మాంద్యం' ఎదుర్కొంటే రష్యా మాత్రం దీని ప్రభావానికి గురి కాలేదు.
  • కాని రష్యాలో పౌరులకు సాధారణ ప్రజాస్వామిక స్వేచ్ఛ కూడ లేదు. వ్యతిరేకతను అణిచివేసి ప్రతిపక్ష నాయకులను పెద్ద సంఖ్యలో చంపేశారు.
  • జార్జ్ ఆర్వెల్ అన్న రచయుత 'యనిమల్‌ఫాం' అనే నవలలో విప్లవ కాలంలోని ఆదర్శాలను రష్యా ఏవిధంగా నీరు కార్చిందో తెలిపాడు.
  • ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆర్థిక మాంద్యము 1929లో మొదలయు దాదాపు రెండో ప్రపంచ యుద్ధము మొదలయ్యే వరకు అంటే 1939 వరకు కొనసాగింది. ఇది ప్రపంచంలోని అన్ని దేశాలను కుదిపివేసింది.
  • దీనిని ఎదుర్కోవడానికి అప్పటి అమెరికా అధ్యక్షుడు రూజ్‌విల్ట్ కొత్త ఒప్పందాన్ని (New deal) ను ప్రకటించాడు.
  • ఆర్థిక మాంద్యం వల్ల అన్నింటి కంటే ఎక్కువగా జర్మనీ ప్రభావితం అయుంది.
  • జర్మనీ వీధులలో పురుషులు 'ఏ పని చేయడానికైన సిద్దం అన్న బోర్డు' (కార్డు) మెడలో తగిలించుకొని కనబడేవాళ్ళు.
  • ఇటువంటి పరిస్థితుల్లో హిట ్లర్ నాజీపార్టీని స్థాపించి ప్రజలను ఆకట్టుకున్నాడు. 1937 నాటికి జర్మనీ పార్లమెంట్ రీచ్‌స్టాగ్ లో నాజీపార్టీ అతి పెద్ద పార్గీగా అవతరించింది.
  • కమ్యూనిజం, పెట్టుబడి దారీ విధానం రెండింటినీ హిట్లర్ వ్యతిరేకించాడు.
  • ఇతడు ప్రజాస్యామ్యానికి కూడా వ్యతిరేకించి నియంత పాలనను ఏర్పరిచాడు.
  • 1933 మార్చి 3న ఆమోదం పొందిన ఎనేబ్లింగ్ యాక్ట్ తో జర్మనీలో నియంతృత్వం ఏర్పడింది.
  • నియంతృత్వ అధికారాలను ఉపయోగించుకొని లక్షలాది రాజకీయ ఉద్యమ కారులను, కార్మిక సంఘ నాయకులను, అల్ప సంఖ్యాక వర్గ ప్రజ లను అరెస్టు చేసి, హింసించి కొంత మందిని చంపేశారు.
  • ఆర్థిక రంగంలో పూర్తి ఉపాధి, పూర్తి ఉత్పత్తి అన్న లక్ష్యాలను పెట్టుకున్నారు. దీని ద్వారా వాహనాల ఉత్పత్తి సంస్థలు ఆయుధ కర్మాగారాలను స్థాపించారు.
  • యుద్ధం జరిగితే తప్ప ఆయుధ ఫ్యాక్టరీలు నడిచే పరిస్థితి లేదు. అందువల్ల ఇతర దేశాలపై దాడి చేసే ప్రయత్నాలు హిట ్లర్ చేశాడు.
  • 1939 సెప్టెంబర్ 1న పోలండ్ పై దాడి చేయటంతో రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది.
  • ఈ యుద్ధంలో జర్మనీ మానవ మారణ హోమాన్ని చేపట్టింది. లక్షలాది మందిని హతమార్చింది.
  • జర్మన్ సైన్యాలు తొలుత విజయాలు సాధించినా 1943లో స్టాలిన్ గ్రాడ్ యుద్ధంలో ఓటమితో జర్మనీ పరాజయం మొదలైంది.
  • సోవియట్ సైన్యం బెర్లిన్ ను ఆక్రమించి కోవటంతో హిట్లర్, అతని మిత్రులు ఆత్మహత్య చేసుకున్నారు.
  • జర్మనీ రెండుగా చీలి తూర్పు జర్మనీలో గణతంత్ర ప్రజాస్వామ్యం (German democratic republic) గా ఏర్పడి USSR ప్రభావం కిందికి వచ్చింది. పశ్చిమ జర్మనీలో గణతంత్ర సమాఖ్య (Federal republic of germany) ఏర్పడి అమెరికా ప్రభావం కిందికి వచ్చింది.
  • ఆసియాదేశమైన జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై 1942 అగస్టులో అమెరికా అణుబాంబులు ప్రయోగించింది.
  • దీంతో జపాన్ కూడ లొంగిపోయుంది. అమెరికా సైన్యాలు జపాన్‌ను అక్రమించికొని రాజ్యాంగ బద్ద రాచరిక పాలనను ఏర్పరిచారు.
  • ఈ విధంగా 20వ శతాబ్దంలో మొదటి సగ భాగం హిరోషిమా, నాగసాకిలపై జరిగిన భయంకర అణుబాంబులతోను, ఐక్యరాజ్య సమితి ఏర్పాటుతో తలెత్తిన ఆశలతోను ముగిసింది.
  • యుద్ధం తర్వాత యూరప్ దేశాల వలస రాజ్యాలు అంతమై 1950 నాటికి భారతదేశం, చైనా, ఇండోనేషియా, వియత్నాం, ఈజిప్టు, నైజీరియా వంటి దేశాలు స్వాతంత్య్రం పొందాయు.
  • బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలు వాటి శక్తిని కోల్పోయాయి. ప్రపంచ రంగం మీద రెండు కొత్త అగ్ర రాజ్యాలు ఆవిర్భవించాయు. అవి రష్యా, అమెరికా.

4మార్కుల ప్రశ్నలు- (విషయావగాహన)
1. రష్యన్ విప్లవం ఆ సమాజంలో ఎన్నో మార్పులను తెచ్చింది. అవి ఏమిటి? వాళ్ళు ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి ?

