School: విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం
వివరాల్లోకి వెళ్తే.. గత వారం రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో 12వ వార్డులోని ప్రాథమిక పాఠశాల స్లాబు నుంచి వర్షపు నీరు కారుతూ గదుల్లోకి నీరు చేరుతోంది. దీంతో విద్యార్థులు కూర్చోవడానికి సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై పలుమార్లు స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు తాళాలు వేశారు.
చదవండి: School Education Department: విద్యార్థుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి
ప్రభుత్వం స్పందించి పాఠశాల మరమ్మతులు చేపడితేనే విద్యార్థులను మరలా పాఠశాలకు పంపుతామని నిరసన తెలిపారు. దీంతో విషయం తెలుసుకున్న సమితి అభివృద్ధి అధికారి దేవసిస్ బోయి, కోరుకొండ అసిస్టెంట్ ఇంజినీర్ సుకాంత్ కుమార్‌స్వయి, బలిమెల ఐఐసీ ధిరేన్ పట్నాయిక్ పాఠశాల వద్దకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడారు. వర్షాలు తగ్గిన వెంటనే కలెక్టర్ విశాల్‌సింగ్‌తో మాట్లాడి మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో తల్లిదండ్రులు నిరసన విరమించారు.
చదవండి: Aadhar for students: మండల కేంద్రాల్లోనే విద్యార్థులకు ఆధార్