లాటరీ విధానంలో ఈ స్కూళ్లలో పేద పిల్లలకు సీట్లు
Sakshi Education
విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో పేదవర్గాల పిల్లలకు ప్రవేశాలను కల్పించేందుకు విధివిధానాలను విద్యాశాఖ ఖరారు చేసింది.
ఈ మేరకు జూలై 15న ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ జీవో 129 విడుదల చేశారు. దీనిప్రకారం ఆయా స్కూళ్లలో ప్రవేశాలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ పోర్టల్ ద్వారా తమ పిల్లలకు సీట్ల కోసం తల్లిదండ్రులు ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. తమకు సమీపంలోని ఒకటికన్నా ఎక్కువ స్కూళ్లకు వారు వేర్వేరుగా దరఖాస్తు చేయవచ్చు. ఇలా వచ్చిన దరఖాస్తులను అనుసరించి లాటరీ విధానంలో పిల్లలకు సీట్లు కేటాయిస్తారు. ఆయా స్కూళ్లలోని ఒకటో తరగతి లేదా ప్రీ ప్రైమరీ ఉంటే వాటిలోని మొత్తం సీట్లలో 25 శాతం సీట్లు పేదవర్గాల పిల్లలకు కేటాయించనున్నారు.
చదవండి:
Published date : 19 Jul 2022 12:39PM