జ. 1917లో వచ్చిన రష్యన్ విప్లవం ఆ సమాజంలో ఎన్నో మార్పులను తెచ్చింది. వాటిని క్రింది విధంగా పేర్కొనవచ్చు.

  1. రష్యాలో జార్ చక్రవర్తుల పాలన అంతమై ఉదారవాదుల, రాచరిక కుటుంబాల పాలన మొదలైంది.
  2. లెనిన్ నాయకత్వంలో బోల్షవిక్‌లు అనేక మార్పులను తీసుకువచ్చారు.
  3. భూమి అంతటిని జాతీయం చేసి దానిని రైతులకు పంచిపెట్టడం, ధరలను నియంత్రించడం, కర్మాగారాలు, బ్యాంకులను జాతీయం చేయడం వంటి చర్యలు చేపట్టారు.
  4. 1924లో అధికారంలోకి వచ్చిన స్టాలిన్ 1928లో పంచవర్ష ప్రణాళికలను ప్రవేశ పెట్టి ప్రణాళికా బద్ద ఆర్థిక అభివృద్ధిని సాధించాడు.

ఎదుర్కొన్న సవాళ్ళు:

  1. భూముల జాతీయీకరణ సందర్భంగా పెద్ద భూస్వాములు వ్యతిరేకించగా హింస, మరణ శిక్షలు అమలు చేశారు.
  2. 1929-30 లో తీవ్ర కరువు సంభవించి చాలా మంది చనిపోయారు.
  3. వేగవంతమైన నిర్మాణాల వల్ల కార్మికుల జీవన పరిస్థితులు చాలా కష్టంగా ఉండేవి.
  4. పౌరులకు సాధాణ ప్రజాస్వామిక స్వేచ్ఛ లేకుండా పోయుంది.

2. తీవ్ర మాంద్యముతో జర్మనీ ఎరుర్కొన్న సవాళ్ళు ఏమిటి ? నాజీ పాలకులు, హిట్లర్ వాటిని ఎలా ఉపయోగించుకున్నారు?
జ: 1929లో ఏర్పడిన తీవ్ర ఆర్థిక మాంద్యము వల్ల అన్ని దేశాలు కంటే ఎక్కువగా జర్మనీ ప్రభావితం అయుంది.
జర్మనీ ఎదుర్కొన్న సవాళ్ళు:

  1. పారిశ్రామిక ఉత్పత్తి 40 శాతానికి పడిపోయుంది.
  2. అనేక మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. కొంత మంది వేతనాలు తగ్గాయు.
  3. నిరుద్యోగుల సంఖ్య 60 లక్షలకు చేరుకుంది.
  4. పురుషులు వీధులలో, ఏ పని చేయడానికైనా సిధ్ధం అని రాసి ఉన్న కార్డులు మెడలో వేసుకొని కనబడేవాళ్ళు.
  5. నిరుద్యోగులు పేకాట ఆడటం, నేరాలకు పాల్పడటం లాంటి దురలవాట్లకు గురయ్యారు.
  6. కరెన్సీ విలువ కోల్పోవడంతో మధ్య తరగతి ప్రజలు, చిన్న వ్యాపారులు కష్టాలకు లోనయ్యారు.
  7. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోవడం వల్ల రైతులు నష్టపోయారు.
  8. రాజకీయ అస్థిరత్వంతో ప్రభుత్వాలు కూలిపోయాయు.

ఈ పరిస్థితులను హిట్లర్ ఉపమోగించుకున్నతీరు:

  1. పై పరిస్థితులను హిట్లర్, నాజీ పాలకులు తమకు అనుకూలంగా మలుచుకొని తమ ఉద్వేగ ప్రసంగాల ద్వారా ప్రజలను ఆకట్టుకున్నారు.
  2. ఒక బలమైన దేశాన్ని నిర్మిస్తానని, వర్సయుల్స్ ఒప్పందపు అన్యాయాన్ని రద్దుచేస్తానని, జర్మనీ ప్రజల గౌరవన్ని నిలబెడతానని హిట ్లర్ చెప్పాడు.
  3. యువతకు పని కల్పించి వారికి బంగారు భవిషష్యత్తును అందిస్తానని చెప్పాడు.
  4. బహిరంగ సభల ద్వారా ఉద్వేగ ప్రసంగాల తో ప్రజలను ఆకట్టుకొని జర్మనీలో హిట్లర్ అధికారంలోకి వచ్చాడు.

3. రష్యాలో స్టాలిన్ అధికారంలోకి వచ్చాక చేపట్టిన చర్యలను, వాటి ప్రతి చర్యలను పేర్కొనుము.
జ:
1924 లో లెనిన్ చనిపోయున తర్వాత స్టాలిన్ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు అయ్యాడు. అతని అధికారంలో ఉండగా రష్యాలో ఈ క్రింది చర్యలు చేపట్టాడు.

  1. రష్యాపై స్టాలిన్ పూర్తి నియంత్రణను సాధించి ఎవరూ శాసించటానికి వీలులేని అధికారంతో రష్యాను ఒక బలమైన ఆర్థిక శక్తిగా మలిచాడు.
  2. 1928లో పంచవర్ష ప్రణాళికలను ప్రవేశ పెట్టి ప్రణాళికా బద్ద ఆర్థిక అభివృద్ధిని చేపట్టారు.
  3. చిన్న, పెద్ద రైతులు తమ భూములను వదిలేసి ఉమ్మడి క్షేత్రాలలో చేరేలా చర్యలు తీసుకున్నారు.
  4. ఈ క్షేత్రాలు గ్రామంలో భూములు, పరికరాలు, యంత్రాలు, పశువులను ఉమ్మడి సొత్తుగా చేశాయు.
  5. అందరు కలిసి వ్యవసాయం చేసి ఉత్పత్తులను పంచుకున్నారు.
  6. పరిశ్రమలు అన్ని ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చి పారిశ్రామికీకరణ వేగవంతమైంది.
  7. స్వేచ్ఛా మార్కెట్‌కు అనుమతించకుండా పారిశ్రామిక ఉత్పతులను నేరుగా వినియోగదారులకు అమ్మేవాళ్ళు.

