School Education Department: విద్యార్థుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి
Sakshi Education
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బడి బయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించడంతోపాటు అన్ని యాజమాన్యాల్లోని విద్యార్థుల వివరాలను స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ పోర్టల్‌లో నమోదు చేసేలా కలెక్టర్లు, డీఈవోలు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు.
ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు అందించిన విద్యార్థుల వివరాలను అధికారులు తనిఖీ చేసి ధ్రువీకరించాలన్నారు. ఇప్పటికే వలంటీర్లు చేసిన సర్వే ప్రకారం18 లక్షల మంది విద్యార్థుల పేర్లు ఇంకా స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ పోర్టల్‌లో అప్‌డేట్ కాలేదన్నారు. గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో ప్రారంభించి జూలై 26కి వంద రోజులు అవుతున్నందున అన్ని స్కూళ్ల హెచ్ఎంలు అప్‌లోడ్ చేసేలా కలెక్టర్‌లు తీసుకోవాలన్నారు. విద్యార్థుల వివరాలు అప్‌లోడ్ చేయకుంటే కఠిన చర్యలు తప్పవని జూలై 25న ఓ ప్రకటనలో హెచ్చరించారు.
చదవండి:
School Inspection: ఆశ్రమ పాఠశాల తనిఖీ
Collector P.Uday Kumar: 290 పాఠశాలల్లో మన ఊరు మన బడి కార్యక్రమం
Published date : 26 Jul 2023 01:34PM