Skip to main content

Education Schemes: విద్యార్థులకోసం ఈ రాష్ట్రం చేపడుతున్న పథకాలకు పలు రాష్ట్రాల కితాబు 

సాక్షి, అమరావతి: ఏపీలోని పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేలా వారికి ఆంగ్ల మాధ్యమంలో మంచి చదువులు అందిస్తూ వారి సమగ్ర వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి.
Education Schemes
విద్యార్థులకోసం ఈ రాష్ట్రం చేపడుతున్న పథకాలకు పలు రాష్ట్రాల కితాబు 

బాలల కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ రూపొందించి నిధులు కేటాయించడం అద్భుతమని మెచ్చుకుంటున్నాయి. జాతీయ విద్యాప్రణాళిక, పరిపాలన సంస్థ (National Institute of Educational Planning and Administration (NIEPA) నవంబర్‌ 16న నిర్వహించిన వర్చువల్‌ వర్క్‌షాప్‌లో రాష్ట్రం తరఫున ఇచ్చిన ప్రజెంటేషన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘స్టూడెంట్‌ బేస్డ్‌ ఫైనాన్సియల్‌ సపోర్టు సిస్టమ్‌ ఇన్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌’అంశంపై నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌లో ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు డి.దేవానందరెడ్డి రాష్ట్రం అమలు చేస్తున్న పలు కార్యక్రమాల గురించి వివరించారు.

చదవండి: Tenth Class: పరీక్ష ఫీజు గడువు తేదీ ఇదే..

అమ్మ ఒడి, నాడు–నేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక వంటి కార్యక్రమాల గురించి విని వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ప్రశంసించారు. ముఖ్యంగా అమ్మ ఒడి పథకం అమలు సాహసోపేతమైన చర్యగా పలువురు అభినందించారు. నాడు–నేడు కింద రాష్ట్రంలోని ఫౌండేషన్‌ స్కూళ్లు మొదలు 60 వేల వరకు ఉన్న పలు విద్యాసంస్థలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమం పట్ల నీపా అధికారులు మెచ్చుకున్నారు. ఇంత భారీ ఎత్తున కార్యక్రమం చేపట్టిన రాష్ట్రం ఏపీ ఒక్కటేనని ప్రశంసించారు. పైగా అభివృద్ధి చేస్తున్న స్కూళ్లలో వాటి భద్రత నిర్వహణ కోసం స్కూల్‌ మెయింటెనెన్స్‌ ఫండ్, టాయిటెట్ల నిర్వహణ, పారిశుధ్య పనులకోసం టాయిలెట్‌ మెయింటెనెన్స్‌ ఫండ్‌ ఏర్పాటుచేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. 

చదవండి: School Education Department: పాఠశాలల పరీక్షల షెడ్యూల్‌ ఖరారు

చైల్డ్‌ సెంట్రిక్‌ బడ్జెట్‌ వినూత్న ఆలోచన 

చైల్డ్‌ సెంట్రిక్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తీరుపై నీపా అధికారులు, ఇతర ప్రతినిధులు ఆసక్తి చూపారు. ఈ బడ్జెట్‌ ఎలా రూపొందిస్తున్నారో తెలుసుకున్నారు. 
∙కుల, లింగ, వైకల్యాలు, తరగతి, మత, సాంస్కృతిక ప్రాధాన్యతలతో సంబంధం లేకుండా పిల్లలకు ఆరోగ్యకరమైన ప్రశాంతమైన జీవితాన్ని గడపగలిగే వాతావరణాన్ని సృష్టించడమే ఈ చైల్డ్‌ సెంట్రిక్‌ బడ్జెట్‌ లక్ష్యం. ∙2021–22లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.16,748.47 కోట్లతో తొలిసారిగా ఈ బాలల బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. 2022–23లో రూ.16,903 కోట్లు కేటాయించారు.

చదవండి: Droupadi Murmu: చిన్నప్పటి బడికి రాష్ట్రపతి

∙బాలల పథకాల కోసం వందశాతం నిధులు కేటాయించే కార్యక్రమాలు మొదటి విభాగం కాగా అవసరాల మేరకు నిధులు కేటాయించే సంక్షేమ పథకాలు రెండో విభాగంగా ఈ బడ్జెట్‌ను రూపొందించారు. ∙వివిధ శాఖల ద్వారా పిల్లల కోసం పలు పథకాలను అమలు చేయిస్తున్నారు. మొదటి విభాగంలో 15 స్కీములు, రెండో విభాగంలో 18 స్కీములు అమలు చేస్తున్నారు.

Published date : 17 Nov 2022 01:31PM

Photo Stories