ప్రతిచర్యలు

  1. ఉమ్మడి క్షేత్రాల ఏర్పాటును పెద్ద రైతులు వ్యతిరేకించడంతో వారిని జైలుపాలు చేశారు, విదేశాలకు పంపించారు, మరణశిక్ష విధించారు.
  2. 1929-30లో తీవ్ర కరువు ఏర్పడి పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోయారు.
  3. కార్మికులు జీవన పరిస్థితులు చాలా కష్టంగా ఉండేవి.
  4. పౌరులకు సాధారణ ప్రజాస్వామిక స్వేచ్ఛ లేకుండా పోయుంది. ప్రతిపక్ష నాయకులను పెద్ద సంఖ్యలో చంపేశారు.
ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించటం

(4 మార్కులు ప్రశ్నలు )
క్రింది అంశాన్ని చదివి నీ అభిప్రాయాన్ని తెలియజేయుము.


‘మహిళా కార్మికులు తరచు తమతోటి పురుష కార్మికులకు స్ఫూర్తిని ఇచ్చేవాళ్ళు. లోరెంజ్ టెలిఫోన్ కర్మాగారంలో మార్ఫా వాసి లేవా ఒంటరిగా విజయవంతమైన సమ్మెకు పిలుపునిచ్చింది. ఆ రోజు ఉదయం మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కార్మికులు పురుషులకు ఎర్రమెడ పట్టిలను బహుమతిగా ఇచ్చారు. ఆ సమయంలో మిల్లింగ్ యంత్ర నిర్వహకురాలైన మార్ఫా వాసిలేవా పని అపేసి అప్పటికప్పుడు సమ్మెకు పిలుపునిచ్చింది. అక్కడ ఉన్న కార్మికులు ఆమెకు మద్ధతు ఇచ్చారు. ఫోర్‌మెన్ ఆ విషయాన్ని యాజమాన్యానికి తెలియజేసి ఆమెకు పూర్తి రొట్టెను పంపించాడు. ఆమె రొట్టె తీసుకుంది కాని పని తిరిగి ప్రారంభించలేదు. పని ఎందుకు చేయటం లేదని ఫోర్‌మెన్ అడిగితే మిగిలిన వారు అందరు ఆకలితో వుంటే నేను ఒక దానినే ఎలా నింపుకుంటాను అని ఆమె బదులిచ్చింది. కర్మాగారంలోని ఇతర విభాగాలలోని మహిళలు మర్ఫాకి మద్ధతుగా ఆమె చుట్టూ చేరారు. క్రమేపీ మహిళలందరూ పని ఆపేశారు. ఆ తరువాత పురుషులు కూడా తమ పరికరాలు వదిలేసి సమ్మెకి దిగారు. అందరూ బజారులోకి పరుగులు తీశారు.’
జ.
  1. రష్యాలో 1917 ఫిబ్రవరి నెలలో (ప్రపంచ క్యాలెండర్ ప్రకారం మార్చి నెల) తొలి విప్లవం జరిగింది.
  2. ఈ విప్లవంలో మహిళలు చురుకైన పాత్ర నిర్వహించారనడానికి ఇచ్చిన సంఘటన అద్దం పడుతుంది.
  3. ప్రపంచ యద్ధం వల్ల ప్రజలకు ఆహార పదార్థాలు కూడా దొరకటం కష్టమైపోయుంది.
  4. ఈ పరిస్థితుల్లో మహిళలు, పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు.
  5. పని చేసే ప్రదేశాలలో మహిళలకు సరియైన వసతులు లేకుండా పోయాయు కడుపునిండా తిండిలేని పరిస్థితి.
  6. ఈ పరిస్థిలో లోరెంజ్‌లోని ఒక టెలిఫోన్ కర్మాగారంలో మార్ఫావాసిలేవా ఒంటరిగా విజయవంతమైన సమ్మెకు పిలుపునిచ్చింది.
  7. ఆకలితో మేం పని చేయలేమని ఆమె పని అపేసి అప్పటికప్పుడు సమ్మెకు దిగింది.
  8. ఫోర్‌మెన్ ఆమెకు పూర్తి రొట్టెను పంపించి ఆమెను శాంతిప చేయడానికి ప్రయత్నించాడు. కాని ఆమె తనకు మాత్రమే కడుపు నిండితే సరిపోదని తోటి కార్మికులందరి ఆకలి తీర్చాలని పట్టుబట్టింది.
  9. క్రమంగా మహిళలందరూ ఆమెకు మద్దతుగా పని వదిలేసి సమ్మెకు దిగారు.
  10. తర్వాత పురుష కార్మికులు కూడా సమ్మెకు దిగి అందరూ బజారులోకి పరుగు తీశారు. క్రమంగా ఇది దేశవ్యాప్తమై ఉధృతంగా కొనసాగింది.
4మార్కుల ప్రశ్నలు
-సమాచార నైపుణ్యాలు

1. క్రింది కాల పట్టికను చదివి ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులివ్వండి.
సంఘటన సంవత్సరం
రష్యాలో సోషలిజం పై చర్చలు 1850-1880
రష్యాలో సోషల్ ప్రజా స్వామిక కార్మికుల పార్టీ ఏర్పాటు 1898
రక్త సిక్త ఆదివారం విప్లవం 1905
మార్చి 2- జార్ చక్రవర్తి పరారి అక్టోబర్ 24- పెట్రోగ్రాడ్‌లో బోల్షవిక్కుల తిరుగు బాటు 1917
పౌర యుద్ధం 1918-20
కొమిన్‌టర్న్ ఏర్పాటు 1919
భూముల ఏకీకరణ ప్రారంభం 1929
  1. రష్యాలో 1905 సంవత్సరంలో జరిగిన విప్లవం లో రక్తసిక్తమైన రోజు ఏది?
  2. రష్యాలో పౌర యుద్ధం జరిగిన కాలం ఏది?
  3. భూముల ఏకీకరణను ప్రారంభించిన కాలం నాటి రష్యా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఎవరు?
  4. 1917 అక్టోబర్ విప్లవానికి నాయకత్వం వహించిన వర్గం ఏది?
జ: (1) ఆదివారము
(2) 1918-20
(3) స్టాలిన్
(4) బోల్షవికు్కలు
2: క్రింది కాల పట్టికను గమనించి ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబు వ్రాయుము.
సంఘటన తేది
వైమర్ గణతంత్ర రాజ్యంగా ప్రకటన నవంబర్ 9, 1918
హిట్లర్ జర్మనీకి చాన్స్‌లర్ కావడం జనవరి 30, 1933
 
