Education: విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
మార్చి 31న ఆయన నక్కపల్లిలో బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను, యలమంచిలి పట్టణానికి సమీపంలో ఉన్న కొక్కిరాపల్లి గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. ఆహార మెను గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమావేశంలో మాట్లాడుతూ భావితరాల కోసం ముఖ్యమంత్రి విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకువచ్చారన్నారు.
చదవండి: NCERT: కొత్త పాఠ్య పుస్తకాలు ముద్రణ .. ఇన్ని భాషల్లో..
ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు పథకాన్ని ప్రవేశ పెట్టి కోట్లాది రూపాయల వ్యయంతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సదుపాయాలు కల్పించడం జరుగుతోందన్నారు. 3వ తరగతి నుంచే ఇంగ్లిషు మీడియంను ప్రవేశపెట్టామన్నారు. జగనన్న విద్యాకానుక, అమ్మఒడి, విద్యావసతి వంటి సదుపాయాలను ఉపయోగించుకుని పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఉత్తమ ఫలితాలు సాదిస్తున్నారన్నారు. నక్కపల్లి గురుకుల పాఠశాలలో ఒక విద్యార్థి ఇక్కడ సదుపాయాలు వివరిస్తూ.. ఈ బడి నా సొంత ఇల్లులాంటిదని, టీచర్ నాకు రెండో ఆమ్మలాంటిదని చెప్పడం ఎంతో ఆనందమనిపించిందన్నారు. ఇక్కడ పిల్లలు అనర్గళంగా ఇంగ్లిషులో మాట్లాడుతూంటే ఆశ్చర్యమేసిందన్నారు. పదో తరగతి పరీక్షల్లో చక్కటి ఫలితాలు సాధించాలని సూచించారు.
చదవండి: Scholarships: 2022–23లో ఉపకార, ఫీజు దరఖాస్తులు ఇలా..
కొక్కిరాపల్లి విద్యార్థులు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై నృత్య ప్రదర్శన చేశారు. 10వ తరగతి విద్యార్థులకు హాల్‌టిక్కెట్లు, రైటింగ్ ప్యాడ్, పెన్నులు వంటి పరీక్ష సామగ్రిని అందజేశారు. విద్యార్థులతో కలసి భోజనం చేశారు. కొక్కిరాపల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణతార, యలమంచిలి ఎంపీపీ బోదెపు గోవింద్, మున్సిపల్ వైస్ చైర్మన్ బెజవాడ నాగేశ్వరరావు, నక్కపల్లి ఎంపీడీవో సీతారామరాజు, ఈవోపీఆర్‌డీ వెంకటనారాయణ పాల్గొన్నారు.
చదవండి: Education: మూడు వేల పాఠశాలల్లో ఒక్కరే టీచర్... ఎక్కడంటే