కార్డులెస్ ఫోన్ ఎలా పనిచేస్తుంది?
Sakshi Education
మనలో చాలామందికి లాండ్ లైన్ఫోన్ ఎలా పనిచేస్తుందనే విషయం తెలుసు. ఈ ఫోన్ తీగల ద్వారా టెలిఫోన్ ఎక్స్ఛేంజ్తో కలిపిఉంటుంది. ఈ ఫోన్లో మాట్లాడినపుడు మన మాటలవల్ల ఏర్పడిన శబ్దతరంగాలు రేడియో తరంగాలుగా మారి మారోఎక్స్ఛేంజ్కు చేరుకొని అక్కడ మళ్లీ శబ్దతరంగాలుగా మారి తీగల ద్వారా ఇంకో ఫోన్కు చేరుకొంటాయి.
కార్డలెస్ ఫోన్లో ఈ వ్యవహారం ఒక అడుగు ముందుకు వేస్తుంది. కార్డలెస్ ఫోన్లో రేడియో ట్రాన్సమీటర్, రిసీవర్ కూడా ఇమిడి ఉంటాయి. ఇందులో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి. ఒకదాన్ని బేస్యూనిట్ అంటారు. ఇది ఫోన్లైన్తో విద్యుత్ సరఫరాతో కలిపి ఒకచోట స్థిరంగా ఉంటుంది. రెండోది మనం మాట్లాడే పోర్టబుల్ యూనిట్. దీన్ని తీసుకొని మనం ఇంటిపరిసరాలలో అటూ ఇటూ తిరుగుతూ మాట్లాడవచ్చు. మన దేశంలో అయితే దీనిని 100 మీటర్ల దూరం వరకూ తీసుకువెళ్లవచ్చు.
మీరు, మీ మిత్రుడు మాట్లాడుకొనే మాటలన్నీ బేస్యూనిట్, పోర్టబుల్ యూనిట్ల మధ్య రేడియో తరంగాలుగా మారి ప్రయాణిస్తున్నాయన్నమాట. పోర్టబుల్ యూనిట్ దేనితోనూ తీగెల ద్వారా కలిపి ఉండకపోవడం వల్ల ఈ ఫోన్ను ‘కార్డలెస్ ఫోన్’ అంటారు.
మీ మిత్రుడు మీకు ఫోన్ చేసినప్పుడు అది ముందు అతని వైపున ఉండే బేస్యూనిట్కు చేరుకుంటుంది. అక్కడ మీ మిత్రుడు మాట్లాడే మాటలు రేడియో తరంగాలుగా మారి ప్రసారమవుతాయి. మీ పోర్టబుల్ యూనిట్లో ఉండే రిసీవర్ వాటిని గ్రహించి తిరిగి వాటిని అందులో ఉండే స్పీకర్ ద్వారా శబ్దతరంగాలుగా మార్చి మీ చెవిన వేస్తుంది.
మీరు మాట్లాడినపుడు మీరు చేతిలో పట్టుకున్న పోర్టబుల్ యూనిట్ మీ మాటల్ని రేడియో తరంగాలుగా మార్చి బేస్యూనిట్కు పంపుతుంది. అక్కడ అవి తిరిగి మీ స్నేహితుని రిసీవర్లో ఉండే స్పీకర్ సాయంతో మరలా శబ్ద తరంగాలుగా మారతాయి.
లక్ష్మి .... ఈమని

Published date : 17 Aug 2013 12:37PM