పోలండ్‌పై జర్మనీ దండెత్తడం, రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం సెప్టెంబర్ 1, 1939
యు.ఎస్.ఎస్.ఆర్ పై జర్మనీ దండెత్తడం జున్ 22, 1941
యూదులపై సామూహిక హత్యాకాండ జున్ 23, 1941
 
అమెరికా సంయుక్త రాష్ట్రాలు రెండో ప్రపంచ యుద్ధంలో చేరడం డిసెండర్ 8, 1941
సోవియట్ సేనలు ఔష్‌విడ్జ్‌కు విముక్తి కల్పించడం జనవరి 27, 1945
యూరప్‌లో కూటమిగా సాధించిన విజయం మే 8, 1945
  1. ఏ సంఘటనతో రెండో ప్రపంచ యుద్ధం మెదలైంది?
  2. జున్ 22,1941 న జర్మనీ ఏ దేశంపై దండెత్తింది.?
  3. వైమర్ గ ణతంత్ర రాజ్యంగా ప్రకటించిన రోజు ఏది?
  4. హిట్లర్ జర్మనీకి చాన్స్‌లర్ అయున ఎన్ని సంవత్సరాలకు ఆత్మహత్య చేసుకున్నాడు?
జ: (1) సెప్టెంబర్ 1, 1939న పోలండ్ పై జర్మనీ దండెత్తడం
(2) యు.ఎస్.ఎస్.ఆర్
(3) నవంబర్ 9, 1918
(4) 12 సంవత్సరాలకు

4మార్కుల ప్రశ్నలు
-పటనైపుణ్యాలు
1. ప్రపంచ పటములో క్రింది వాటిని గుర్తించుము.
అ: 1. రష్యా 2. జర్మనీ 3. పోలండ్ 4. అమెరికా సంయుక్త రాష్ట్రాలు
ఆ: 1. జపాన్ 2. సెయుంట్ పీటర్స్ బర్గ్ 3. మాస్కొ 4. బెర్లిన్

4.మార్కుల ప్రశ్నలు
- సమాకాలీన అంశాలపై ప్రతిస్పందన -ప్రశ్నించడం.
1. నాజీ జర్మనీల చేతిలో యూదులు ఏవిధమైన వేధింపులకు గురయ్యారు? ప్రతి దేశంలోను కొంతమందిని తమ పత్యేక గుర్తింపు కారణంగా వేరుగా చూస్తున్నారా?
జ:
1933 మార్చి 3న ఆమోదం పొందిన ఎనేబి్లంగ్ యాక్ట్ తో జర్మనీలో నియంతృత్వం ఏర్పడింది. దీని ద్వారా హిట్లర్ నియంతగా మారి నాజీపార్టీ తప్ప మిగిలిన పార్టీలు, కార్మిక సంఘాలను నిషేధించారు. ముఖ్యంగా యూదులను తీవ్రంగా వేధించారు.
  1. అల్ప సంఖ్యాకులైన యూదులను ఎటువంటి కారణం లేకుండానే అరెస్టు చేసి హింసించారు.
  2. నిర్బంధ శిబిరాలకు తరలించి విచక్షణారహితంగా హింసించారు.
  3. కొంత మందిని దేశం నుంచి బహిష్కరించారు.
  4. రెండో ప్రపంచ యుద్ధకాలంలో దాదాపు 6 కోట్ల మంది యూదులను నిర్దాక్షిణ్యంగా చంపించారు.
  5. ఆష్విట్జ్ వంటి హత్యా కేంద్రాలలో యూదులను గదులలోకి పంపి దాంట్లోకి గ్యాస్ పంపి చంపేసే వాళ్ళు.

సమకాలీన దృక్కోణం

  1. ఈ నాటి ప్రపంచంలో ఇలాంటి సంఘటనలు చాలా వరకు తగ్గాయు.
  2. ఇంతటి ఘోరమైన చర్యలు కానరావు.
  3. అయుతే కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా దక్షిణాపుకలో నల్ల జాతీయులపైన అమెరికాలో నీగ్రోలపైన వివక్షాపురిత దాడులు జరుగుతున్నాయు
  4. అఘ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు శత్రు దేశలవారిని పట్టుకొని నిర్దాక్షిణ్యంగా హింసించి చంపుతన్న సంఘటనలు జరుగుతున్నాయు.

2. నాజీ పాలనలో తీసుకొచ్చిన రాజకీయ మార్పులు ఏమిటి? ఒక బలమైన నాయకుడు ఉంటే చాలు దేశ సమస్యలు తీరి పోతాయని తరచు ప్రజలు వాదిస్తూ ఉంటారు. నాజీకి జర్మనీలో ఎదురైన అనుభవాల నేపధ్యంలో ఈ వాదనకు ఎలా స్పందిస్తారు?
జ.
నాజీ పాలనలో తీసుకొచ్చిన రాజకీయ మార్పులు

  1. రాజకీయాలలో ఒక కొత్తశైలిని హిట్లర్ ప్రవేశపెట్టాడు.
  2. పెద్ద ఎత్తున జన సమీకరణం చేయటంతో ఆచారాలు, అద్భుత దృశ్యాల ప్రాముఖ్యతను అతడు గుర్తించాడు.
  3. అతనికి ఉన్న మద్దతు తెలియ చెయ్యటానికి, ప్రజల మధ్య ఐకమత్యాన్ని పెంపొందించటానికి నాజీలు పెద్ద బహిరంగ సభలను ప్రదర్శనలను నిర్వహించ సాగారు.
  4. స్వస్తిక్ గుర్తుతో ఎర్ర జెండాలు, నాజివందనం, ఉపన్యాసాల తర్వాత చప్పట్లు కొట్టడం వంటి మార్పులు తీసుకొచ్చారు.
  5. కమ్యూనిజం పెట్టుబడి దారి విధానం రెంటింటినీ యూదుల కుట్రగా పెర్కొంటూ హిట్లర్ ప్రజల దృష్టిని ఆకర్షించాడు.

