International Science and Engineering Fair: ప్రపంచ వేదికపై తెలుగు విద్యార్థుల ప్రతిభ
కృష్ణాజిల్లా పెడనలోని బీజేకే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వినయ్‌కుమార్, మణికంఠ రూపొందించిన ‘స్మార్ట్ సొల్యూషన్ ఫర్ ఎకో పొల్యూషన్’ప్రాజెక్టు నాలుగోస్థానంలో నిలిచింది. యూఎస్‌లోని డల్లాస్‌లో మే 13 నుంచి 19 వరకు ఐఎస్‌ఈఎఫ్ ప్రదర్శన జరిగింది. ఇందులో 80 దేశాల నుంచి రెండు వేల ప్రాజెక్టులు ప్రదర్శనకు ఉంచారు. మన దేశంనుంచి 23 ప్రాజెక్టులు ఉన్నాయి.
కాగా వేరుశనగపొట్టు, వేపాకు, కొబ్బరి పీచు, మెంతుల మిశ్రమంతో తెలుగు విద్యార్థులు రూపొందించిన ‘ఎకో ఫ్రెండ్లీ పూల కుండీ’ఎనర్జీ సస్టెయినబుల్ డిజైన్ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ ప్రాజెక్టుకు నగదు బహుమతి లభించడంతోపాటు 64వ లండన్ ఇంటర్నేషనల్ యూత్ సైన్స్ ఫోరమ్ స్కాలర్‌షిప్‌కు అప్లై చేసుకోవడానికి అవకాశం వచ్చింది. అలాగే మిస్సోరి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వాషింగ్టన్ డీసీ స్కాలర్‌షిప్‌కి అప్లై చేయడానికి కూడా అవకాశం కలిగింది. విద్యార్థులకు పర్యవేక్షకురాలిగా వ్యవహరించిన సైన్స్ టీచర్ కొల్లాటి లక్ష్మీదేవిని పలువురు ప్రశంసించారు.
చదవండి: Dwarapureddy Chandramouli: విధిని ఎదిరించాడు.. విజయం సాధించాడు