వాతావరణ శాస్త్రజ్ఞులు గాలివేగాన్ని ఎలా కొలుస్తారు?
Sakshi Education
గాలి వేగాన్ని ‘ఎనిమో మీటర్’ అనే సాధనంతో కొలుస్తారు. గ్రీకుభాషలో ఎనిమోస్ అంటే వీచేగాలి (విండ్) అని అర్థం. ఈ సాధనం గాలివేగాన్ని మీటర్స పర్ సెకండ్ లేదా నాట్స్ (నాటికల్ మైల్స్ పర్ సెకండ్)లో రికార్డు చేస్తుంది. ఈ సాధనం గిరగిరా తిరిగేలా అమర్చిన ఒక ఫ్యాన్ సూత్రంపై ఆధారపడి ఉంటుంది. గాలివేగం హెచ్చేకొద్దీ ఫ్యాను బ్లేడ్లు వేగంగా తిరుగుతాయి.
అలాగే ఒక చిన్న గొట్టంలో గాలి ఏర్పరిచే పీడనాన్ని బట్టి కూడా గాలి వేగాన్ని కొలుస్తారు. గొట్టంలోకి ప్రవేశించే గాలివేగం ఎక్కువయ్యేకొద్దీ ఆ గాలి అప్పటికే గొట్టంలో ఉన్న వాయువు లేదా ద్రవంపై ప్రయోగించే పీడనం ఎక్కువవుతుంది. ఈ సూత్రంపైనే విమానాల వేగాన్ని కొలిచే ‘పీరూట్ట్యూబ్’ అనే సాధనంతో కూడా గాలివేగాన్ని కొలుస్తారు. ఇవేకాకుండా ‘అతిధ్వనుల’ను కొలిచే సాధనాలతోనూ అతిగా వేడెక్కిన తీగెను గాలి చల్లార్చే సమయాన్ని కొలిచే సాధనంతో కూడా కొలుస్తారు.
అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం గాలివేగాన్ని కొలిచే పరికరాన్ని భూమి నుంచి పదిమీటర్ల ఎత్తులో అమర్చాలి. ఎందుకంటే, నేల ఉపరితలంపై అనేక అడ్డంకులు ఉండడం వల్ల గాలివేగాన్ని కచ్చితంగా కొలవలేము.
- లక్ష్మీ ఈమని

Published date : 28 Sep 2013 02:41PM