ఈ విధంగా జర్మనీలు నాజీల నాయకుడుగా హిట్లర్ ఎదురులేని నాయకునిగా ఎదిగాడు.
ప్రతిస్పందన

  1. ఒక బలమైన నాయకుడు ఉంటే చాలు దేశ సమస్యలు తీరిపోతాయని తరచు ప్రజలు వాదిస్తూ ఉంటారు.
  2. నాజీ జర్మనీ విషయలలో ఇది ప్రారంభంలో విజయవంతమైనా తర్వాత హిట్లర్ యొక్క అహంకారంతో అది విఫలమైంది.
  3. బలమైన నాయకుడు ఉన్నంత మాత్రాన సరిపోదు. అందరిని కలుపుకొని పోయే మనస్తత్వం ఉండాలి.
  4. విదేశాంగ విధానంలో సరియైన అవగాహన ఉండి దేశానికి ఇతర దేశాల నుండి ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలి.

4. మార్కుల ప్రశ్నలు
-
(ప్రశంస-అభినందన-సున్నితత్వం)
1. తీవ్ర మాంద్యానికి కారణాల గురించి భిన్న వాదనలను పోల్చండి. వాటిల్లో దేనితో మీరు ఏకీభవిస్తారు? కారణాలు పేర్కొనండి.
జ:
తీవ్ర మాంద్యానికి కారణాల గురించి భిన్న వాదనలు.
  1. 1929 లో సంభవించిన తీవ్ర ఆర్థిక మాంద్యము 1939 వరకు కొనసాగింది.
  2. ఈ మాంద్యానికి కారణాల గురించి, దీనిని అధిగ మించడానికి గల మార్గాల గురించి, ఇది పునరావృతం కాకుండా చూసే విధానాల గురించి ఆర్థిక వేత్తలు, రాజకీయ నాయకుల మధ్య భిన్న వాదనలు ఉన్నాయు.
  3. ఈ రకమైన సంక్షోభాలు పెట్టుబడి దారీ విధానం వల్లనే సంభవిస్తాయని సోషలిజం ఏర్పాటుతోనే వీటిని నిర్మూలించగలమని మార్క్సిస్టు ఆర్థిక వేత్తలు అంటారు.
  4. J.M కీన్స్ లాంటి ఆర్థిక వేత్తలు ఆర్థిక విధానంలో ప్రభుత్వాలు ప్రభావ వంతంగా జోక్యం చేసుకోక పోతే మాంద్యానికి దారి తీస్తుంది అంటాడు.
  5. ఆర్థిక స్థితి క్షీణించి, గిరాకీ క్షీణిస్తున్నపుడు ప్రభుత్వం నిధులు ఖర్చు చేసి ఉపాధిని కల్పించాలని, దీని వల్ల ప్రజలకు ఆదాయం సమకూరి మార్కెటులలో వస్తువులకు గిరాకీ ఏర్పాడుతుందని తద్వారా ఆర్థిక రంగం కోలుకుంటందని కీన్స్ భావిస్తాడు.

 

ప్రశంస అభివందన:పై వాదనల్లో నేను J.M కీన్స్ వాదనతో ఏకీభవిస్తాను. ఎందుకంటే...

 

  1. ప్రైవేటు రంగంలో మాత్రమే ఉత్పత్తి, మార్కెట్ కేంద్రీకృతమై ఉంటే ఉత్పత్తి పరిమాణం పైన, ధరలపైన ప్రభుత్వ నియంత్రణ ఉండదు. దీని వల్ల ఎంత ఉత్పత్తి చేయాలో స్పష్టత లేకపోవడం వల్ల ఎక్కువ ఉత్పత్తి చేస్తే గిరాకీ లేక నష్టపోయే ప్రమాదం ఉంది.
  2. అలా కాక ప్రభుత్వ నియంత్రణ ఉంటే అవసరమైన మేరకు ఉత్పత్తి జరుగుతుంది. అంతే కాక నష్టపోయున సంస్థలకు ప్రభుత్వం చేయూత నివ్వాలి.

2. తీవ్ర మాంద్య పరిస్థితులలో సంక్షేమ రాజ్యం అన్న భావన కింద చేపట్టిన వివిధ చర్యలు పేర్కొనండి. రష్యాలో చేపట్టిన సంస్కరణలకూ, వీటికీ ఉన్న పోలికలు, తేడాలను పేర్కొనండి.
జ.
తీవ్ర మాంద్య పరిస్థితులలో సంక్షేమ రాజ్యం అన్న భావన కింద చేపట్టిన చర్యలు వివిధ దేశాల్లో ఈ విధంగా ఉన్నాయు.

  1. అమెరికాలో అప్పటి అధ్యక్షుడు రూస్‌వెల్ట్ కొత్త ఒప్పందాన్ని (New deal) పకటించారు.
  2. దీని ప్రకారం మాంద్యానికి గురైన వారికి పునరావాసం, ఆర్థిక సంస్థలకు సంస్కరణలు ప్రకటించారు.
  3. సామాజిక భద్రతా విధానాన్ని ప్రవేశపెట్టారు.
  4. పదవీ విరమణ పింఛను, నిరుద్యోగ భీమా, వికలాంగులకు, తండ్రి లేని కుటుంబాల లో అవసరమున్న పిల్లలకు సంక్షేమ ప్రయోజనాలు సమకూరాయు.
  5. బ్రిటన్‌లో కూడా నిరుద్యోగ బీమా, వృద్ధాప్య పింఛను, నిరుద్యోగ భృతి, అనారోగ్యానికి ఖర్చులు, ఆరోగ్య పథకాలు, శిశు సంరక్షణ వంటి చర్యలు తీసుకున్నారు.
  6. ప్రజలందరికి కనీస జీవనస్థాయు, ఆరోగ్యం, గృహవసతి, విద్య, శిశు, వృద్ధాప్య సంరక్షణ అంశాలను ప్రాధాన్యత ఇచ్చారు.

