Skip to main content

Andhra Pradesh: విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు

చింతూరు: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్‌ అన్నారు.
MLC Anantha Udaibhaskar   Revolutionary changes in the education system    Revolutionary Changes in Education System under YSRCP Government

జ‌నవ‌రి 8న‌ స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థులకు వారు ట్యాబ్‌లు పంపిణీచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు దక్కుతుందని, ప్రతి పేదవాడికి విద్యను అందుబాటులో తేవాలనే లక్ష్యంతో విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు చేపట్టారని వారు తెలిపారు.

చదవండి: Artificial Intelligence: కృత్రిమ మేధతో నవ ప్రపంచం?

నాడు–నేడు ద్వారా ప్రతి పాఠశాల రూపురేఖలు మార్చారని, అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన వంటి పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. చింతూరు మండలంలో 750 మంది విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేయడం జరిగిందని, పేద, బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఇవి ఎంతగానో ఉపయోగ పడతాయని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్టీ కమిషన్‌ సభ్యుడు చిచ్చడి మురళి, ఎంపీపీ సవలం అమల, వైస్‌ ఎంపీపీ మేడేపల్లి సుధాకర్‌, కో ఆప్షన్‌ సభ్యుడు అక్బర్‌అలీ, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ రామలింగారెడ్డి, కోట్ల కృష్ణ, ఎంఈవోలు లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Published date : 10 Jan 2024 11:33AM

Photo Stories