వాహనాల టైర్లు నల్లరంగులో ఉంటాయెందుకు?
Sakshi Education
సైకిళ్లు, కార్లు, బస్సులు, లారీలు, ట్రక్కుల వంటి వాహనాల టైర్లు నల్లరంగులో ఉంటాయనే విషయం మనందరికీ తెలిసిందే. రోడ్లపై ఉండే చెత్త, చెదారం, బురదల వల్ల టైర్లు మాసిపోతాయని, అది కనపడకుండా వాటికి నల్లరంగు వేస్తారని సాధారణంగా అనుకుంటారు. కానీ అది కారణం కాదు.
వాహనాలకు ఉండే టైర్లకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలి. వాహనం ఎంత వేగంగా నడుస్తున్నా టైర్లలో ఉండే ట్యూబులోని గాలి తగ్గిపోకూడదు. వాహనం రోడ్డుపై వెళ్లేటప్పుడు రోడ్డుకు, టైర్లకు మధ్య ఉత్పన్నమయ్యే రాపిడి (ఘర్షణ)ని తట్టుకోగల శక్తి ఉండాలి. టైర్లు ధృడంగా ఉండి ఎక్కువ కాలం మన్నేవిగా ఉండాలి. మామూలు రబ్బురులో ఈ లక్షణాలన్నీ ఉండవు. అందువల్ల టైర్ల తయారీ రబ్బరులో కొన్ని ఇతర పదార్థాలు కలుపుతారు. మామూలు రబ్బరులో 35 శాతం ‘బ్యూటజీన్ రబ్బరు’ కలపడం ద్వారా, రబ్బరుకు రాపిడిని తట్టుకొనే సామర్థ్యం సమకూరుతుంది. ఈ పదార్థంతో పాటు మరో 65 శాతం ‘కార్బన్ బ్లాక్’ అనే పదార్థాన్ని కలుపుతారు. ఇది టైర్లను ధృడంగా ఉండేటట్లు చేస్తుంది. వీటితోపాటు ప్రొసెసింగ్ ఆయిల్, ప్రొడక్షన్ వాక్స్ను కూడా రబ్బరుకు కలిపి టైర్లను తయారు చేస్తారు.
టైర్లలో ఎక్కువ శాతంలో కార్బన్ బ్లాక్, ఇసుక నుంచి ఒక నల్లని పదార్థం తయారవుతుంది. ఈ పదార్థం వల్లనే టైర్లకు నల్లని రంగు వస్తుంది. ఇలా తయారయ్యే టైర్లు చాలా కాలం మన్నడమే కాకుండా వేలకొద్ది కిలోమీటర్లు నడిచినా అరిగిపోవు.
- లక్ష్మీ ఈమని

Published date : 13 Jul 2013 11:03AM