 

రష్యాతో పోలికలు: రష్యా విప్లవం తర్వాత అక్కడ కూడా ఇలాంటి చర్యలు చేపట్టారు.

 

  1. ధరలను నియంత్రించి కర్మాగారాలు, బ్యాంకులను జాతీయం చేశారు.
  2. భూమిని ప్రభుత్వ స్వాధీనం చేసుకొని పునః పంపిణీ చేశారు.
  3. ఆర్థిక అసమానతలు, వివక్ష లేని సమాజాన్ని ఏర్పాటు చేయడానికి రష్యా ప్రయత్నించింది.

తేడాలు:

  1. సంక్షేమ రాజ్యంలో చేపట్టిన చర్యలు తక్షణ లబ్ది చేకూర్చేవిగా ఉండగా, రష్యా చర్యలు దీర్ఘ కాలిక ప్రయోజనాలు కల్గినవి.
  2. భూస్వాములు, పెట్టుబడి దారులు, దోపిడిదారు ల్లేని సమాజాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తే సంక్షేమ రాజ్యంలో మౌలిక అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు.

2 మార్కుల ప్రశ్నలు
1. రష్యా సోషలిస్టు విప్లవంలో మహిళల పాత్ర తెలపండి. (లేదా) 1917 మార్చి విప్లవం గురించి(లేదా) రష్యాన్ తొలి విప్లవం గురించి వ్రాయండి.
జ.
రష్యా సోషలిస్టు విప్లవంలో మహిళల పాత: (1917 మార్చి విప్లవం)
  1. 1917లో వచ్చిన రష్యా విప్లవంలో మహిళలు చురుకైన పాత్ర వహించారు.
  2. 1917మార్చి 8న సెయుంట్ పీటర్స్ బర్గ్‌లోని ఒక కర్మాగారంలో మొదట మహిళలు ఆహరం కోసం నిరసన చేపట్టారు.
  3. క్రమంగా ఈ ఉద్యమం నగరమంతటికి విస్తరించి దాదాపు 10వేల మంది మహిళలు ఊరేగింపు చేపట్టి 'రొట్టె, శాంతి' కావాలని నినదించారు.
  4. క్రమంగా పురుషులు కూడా సమ్మెలోకి దిగి విప్లవాన్ని ఉధృతం చేశారు.
  5. ఈ నిరసనలకు భయపడి జార్ నికొలస్-II పారిపోయాడు.

2. రష్యాలో 1917 అక్టోబర్‌లో వచ్చిన విప్లవం గురించి వ్రాయండి.
జ.
1917 అక్టోబర్ విప్లవం:

  1. రష్యాలో 1917 మార్చిలో (ఫిబ్రవరి) తొలి విప్లవం సంభవించగా.. 1917 అక్టోబర్‌లో అంతకన్నాపెద్ద విప్లవం సంభవించింది.
  2. జార్ నికోలస్-II పారిపోయున తర్వాత అధికారం చేపట్టిన ఉదారవాదులు, రాచరిక కుటుంబాల వాళ్లు యుద్ధాన్ని కొనసాగించారు.
  3. యుద్ధం వల్ల ఆహర,ఆర్థిక కొరత ఏర్పడి ప్రజలు విసిగిపోయారు.
  4. ప్రజలు సోవియట్లు (సంఘం)గా ఏర్పడి నిరసన తెలిపారు.
  5. లెనిన్ నాయకుడుగా ఉన్న బోల్షవిక్ వర్గం ఈ నిరసనలకు నాయకత్వం వహించింది.
  6. ప్రజల మద్దతుతో 1917 ఆక్టోబర్ (నవంబర్) లో బోల్షవిక్‌లు అధికారాన్ని పొందారు.

3. లెనిన్ నాయకత్వంలోని బోల్షవిక్‌లు ప్రజలు విశ్వాసాన్ని ఎలా చురగోన్నారు.
జ.
లెనిన్ నాయకత్వంలోని బోల్షవిక్‌లవిధానాలు:

  • బోల్షవిక్‌లకు వ్లాడిమీర్ లెనిన్ నాయకత్వం వహించాడు.
  • షరతులు లేని శాంతిని వెంటనే నెలకొల్పడం.
  • భూమినంతటిని జాతీయం చేసి దాన్ని రైతాంగానికి పంచి పెట్టడం.
  • ధరల నియంత్రణ, అన్ని కర్మాగారాలు, బ్యాంకులు జాతీయం చేయడం.

 

ఇలాంటి హమీలతో సోవియట్లు (రైతాంగ, కార్మిక, సైనిక సంఘాలు) ఆకర్షితులై లెనిన్‌పై విశ్వాసాన్ని పెంచుకోన్నారు.
4. తీవ్ర ఆర్థిక మాంద్య పరిస్థితులను వివరించండి.
జ.
తీవ్ర ఆర్థిక మాంద్య పరిస్థితులు:

 

  1. తీవ్ర ఆర్థిక మాంద్యము 1929 చివరలో మొదలై 1939 వరకు కొనసాగింది.
  2. ఈ దశాబ్ద కాలంలో ప్రపంచ వ్యాప్తంగా గిరాకి పడిపోవడంతో ధరలు పడిపోయు ఆర్థిక పరిస్థితి క్షీణించింది.
  3. గిరాకి తగ్గడంతో కర్మాగారాలు మూత పడ్డాయు.
  4. పెద్ద ఎత్తున నిరుద్యోగం ఏర్పడి, ఆదాయాలు తగ్గి సాధారణ ప్రజలు, ప్రభుత్వాలు కూడా ప్రభావితమయ్యాయు.
  5. అమెరికాలో మొదలైన ఈ పరిణామాలు అనతికాలంలోనే దాదాపు అన్ని దేశాలను ప్రభావితం చేశాయు.

