Skip to main content

టెన్త్ బయాలజీ....మూస విధానం నుంచి తార్కిక దిశగా

మొన్న - చదవాలి, చదవాలి<br/> నిన్న - చూడాలి, చూడాలి<br/> నేడు - చేయాలి, చేయాలి.
Tenth Class Guidance పై విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బట్టీ విధానానికి దూరంగా
నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని (సీసీఈ - కంటిన్యూయిస్ కాంప్రహెన్సివ్ ఎడ్యుకేషన్) సమర్థంగా అమలుపరచడానికి రూపొందించినవే నూతన పాఠ్యపుస్తకాలు. పదో తరగతి జీవశాస్త్రంలో పది అధ్యాయాలున్నాయి. అవి:
  1. పోషణ - ఆహార సరఫరా వ్యవస్థ
  2. శ్వాసక్రియ - శక్తి ఉత్పాదక వ్యవస్థ
  3. ప్రసరణ - పదార్థ రవాణా వ్యవస్థ
  4. విసర్జన - వ్యర్థాల తొలగింపు వ్యవస్థ
  5. నియంత్రణ - సమన్వయ వ్యవస్థ
  6. ప్రత్యుత్పత్తి - పునరుత్పాదక వ్యవస్థ
  7. జీవక్రియల్లో సమన్వయం
  8. అనువంశికత
  9. మన పర్యావరణం- మన బాధ్యత
  10. సహజ వనరులు
పై అధ్యాయాల్లో అనువంశికత కొత్త అధ్యాయం. మిగిలిన చాప్టర్‌లను విద్యార్థులు కింది తరగతుల్లో కొంతవరకు అధ్యయనం చేశారని చెప్పొచ్చు. కొత్త పరీక్ష విధానంలో విద్యార్థులు అన్ని అధ్యాయాలను బట్టీపట్టకుండా, పూర్తిగా, క్షుణ్నంగా, ఆలోచనాత్మకంగా, తార్కికంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు ప్రతి పాఠ్యాంశంపై పట్టు సాధిస్తే ప్రశ్నలు ఏ రూపంలో వచ్చినా, ఎలా అడిగినా సమాధానాలు రాయొచ్చు.

భౌతిక, రసాయన శాస్త్రం మాదిరిగా జీవశాస్త్రానికి కూడా అధ్యాయాలవారీగా వెయిటేజీ ఉండదు. విద్యాప్రమాణాలకు మాత్రమే వెయిటేజీ ఉంటుంది.

