పరీక్షలకు 6.23 లక్షల విద్యార్థులు.. జిల్లాల వారీగా స్కూళ్లు, విద్యార్థులు, పరీక్ష కేంద్రాలు ఇలా..
విద్యార్థులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు చేపట్టింది. ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. రాష్ట్రంలో 11,717 స్కూళ్ల నుంచి 6.23 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 3,95,428 మంది, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులు 16,195 మంది, ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులు 2,11,423 మంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కోవిడ్–19 మార్గదర్శకాలను పాటిస్తూ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి తెలిపారు.
చదవండి:
ఏపీ పదో తరగతి మోడల్‌పేపర్స్
గదికి 16 మంది విద్యార్థులు
కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌వోపీ) మార్గదర్శకాలు, వైద్యారోగ్యశాఖ సూచనలను పరిగణనలోకి తీసుకుని చర్యలు చేపట్టారు. ఈ నిబంధనలను అనుసరించి ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మాస్కు ధరించి పరీక్షలకు రావలసి ఉంటుంది. గతంలో పరీక్ష గదిలో 24 మంది కూర్చొని పరీక్ష రాసేలా సీటింగ్ ఏర్పాట్లు చేసేవారు. భౌతిక దూరం పాటించాలన్న నిబంధనను అనుసరించి గదికి 16 మంది విద్యార్థులను మాత్రమే అనుమతిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష కేంద్రాల సంఖ్యను పెంచి 3,780 సెంటర్లను ఏర్పాటు చేశారు. పాత జిల్లాల ప్రాతిపదికగానే పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టారు. పాత జిల్లా కేంద్రాల్లోని డీఈవోలే నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. ప్రతి సెంటర్‌కు ఒక చీఫ్ ఎగ్జామినర్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్, 12 మంది ఇని్వజిలేటర్లను నియమిస్తున్నారు. వీరితో పాటు ప్రత్యేకంగా ప్రతి జిల్లాకు అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు.
చదవండి:
సమాధానాలకు 24 పేజీల బుక్‌లెట్
ఈ సారి టెన్త్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు తొలిసారిగా సమాధానాలు రాసేందుకు 24 పేజీల బుక్‌లెట్లను అందించనున్నారు. గతంలోనే ఈ విధానాన్ని అమలు చేసేలా ఉత్తర్వులు జారీ అయినప్పటికీ కరోనా వల్ల పరీక్షల నిర్వహణ లేనందున ఈసారి నుంచి అమల్లోకి తెస్తున్నారు. గతంలో విద్యార్థులు విడిగా ఇచ్చే పేపర్లపై సమాధానాలు రాసేవారు. ఈసారి అలాకాకుండా నంబర్లతో ఉండే బుక్‌లెట్‌ను రూపొందించారు. బిట్ పేపర్ వేరేగా ఉండదు. గతంలో మాదిరిగానే ఈ విద్యాసంవత్సరంలో కూడా విద్యార్థులు ఏడు పేపర్ల మేరకు టెన్త్ పరీక్షలను రాయనున్నారు. విద్యార్థులెవరూ నేలపై కూర్చొని పరీక్ష రాసే పరిస్థితి లేకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లో తగినన్ని బెంచీలు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి కేంద్రంలో వైద్య సహాయం కోసం ఏఎన్ ఎం, భద్రత కోసం పోలీసులను నియమించేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచి్చంది. మంచినీటి సదుపాయం ప్రతి కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నారు.
పాత జిల్లాల వారీగా హైస్కూళ్లు, విద్యార్థులు, పరీక్ష కేంద్రాలు ఇలా..
జిల్లా |
స్కూళ్ల సంఖ్య |
విద్యార్థుల సంఖ్య |
పరీక్ష కేంద్రాలు |
శ్రీకాకుళం |
673 |
36,141 |
249 |
విజయనగరం |
527 |
29,776 |
181 |
విశాఖపట్నం |
1,012 |
57,735 |
318 |
తూ.గోదావరి |
1,157 |
66,685 |
359 |
ప.గోదావరి |
863 |
48,404 |
274 |
కృష్ణా |
968 |
55,280 |
364 |
గుంటూరు |
1,038 |
59,651 |
345 |
ప్రకాశం |
826 |
41,356 |
272 |
నెల్లూరు |
750 |
33,576 |
245 |
చిత్తూరు |
1,122 |
52,443 |
356 |
వైఎస్సార్ |
843 |
38,442 |
272 |
అనంతపురం |
995 |
51,207 |
241 |
కర్నూలు |
943 |
52,350 |
304 |
మొత్తం |
11,717 |
6,23,046 |
3,780 |