గోధుమ గింజలు, పంట బంగారు రంగులో ఉంటాయెందుకు?
Sakshi Education
మొక్కలు, జంతువులు సమృద్ధిగా, ఆరోగ్యంగా పెరగాలంటే వాటికి ముఖ్యంగా కావాల్సింది నైట్రోజన్ వాయువు. కానీ నేల నుంచి ఈ వాయువు కావాల్సినంత లభించక పోవడంతో మొక్కలు ఈ వాయువును పునరావృతం (రీసైక్లింగ్) చేస్తుంటాయి. మొక్కలకు ఆకుపచ్చని రంగును ఇచ్చే క్లోరోఫిల్ అణువులలో నైట్రోజన్ ఉంటుంది. మొక్కలకు నైట్రోజన్ అవసరం లేనపుడు అవి వాటిలో ఉండే క్లోరోఫిల్ అణువులను విడుదల చేస్తాయి. అందువల్లనే గోధుమపంట సమృద్ధిగా పెరిగి కోతకు వచ్చినపుడు, గోధుమ మొక్కలకు క్లోరోఫిల్ అవసరం ఉండదు. అవి క్లోరోఫిల్ను గింజల ద్వారా విడుదల చేయడంతో మొక్కలతోపాటు గింజలు కూడా లేత బంగారు రంగులోకి మారతాయి. అలాగే ఏపుగా పెరిగి, కోతకొచ్చిన ఒడ్లు ఆకుపచ్చరంగు నుంచి లేత బంగారు రంగులోకి మారతాయి.
- లక్ష్మీ ఈమని
- లక్ష్మీ ఈమని
Published date : 28 Sep 2013 02:44PM