విద్యా ప్రమాణాలు
  1. విషయావగాహన: విద్యార్థులు పాఠ్యాంశాల్లోని భావనలను అర్థం చేసుకుని సొంతం గా వివరించడం, ఉదాహరణలివ్వడం, పోలికలు, భేదాలు చెప్పడం, కారణాలు వివరించడం, విధానాలను విశదీకరించడం చేయాలి. వాటి ఆధారంగా సొంతం గా నోట్స్‌ను రూపొందించుకోవాలి.
  2. ప్రశ్నించడం, పరికల్పన చేయడం: విషయా న్ని అర్థం చేసుకోవడానికి, సందేహాలను తీర్చుకోవడానికి, చర్చించడానికి విద్యార్థు లు సిద్ధంగా ఉండాలి. తమ పరిశీలన ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించగలగాలి.
  3. ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు: భావనల ను అర్థం చేసుకోవడానికి, పాఠ్యపుస్తకంలో సూచించిన/సొంత ప్రయోగాలు చేయాలి. అందుకవసరమైన పరికరాలను కూడా సిద్ధం చేసుకోవాలి. క్షేత్ర పరిశీలనల్లో పాల్గొని నివేదికలు తయారుచేయాలి.
  4. సమాచార సేకరణ నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు: పాఠ్యపుస్తకంలోని విభిన్న భావనలను అర్థం చేసుకోవడానికి అవసరమైన సమాచారాన్ని సేకరించి (ఇంటర్వ్యూ, ఇంటర్నెట్ వంటి మాధ్యమాల ద్వారా) విశ్లేషించగలిగే నైపుణ్యం కలిగి ఉండాలి. ప్రాజెక్టు పనులు నిర్వహించగలగాలి.
  5. బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం: విద్యార్థి తాను నేర్చుకున్న విజ్ఞాన శాస్త్ర భావనలకు సంబంధించిన చిత్రాలను గీయడం, నమూనాలు తయారుచేయడం, గ్రాఫ్‌లు గీయడం ద్వారా తన అవగాహనను వ్యక్తం చేయగలగాలి.
  6. అభినందించడం, సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండడం, విలువలు పాటించడం: విజ్ఞాన శాస్త్రాన్ని నేర్చుకోవడం ద్వారా ప్రకృతిని, మానవ శ్రమను గౌరవించడం, అభినందించడంతోపాటు సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండాలి. రాజ్యాంగ విలువలను పాటించగలగాలి.
  7. నిజజీవిత వినియోగం, జీవవైవిధ్యంపై సానుభూతి కలిగి ఉండడం: విద్యార్థి తాను నేర్చుకున్న విజ్ఞాన శాస్త్ర విషయాలను దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి సమర్థవంతంగా వినియోగించగలగాలి. జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి కృషి చేయాలి.
అధిక మార్కులు సాధించడానికి సూచనలు
  • ప్రతి పాఠం చివర ఉన్న కీలక పదాలు చదవాలి.
  • ప్రతి టాపిక్‌ను మైండ్ మ్యాపింగ్ విధానంలో చదివితే బాగా గుర్తుంటుంది.
  • ప్రతి యూనిట్‌ను క్షుణ్నంగా చదవాలి.
  • బట్టీ పట్టే విధానాన్ని పూర్తిగా మాను కోవాలి.
  • ప్రతి పాఠం చివర ఉన్న ప్రశ్నలను మాదిరి ప్రశ్నలుగా తీసుకొని అధ్యయనం చేయాలి.
  • ప్రయోగాలు చేయాలి. ప్రయోగాలకు సం బంధించిన అన్ని అంశాలను అధ్యయనం చేయాలి.
  • ఫ్లోచార్‌‌టలు, రేఖాచిత్రాలు, పటాలు, సరి పోల్చుకొనే టేబుల్స్‌లను బాగా సాధన చేయాలి.
  • పాఠ్యాంశంలో విషయాలను ఆధారం చేసుకొని సొంతంగా నోట్సు తయారు చేసు కోవాలి.
  • పాఠంలో ఇచ్చిన విషయాల గురించి ఆలోచించండి.. చర్చించండి. ఆ విషయాలను నిత్య జీవితంలో అన్వయించుకుంటూ అధ్యయనం చేయండి.
  • పాఠ్యపుస్తకంలోని సమాచారంతోపాటు, గ్రంథాలయం, ప్రయోగశాల, ఇంటర్నెట్, క్షేత్ర పర్యటనలు, వృత్తి నిపుణులను కలిసి కావలసినంత సమాచారం సేకరించండి.
  • ఈసారి ప్రశ్నపత్రాలకు నిర్దిష్టమైన ‘కీ’ మూల్యాంకన సమయంలో ఉండదు. కాబట్టి ప్రశ్నకు సంబంధించిన జవాబులు కచ్చితంగా ఇలానే రాయాలి అనే నియ మం లేదు. కాబట్టి ప్రశ్నలకు సంబం ధించిన విశ్లేషణాత్మక జవాబులు రాసే స్వేచ్ఛ ప్రతి విద్యార్థికీ ఉంది.
మాదిరి ప్రశ్నపత్రం
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి విద్యార్థులకు ఈ ఏడాది వరకు మాత్రమే పాత పద్ధతిలో ప్రశ్నపత్రం ఉంటుంది. సిలబస్, ప్రశ్నలు మాత్రం కొత్త పాఠ్యపుస్తకం నుంచి అడుగుతారు.

Part-A
35 మార్కులు
Section-I
1×4 =4
సెక్షన్-Iలో క్రమసంఖ్య 1 నుంచి 6 వరకు అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు ఉంటాయి. ఏవైనా నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయాలి. ఒక్కొక్క ప్రశ్నకు ఒక మార్కు.

Section-II
2×5 =10
సెక్షన్-IIలో క్రమసంఖ్య 7 నుంచి 14 వరకు స్వల్ప సమాధాన ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు రెండు మార్కులు. Group-A, Group-Bల నుంచి కచ్చితంగా రెండేసి ప్రశ్నల చొప్పున మొత్తం 5 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.

Section-III
4×4 =16
సెక్షన్-IIIలో క్రమసంఖ్య 15 నుంచి 22 వరకు వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కులు. ప్రతి గ్రూప్ నుంచి రెండు ప్రశ్నల చొప్పున మొత్తం 4 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.

Section-IV
1×5 =5
సెక్షన్-IVలో ఒక పటం గీసి భాగాలు గుర్తించాలి. 5 మార్కులు. ఒక పటం మొక్కల నుంచి ఒక పటం జంతువుల నుంచి ఇస్తారు.

Part-B
15M
Part-B పేపర్‌లో మొత్తం 30 ప్రశ్నలుంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు 1/2 మార్కు. దీనిలో 10 బహుళైచ్ఛిక ప్రశ్నలు, 10 ఖాళీలను పూరించ డం, 10 జతపరచడంపై ప్రశ్నలుంటాయి.

విద్యా ప్రమాణాలు

వెయిటేజి

మార్కులు

1.విషయావగాహన

40%

16

2.ప్రశ్నించడం, పరికల్పన చేయడం

10%

4

3.ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు

15%

6

4.సమాచార సేకరణ, నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు

15%

6

5.బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం

10%

4

6.అభినందించడం, సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండడం,
విలువలు పాటించడం, నిజ జీవిత వినియోగం, జీవవైవిధ్యంపై సానుభూతి కలిగి ఉండడం

10%

4

 

100%

40

Published date : 10 Jan 2015 12:26PM

Photo Stories