Model Schools Admissions 2025 : మోడల్ స్కూళ్లలో ప్రవేశాలు.. దరఖాస్తులకు తేదీ పొడగింపు..

సాక్షి ఎడ్యుకేషన్: ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు ప్రభుత్వం మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు అదే మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశాలకు, 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మోడల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక, అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు ప్రకటించారు అధికారులు.
SV University Exams Postpone : ఎస్వీ వర్సిటీలో పరీక్షలు వాయిదా.. విద్యార్థుల ఆగ్రహం..
ప్రభుత్వం జీవో
మోడల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ప్రకటించిన తరగతుల్లో అర్హత ఉన్న విద్యార్థులు వెంటనే దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇక, ఈ నెల 28వ తేదీతో దరఖాస్తులకు గడువు ముగియనుందన్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా.. ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ గడువును కాస్త పొడగించి, చివరి తేదీని మార్చి 10వ వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది.
ప్రవేశ పరీక్షతోనే..
ఓసీ విద్యార్థులు రూ.200, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్‌సీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు రూ.125 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించి, అందులో వారు సాధించే ఉత్తీర్ణత ఆధారంగా ఆరో (6) తరగతిలో చేర్చుకుంటారు.
ఈ స్కూళ్లలో చదివిన విద్యార్థులు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తుండటంతో ప్రతి ఏటా ఈ స్కూళ్లలో ప్రవేశాలకు పోటీ అధికంగానే జరిగింది.
ఉచిత విద్య
ఇక, వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి 2025-2026 6వ తరగతి నుంచి 10వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆన్‌లైన్‌లో స్వీకరిస్తున్నారు. ఇంటర్ వరకు ఉచిత విద్యా బోధన అందుతుండటం, బాలికలకు హాస్టల్ ఫెసిలిటీ ఉండటంతో విద్యార్థులను చేర్పించడానికి పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు వెంటనే ప్రకటించిన తేదీలోగా దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు అధికారులు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- model schools admissions
- Admissions 2025
- Telangana Govt
- Telangana model schools
- sixth class admissions
- applications for model schools admissions
- entrance exams for model schools admissions
- new academic year
- eligibilities for model schools admissions
- model schools applications date extended
- telangana govt order
- telangana model schools admissions 2025
- entrance exams and applications dates and details
- applications and entrance exam details for model schools admissions 2025
- Education News
- Sakshi Education News