Education: మూడు వేల పాఠశాలల్లో ఒక్కరే టీచర్... ఎక్కడంటే

చదవండి: ప్రవేశాలకు వేళాయే.... కేంద్రీయ విద్యాలయాలకు ఇలా అప్లై చేసుకోండి
3 వేల పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడు
అస్సాంలో దాదాపు 3,000 పాఠశాలల్లో ఒకే ఒక్క ఉపాధ్యాయుడు ఉన్నాడు. అలాగే రాష్ట్రంలో ఉన్న 12,731 పాఠశాలలల్లో విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం నిర్దేశిత విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి మేరకు ఉపాధ్యాయులు లేరు. అలాగే చాలా వరకు స్కూళ్లలో తాగునీటి సదుపాయం కూడా లేదు. సుమారు 1,616 పాఠశాలలకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం లేదని, మరో 1,140 పాఠశాలలకు పక్కా భవనాలు కూడా లేవని మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 511 పాఠశాలలకు ఇప్పటికీ విద్యుత్ కనెక్షన్ లేదని అసెంబ్లీలో చెప్పారు. దాదాపు 14,587 పాఠశాలలు శిథిలావస్థకు చేరుకోవడంతో వాటి స్థానంలో నూతన భవనాలు నిర్మించాల్సిన అవసరం ఉందని మంత్రి వెల్లడించారు. అలాగే తరగతి గదులను కూడా భారీగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు అవసరమైన 22,724 తరగతి గదులను పెంచాల్సి ఉందన్నారు.
చదవండి: ఏప్రిల్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు... సెలవుల లిస్ట్ ఇదే...
భారీగా ఉపాధ్యాయ ఖాళీలు...
అలాగే అస్సాంలో భారీగా ఉపాధ్యాయ ఖాళీలున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో 5,320 ఉపాధ్యాయ పోస్టులు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 9,258 ఉపాధ్యాయ ఖాళీగా ఉన్నాయని మంత్రి తెలిపారు. ఖాళీల భర్తీకి రాష్ట్ర విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నప్పటికీ, న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయన్నారు. టీచర్ల నియామక ప్రక్రియకు సంబంధించి న్యాయపరమైన అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని, అవి తొలగిపోయిన తర్వాతే భర్తీ ప్రక్రియ చేపడతామని వివరించారు.