5. ‘ఏ పని చేయడానికైనా సిద్ధం’ అని రాసి ఉన్న కార్డులను జర్మనీ పురుషులు మెడలో వేసుకొని కనపించేవాళ్లు. ఎందుకు?
జ.

  1. ఆర్థిక మాంద్య పరిస్థితుల వల్ల అన్నింటి కంటే ఎక్కువగా ప్రభావితమైన దేశం జర్మనీ.
  2. పారిశ్రామిక ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయుంది.
  3. కార్మికులు ఉపాధి కోల్పోయు నిరుద్యోగులయ్యారు. ఉపాధి కోల్పోని కార్మికుల వేతనాలు తగ్గించారు.
  4. అంతకు ముందెన్నడూ లేనంతగా నిరుద్యోగుల సంఖ్య 60 లక్షలకు చేరుకుంది.
ఈ కారణాల వల్ల పని కోసం పురుషులు వీధులలో ‘‘ఏ పని చేయడానికైనా సిద్ధం’’ అని రాసి ఉన్న కార్డులు మెడలో వేసుకొని కనపించేవాళ్లు.
6. జర్మనీ ప్రజల విశ్వాసాన్ని చురగొనడంలో హిట్లర్ ఎలా కృతకృత్యుడయ్యాడు?
జ.
  1. హిట్లర్ ఆద్భుతమైన వక్త, అతడి ఉద్వేగం, మాటలు ప్రజల్ని కదిలించి వేశాయు.
  2. ఒక బలమైన దేశాన్ని నిర్మిస్తానాన్ని, వర్సయుల్స్ ఒప్పందపు ఆన్యాయాన్ని రద్దు చేస్తానని, జర్మనీ ప్రజల గౌరవాన్ని తిరిగి నిలబెడతానని చెప్పాడు.
  3. పని కావలనుకుంటున్న వాళ్లకు పని, యువతకు బంగారు భవిష్యత్తు కల్పిస్తానని వాగ్దానం చేశాడు.
  4. అన్ని విదేశీ ప్రభావాలు తొలగించి విదేశీ కుట్రలు తిప్పి కొడతానని చెప్పాడు.

ఇలాంటి వాగ్దానాలతో హిట్లర్ జర్మనీ ప్రజల విశ్వాసాన్ని చురగొన్నాడు.
7. రెండో ప్రపంచ యుద్ధానికి హిట్లర్ ఎలా కారకుడు?
జ.

  1. ప్రజలకు ఉపాధి కల్పించడానికి హిట్లర్ పెద్ద ఎత్తున సైనికులను నియమించాడు.
  2. ఆయుధ కర్మాగారాలను పెద్ద ఎత్తున స్థాపించాడు.
  3. పొరుగు వాళ్లతో యుద్ధానికి దిగితే తప్ప ఈ చర్యలు కొనసాగే పరిస్థితి లేదు.
  4. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత కోల్పోయున ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి దుందుడుకు విదేశీ విధానాన్ని అవలంబించాడు.
  5. 1939లో పోలాండ్‌పై దండెత్తడంతో రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది.

1 మార్కు ప్రశ్నలు
1. 1917 మార్చి విప్లవంలో రష్యన్ మహిళల నినాదం ఏమిటి?
జ.
1917 మార్చిలో రష్యాలో జరిగిన విప్లవంలో మహిళలు చురుకుగా పాల్గొని 'రొట్టె, శాంతి' కావాలని నినదించారు.
2. మార్చి విప్లవం అని దేనిని అంటారు?
జ.
మార్చి విప్లవం:
1. 1917 మార్చిలో రష్యాలో జరిగిన విప్లవాన్ని తొలి రష్యాన్ విప్లవం, మార్చి విప్లవం అని అంటారు.
2. పాత రష్యా క్యాలెండర్ ప్రకారం అది ఫిబ్రవరి నెల కాబట్టి దానిని ఫిబ్రవరి విప్లవం అని కూడా అంటారు.
3. రష్యా జూలియన్ క్యాలెండర్, గ్రెగోరియన్ క్యాలెండర్‌కు తేడా ఏమిటి?
జ.
1. రష్యా 1918 వరకు అనుసరించిన జూలియన్ క్యాలెండర్ తేదీలు గ్రెగోరియన్ క్యాలెండర్ కంటే 13రోజలు వెనక్కి ఉంటాయు.
2. ప్రపంచమంతా ఇప్పుడు గ్రెగోరియన్ క్యాలెండర్ అనుసరిస్తోంది.
4. USSR ను విస్తరింపుము.
. USSR: యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్.

5. గెస్టాపో అంటే ఏమిటి?
జ.
గెస్టాపో: జర్మనీ సమాజాన్ని నియంత్రించడానికి, భద్రతా పరిరక్షణకు హిట్లర్ ఏర్పాటు చేసిన ‘రహస్య పోలీసు బృందం’ మే గెస్టాపో.
6. సంక్షేమ రాజ్యం ఏవైనా రెండు ప్రాతిపదిక సూత్రాలు తెలపండి.
జ.
1. సామాజిక భద్రతను కల్పించడం
2. ప్రజలందరికీ కనీస జీవనస్థాయు, ఆహరం, గృహవసతి, ఆరోగ్యం, విద్య, శిశు, వృద్ధాప్య సంరక్షణ చేపట్టడం.
7. 'యానిమల్‌ఫాం' నవలను రచించింది ఎవరు? అది దేని గురించి ఉంది?
జ.
1. 'యానిమల్‌ఫాం' నవలను రచించింది జార్జ్ ఆర్వెల్.
2. యు.ఎస్.ఎస్.ఆర్‌లో రష్యాన్ విప్లవం ఆదర్శాలను ఎలా నీరుకార్చారో చిత్రీకరించాడు.
8. 'ఎనేబ్లింగ్ యాక్'ట అంటే ఏమిటి?
జ.
'ఎనేబ్లింగ్ యాక్'ట :-
1. 1993 మార్చి 3న జర్మనీలో ఆమోదం పొందిన చట్టమే 'ఎనేబ్లింగ్ యాక్'్ట.
2. దీని ప్రకారం జర్మనీలో నియంతృత్వం ఏర్పడింది.
9. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీని ఏ విధంగా విభజించారు?
. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీని రెండు భాగాలుగా విభజించారు.
1. తూర్పు జర్మనీ
2. పశ్చిమ జర్మనీ
10. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా ఏ నగరాలపై అణుబాంబు ప్రయోగించింది.
జ:
రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్‌లోని హిరోషిమా,నాగాసాకి నగరాలపై అణుబాంబు ప్రయోగించింది.

బహుళైచ్ఛిక ప్రశ్నలు
1. ‘రొట్టె, శాంతి' కావాలనిమహిళలు ఈ నగరంలో నిరసన చేపట్టారు. ( )
a) మాస్కో
b) బెర్లిన్
c) సెయుంట్ పీటర్స్బర్గ్
d) లండన్
2. 1917 మార్చి విప్లవ సమయంలో రష్యాన్ జార్ ఎవరు? ( )
a) నికోలస్-II
b) నికోలస్-I
c) అలెగ్జాండర్-I
d) అలెగ్జాండర్-II
3. రష్యా జూలియన్ క్యాలెండర్, గ్రెగోరియన్ క్యాలెండర్‌కు ఎన్నిరోజులు తేడా ఉంది. ( )
a) 18 రోజులు
b) 13 రోజులు
c) 15 రోజులు
d) 10 రోజులు
4. బోల్షవిక్‌ల నాయకుడు ఎవరు? ( )
a) స్టాలిన్
b) కెరెన్‌స్కీ
c) నికోలస్-II
d) లెనిన్
5. ‘యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్’ (USSR) ఏ సంవత్సరంలో ఏర్పడింది?
a)1917
b) 1920 ( )
c) 1924
d) 1928
6. 1905లో రష్యాలో వచ్చిన విప్లవం ( )
a) మార్చి విప్లవం
b) అక్టోబర్ విప్లవం
c) రక్తసిక్త ఆదివారం విప్లవం
d) తొలి రష్యాన్ విప్లవం
7. రష్యాలో పంచవర్ష ప్రణాళికలను ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ( )
a) 1924
b) 1928
c) 1917
d) 1920
8. రష్యాలో అమలులోకి వచ్చిన సోషలిజం నుంచి ప్రేరణ పొందిన భారతీయులు... ( )
a) ఎం.ఎన్.రయ్
b) రవీంద్రనాథ్ ఠాగూర్
c) జవహర్ లాల్ నెహ్రు
d) పై వారందరూ
9. రవీంద్రనాథ్ ఠాగూర్రష్యా సందర్శిన సంవత్సరం... ( )
a) 1928
b) 1929
c) 1930
d) 1931
10. ఆర్థిక మాంద్య పరిస్థితుల నుంచి అమెరికా గట్టెక్కించడానికి కొత్త ఒప్పందాన్ని ప్రకటించిన అప్పటి అధ్యక్ష్యడు..... ( )
a) ఉడ్రోవిల్సన్
b) F.D రూజ్‌వెల్ట్
c) ఐసెన్ హోవర్
d) అబ్రహం లింకన్
11. అమెరికా సామాజిక భద్రతా విధానాన్ని ప్రవేశ పెట్టింది ఎవరు? ( )
a) ఉడ్రోవిల్సన్
b) F.D రూజ్‌వెల్ట్
c) ఐసెన్ హోవర్
d) అబ్రహం లింకన్
12. 'అన్నింటి కంటే బలమైన జాతికి ప్రపంచాన్ని ఓడించే హక్కు ఉంది' అని వాదించింది ఎవరు? ( )
a) ముస్సోలిని
b) హిట్లర్
c) తనాకా
d) రూజ్‌వెల్ట్
13. ఆర్థిక మాంద్యం వల్ల అన్నింటి కంటే ఎక్కువగా ప్రభావితమైన దేశం.. ( )
a) అమెరికా
b) రష్యా
c) జర్మనీ
d)బ్రిటిష్
14. ఆర్థిక మాంద్యం వల్ల అంతగా ప్రభావితం కాని దేశం ఏది? ( )
a) అమెరికా
b) రష్యా
c) జర్మనీ
d) బ్రిటిష్
15. "ఈ లోకంలోకి మహిళ తెచ్చే ప్రతి సంతానమూ ఒక యుద్ధమే. తన ప్రజల కోసం మహిళ ఈ పోరు సలుపుతోంది" అని ఎవరన్నారు? ( )
a) హిట్లర్
b) లెనిన్
c) స్టాలిన్
d) ముస్సోలిని
16. రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైన తేదీ..... ( )
a) 1939 జూన్ 28
b) 1939 ఆగస్టు 1
c) 1939 సెప్టెంబర్ 1
d) 1939 జూలై 28
17. జర్మనీ విడిపోయున తర్వాత తూర్పు జర్మనీలో ఏర్పడిన జర్మన్ గణతంత్ర ప్రజాస్వామ్యం (GDR) ఎవరి ప్రభావం కిందకి వెళ్ళింది. ( )
a) అమెరికా
b) బ్రిటిష్
c) రష్యా
d) ఫ్రాన్స్
18. వీరిలో నియంత కానిది ఎవరు? ( )
a) హిట్లర్
b) చర్చిల్
c) ముస్సోలిని
d) బిస్మార్్క
19. అమెరికా సంయుక్త రాష్ట్రాలు రెండో ప్రపంచ యుద్ధంలో ఏ సంవత్సరంలో చేరాయు. ( )
a) 1939
b) 1940
c) 1941
d) 1942
20. నాజీ పార్టీ గుర్తు ఏది? ( )
a) ఓం
b) స్వస్తిక్
c) శిలువ
d) కాస్
21. 'రీచ్‌స్టాగ్' అనేది ఏ దేశ పార్లమెంట్ ? ( )
a) రష్యా
b) అమెరికా
c) జపాన్
d) జర్మనీ
జవాబులు:
1. c 2. a 3. b 4. d 5. c 6. c 7. b 8. d 9. c 10. b
11. b 12. b 13. c 14. b 15. a 16. c 17. c 18. b 19. c 20. b
21. d
Published date : 06 Dec 2023 01:20PM

Photo Stories